పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి (Powerstar Pawan Kalyan) ఉన్న క్రేజ్ బహుశా ఇప్పటితరం హీరోలలో మరెవరికి లేదంటే అతిశయోక్తి కాదేమో. ఆయన తన అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సాహంతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి .. అనతికాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నాడు. అంతే కాకుండా.. తనకంటూ ఒక స్థాయిలో ఫ్యాన్ బేస్‌ను కూడా క్రియేట్ చేసుకోగలిగాడు. ఆ తరువాత కాలంలో ఆయనని ఎందరో స్ఫూర్తిగా కూడా తీసుకున్నారు.
Table of Contents
అయితే ఆయన క్రేజ్ కేవలం సినిమాలకే పరిమతమవ్వకుండా.. రాజకీయాలకి సైతం విస్తరించింది. దీన్నిబట్టి చూస్తే, కేవలం ఆయనలోని హీరోయిజానికే కాకుండా.. వ్యక్తిత్వానికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది. ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. రాజకీయ రంగంలోకి ప్రవేశించినా కూడా.. ఆయన అభిమానుల సంఖ్య తగ్గలేదన్నది మాత్రం నిజం. అలాగే కోట్లాది రూపాయల సంపాదనను కూడా త్యజించి.. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాడన్న మంచి అభిప్రాయం ఆయనపై ఉంది.
పవన్ కూడా హీరోగా తన భవిష్యత్తుని సైతం వదిలిపెట్టి.. ఇలా రాజకీయాలలోకి రావడం వల్ల.. తన కుటుంబానికి న్యాయం చేయలేకపోయారనే భావన ఉన్నప్పటికీ.. ప్రజల కోసం ఏదైనా చేయడం కోసమే.. ఆయన రాజకీయాల్లోకి వచ్చినట్లు చెబుతుంటారు.
‘ప్రతి ప్రేమకథ కంచికి చేరదు’ అని తెలిపే.. ‘పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్’ల లవ్ స్టోరీ ..!
ఇక పవన్ కళ్యాణ్ తన అభిమానులని ఉత్తేజపరచడానికి.. చాలా ప్రభావవంతంగా మాట్లాడుతుంటారు. ఇదే విషయాన్ని ఆయన అభిమానులు పలుమార్లు ప్రస్తావించారు కూడా. ఈ క్రమంలో మేము కూడా పవన్ నటించిన 25 చిత్రాలలో నుండి.. కొన్ని పాపులర్ డైలాగ్స్‌ని ఈ ప్రత్యేక కథనంలో అందిస్తున్నాం.
పవన్ కళ్యాణ్ చెప్పిన పాపులర్ డైలాగ్స్
(50 Famous Dialogues from Powerstar Pawan Kalyan Films)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 25 చిత్రాలలో నుండి ఆయన చెప్పిన & జనం మెచ్చిన పాపులర్ డైలాగ్స్‌ను ఇక్కడ చదివేయండి
1. చూడప్ప సిద్దప్ప… నేనొక మాట చెప్తాను.. పనికొస్తే ఈడ్నే వాడుకో.. లేదంటే ఏడనైనా వాడుకో.. నేను సింహాలాంటోడినప్ప .. అది గడ్డం గీసుకోలేదు!! నేను గీసుకోగలను.. అంతే తేడా!! మిగతాదంతా సేమ్ టు సేమ్.. అయినా లాస్ట్ పంచ్ మనదైతే దానికొచ్చే కిక్కే వేరప్పా. – అత్తారింటికి దారేది (Attarintiki Daredi)
2. గీతలో శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడో తెలుసా… పని పూర్తయ్యే వరకు ఒరిజినల్స్.. డూప్లికేట్స్ ఇవ్వద్దు అన్నాడు నాయన! – గుడుంబ శంకర్ (Gudumba Shankar)
3. వెతికితే నీకు ఆనందం దొరికే ఛాన్స్ ఉంటుందేమో కాని… నిన్ను చంపితే మాత్రం, నీ శవం కూడా ఎవ్వరికి దొరకదు – అత్తారింటికి దారేది (Attarintiki Daredi)
