అవును.. ప్రేమలో ఉన్నా.. అతడు నా బాధను మర్చిపోయేలా చేశాడు : అమలాపాల్

అవును.. ప్రేమలో ఉన్నా.. అతడు నా బాధను మర్చిపోయేలా చేశాడు : అమలాపాల్

నిజమైన ప్రేమ గాయాలను మాన్పుతుందంటారు. అవును. ప్రేమ గతాన్ని మర్చిపోయేలా చేస్తుంది. గతంలో మన మనసుకు అయిన గాయాలను మానేలా చేస్తుంది. కొత్త ఆశ చిగురించేలా చేస్తుంది. జీవితం ఎంత అందమైనదో చూపిస్తుంది. అందుకే జీవితంలో ఒకసారి ప్రేమలో ఓడిపోతే అక్కడితో జీవితం అయిపోదు.. మళ్లీ మనల్ని ఎంతో ప్రేమించే.. మరో వ్యక్తి మన జీవితంలోకి అడుగుపెడతారు.

జీవితంలో అంతకుముందెన్నడూ లేనంత ఆనందాన్ని అందిస్తారు. అలాంటిదే తన జీవితంలోనూ జరిగిందంటోంది అందాల భామ అమలా పాల్ (Amala Paul). ప్రస్తుతం తన సినిమా ఆమె (తమిళంలో అడై) ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈ భామ తన బాయ్ ఫ్రెండ్ (Boy friend) గురించి మీడియాకి వెల్లడించింది.

Instagram

ఆమె.. అమలాపాల్ బోల్డ్ క్యారక్టర్‌తో అభిమానుల ముందుకొచ్చిన సినిమా ఇది. ఈ సినిమా ఈ రోజు (జులై 19) విడుదలవుతోంది. రత్నకుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్‌లో అమలా పాల్ నగ్నంగా కనిపించడం అందరినీ విస్తుపోయేలా చేసింది. ట్రైలర్‌లోనే ఇలాంటి సన్నివేశాలు ఉంటే.. ఇక సినిమా ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా పంచుకుంది అమల. ఫిల్మ్ కంపానియన్ సౌత్ వెబ్ సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తన బాయ్ ఫ్రెండ్ గురించి కూడా వెల్లడించింది అమల.

Instagram
అందుకే తొందరగా పెళ్లి చేసుకున్నా: అనుష్క శర్మ

"ఈ విషయం గురించి నేను ఇప్పటివరకూ ఎవరికీ చెప్పలేదు. నేను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నా. అతడి పేరు బయటకు చెప్పాలనుకోవట్లేదు. ఈ సినిమా స్క్రిప్ట్ చదివిన తర్వాత దాని గురించి మొదట నా బాయ్‌ఫ్రెండ్‌తోనే మాట్లాడాను. కథ మొత్తం ఎంతో ఆసక్తిగా విన్నాడు. ఆ తర్వాత తను ఏమంటాడా? అని నేను వేచి చూస్తున్నా. అప్పుడే తను ముందు నీపై నువ్వు శ్రద్ధ పెట్టాలి. ఈ సినిమా నువ్వు చేయాలనుకుంటే వంద శాతం శారీరకంగా, మానసికంగా దాని కోసం సిద్ధమై చేయాల్సి ఉంటుంది. అలా చేయలేను అనుకుంటే నువ్వు ఈ సినిమా చేయడం మానేసెయ్" అని చెప్పాడు.. అంటూ సినిమాకి ముందు అతడు ఇచ్చిన సపోర్ట్ గురించి వెల్లడించింది.

Instagram

అంతేకాదు.. తన బాయ్ ఫ్రెండ్ తన కెరీర్ కోసం.. అతడి కెరీర్‌ని కూడా త్యాగం చేసి తనతో పాటే ఉండిపోయాడని చెప్పింది అమల. "ఈ రోజు నేను ఇలా ఉన్నానన్నా.. నా పనిలో వంద శాతం శ్రద్ధ తీసుకుంటున్నానన్నా అదంతా అతడి వల్లే. నేను ఎప్పుడూ కారణం లేకుండానే కోపంగా ఉండేదాన్ని. కానీ అతడి నిజమైన ప్రేమ నన్ను మార్చింది. నాలోని కోపాన్ని తగ్గించింది. సాధారణంగా మనల్ని ఏ కారణం లేకుండా ప్రేమించి మన కోసం త్యాగం చేసేది అమ్మ మాత్రమే. కానీ నా విషయంలో నా బాయ్‌ఫ్రెండ్ కూడా. ఎందుకంటే తను తన ఉద్యోగాన్ని వదిలేసి తన భవిష్యత్తును త్యాగం చేసి నా కోసం.. నన్ను సపోర్ట్ చేయడం కోసం మాత్రమే ఇక్కడ ఉండిపోయాడు. ఎందుకంటే నాకు సినిమాలంటే ఎంత ఇష్టమో తనకు తెలుసు కాబట్టి" అని తెలిపింది అమలా పాల్.

నాకు మీరాకి మధ్య గొడవ.. దాదాపు పదిహేను రోజులుంటుంది: షాహిద్ కపూర్
Instagram

అయితే గతంలో నేను నటించిన కొన్ని సినిమాలు తను చూశాడు. నేను మంచి నటిని కాదని తన అభిప్రాయం. నా నటన గురించి ఆలోచించకుండా.. దాన్ని మెరుగుపర్చుకోకుండా ఇన్ని రోజులు ఎలా కొనసాగానని ఆశ్చర్యపోయాడు కూడా. తనెప్పుడూ నాలోని లోపాల గురించి నా ముందే మాట్లాడతాడు. మనం నటీనటులం. మన చుట్టూ మనల్ని పొగిడే వ్యక్తులనే ఉంచుకుంటాం. కానీ ఆ వ్యక్తులు మనం ముందుకు వెళ్లడానికి ఏ మాత్రం సాయపడరు.

వాళ్లు మనల్ని పొగడడం మనకు తాత్కాలికంగా సంతోషాన్ని కలిగిస్తుందేమో.. కానీ వాళ్లు నిజం చెప్పకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. నా జీవితం అలాంటి వ్యక్తులతో నిండిపోయిన సమయంలోనే.. తను నా జీవితంలోకి వచ్చాడు. నా జీవితాన్ని మార్చేశాడు. తన కామెంట్లు విన్న తర్వాతే నటిగా నేనంటే ఏంటో నిరూపించుకోవాలని అద్బుతమైన స్క్రిప్ట్ కోసం వెతకడం ప్రారంభించాను. అప్పుడే ఈ కథ నా దగ్గరికి వచ్చింది.. అంటూ చెప్పుకొచ్చింది.

Instagram

'ఆమె' సినిమా తర్వాత కెరీర్‌ని ఆపేయాలనుకున్నా.. అని చెప్పిన అమలాపాల్ .. "ఈ కథ నా ముందుకు రాకముందు నాకొచ్చే కథలేవీ నాకు నచ్చలేదు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే వచ్చేవి. కానీ వాటి కథ చాలా సింపుల్‌గా ఇంతకుముందు వచ్చిన కథల్లాగే అనిపించేది. దీంతో నటించడం మానేద్దామని నిర్ణయించుకున్నా. అప్పుడే ఈ కథ నా దగ్గరికి వచ్చింది.

ఇందులో నగ్నంగా ఉండే సీన్ గురించి నాకు షూటింగ్ సమయంలో చెప్పారు. ప్రత్యేకమైన కాస్ట్యూమ్ వేసుకోవాలని చెప్పారు. కంగారు పడొద్దు.. నేను చేస్తానని చెప్పాను. కానీ ఆ సమయం వచ్చేసరికి నాకే కంగారొచ్చింది. సెట్స్‌లో ఏం జరుగుతుంది.. ఎవరెవరు ఉంటారు. సెక్యూరిటీ ఉంటుందా? లేదా? ఇలా చాలా విషయాల గురించి ఆలోచించి భయపడ్డా. కానీ ఆ సీన్ సమయంలో కేవలం పదిహేను మంది మాత్రమే సెట్స్‌లో ఉండేలా ప్లాన్ చేసి షూటింగ్ చేశారు. ఈ సినిమా అవుట్‌పుట్‌తో నేను చాలా ఆనందంగా ఉన్నా.." అంటూ వెల్లడించింది అమల.

అలా అయితే పెళ్లయి ముగ్గురు పిల్లలు కూడా ఉండేవారు : శ్రుతి హాసన్
Instagram

ప్రముఖ తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ని ప్రేమించి, 2014లో పెళ్లాడిన అమలాపాల్ 2017లో విడాకులు తీసుకున్నారు. దీనికి చాలా కారణాలున్నాయంటూ.. వీరిద్దరూ ప్రకటించడం విశేషం. అమలతో విడాకుల తర్వాత ఇటీవలే విజయ్ మరో వివాహం చేసుకున్నారు. ఐశ్వర్య అనే డాక్టర్‌ని వివాహమాడిన విజయ్‌కి అమల శుభాకాంక్షలు కూడా చెప్పడం విశేషం. విజయ్ చాలా మంచి వ్యక్తి. అద్భుతమైన మనిషి. నేను మనస్పూర్తిగా తనకి శుభాకాంక్షలు చెబుతున్నా. వారిద్దరి వివాహ జీవితం ఆనందంగా ఉండాలి.. ఎంతోమంది పిల్లలతో వారు సంతోషంగా జీవితం గడపాలి.. అంటూ ఆమె వెల్లడించడం విశేషం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.