4. జీతాలిచ్చే వాళ్ళ పైన జోకులేస్తే.. ఇలానే జీవితం తలకిందులైపోద్ది ఎదవ – అత్తారింటి దారేది (Attarintiki Daredi)
5. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం… అలాంటివాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే – తీన్ మార్ (Teenmaar)
6. ఏయ్ … నువ్వు నందా అయితే… నేను బద్రి.. బద్రీనాథ్.. అయితే ఏంటి? – బద్రి (Badri)
7. ఏయ్ నేనెవరో యెర్కనా… గుడుంబ సత్తి .. గుడుంబ సత్తి.. మీరు గుడుంబ సత్తి కావొచ్చు .. తొక్కలో సత్తి కావొచ్చు… బట్ ఐ డోంట్ కేర్.. బికాజ్ ఐ యామ్ సిద్దు.. సిద్దార్థ్ రాయ్ – ఖుషీ (Khushi)
8. ఒకరు నచ్చలేదు అని చెప్పడానికి వెయ్యి కారణాలు చెప్పొచ్చు. కాని నచ్చారని చెప్పడానికి కారణాలేం చెప్పలేం. నచ్చారు అంతే – సుస్వాగతం (Suswagatham)
9. ఒక్కడినే… ఒక్కడినే… ఎంతదూరం వెళ్ళాలన్న ముందడుగు ఒక్కటే! ఎంతమంది మోసే చరిత్రైనా రాసేది ఒక్కడే! ఎక్కడికైనా వస్తా.. జనంలో ఉంటా.. జనంలా ఉంటా… – గబ్బర్ సింగ్ 2 (Gabbar Singh 2)
10. రేయ్.. కోపాన్ని, ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకో… – కాటమరాయుడు(Katamarayudu)
11. అవతల వాళ్ళు మనల్ని చంపడానికి వచ్చినప్పుడు.. మనం చావాలా లేక చంపాలా – గబ్బర్ సింగ్ (Gabbar Singh)
12. గ్రాముల్లో, కిల్లోలో కాదు.. టన్నుల్లో ఇస్తాను .. భయం … భయం – జల్సా (Jalsa)
13. ఒక్కసారి చెయి పట్టుకుంటే.. సచ్చెదాక వదిలిపెట్టను – తీన్ మార్ (Teenmaar)
14. మానెయ్యడమంటే పారెయ్యడం కాదురా!! పక్కన ఉంచుకుని మరి ఆపెయ్యడం – గబ్బర్ సింగ్ (Gabbar Singh)
15. నేను చెప్పినా ఒకటే! నా ఫ్యాన్స్ చెప్పినా ఒకటే – గబ్బర్ సింగ్ (Gabbar Singh)
16. నాకు నేను పోటీ, నాతో నేనే పోటీ – గబ్బర్ సింగ్ (Gabbar Singh)
17. పాపులారిటదేముంది.. అది పాసింగ్ క్లౌడ్ లాంటిది.. వాతావరణం వేడిక్కితే వానై కరిగిపోతుంది. నేను ఆకాశం లాంటోడిని.. ఉరుమొచ్చిన, పిడుగొచ్చినా & మెరుపొచ్చినా.. నేను ఎప్పుడు ఒకేలా ఉంటాను – గబ్బర్ సింగ్ (Gabbar Singh)
18. నాకొంచెం తిక్కుంది.. కాని దానికో లెక్కుంది. – గబ్బర్ సింగ్ (Gabbar Singh)
19. ఈ కత్తులు & కొడవళ్ళు భయపడే వారికి చూపెట్టూ.. భయమంటే తెలియని నాకు కాదు – బంగారం (Bangaram)
20. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి… జీవితమంటే పూల పాన్పు కాదు! ఎప్పుడు సంతోషమే కాదు, అప్పుడప్పుడు బాధని కూడా భరించడం నేర్చుకోవాలి – బాలు (Balu)
21. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేది నిప్పు & పోరాడేవాడే మనిషి… నువ్వు మనిషివైతే జీవితంలో పోరాడు! నాతో కాదు – బాలు (Balu)
22. మీ డబ్బు, పరపతి, గుండాయిజం మనుషుల ప్రాణాలు తీయడానికి ఉపయోగపడుతుందేమో కాని.. మనుషుల ప్రాణాలు పోయడానికి మాత్రం కాదు – ఖుషి (Khushi)
23. జీవితంలో అందరికి ఏదో కావాలి. డబ్బు, పరపతి, స్థాయి, సుఖం… ఇంకేదో!! కాని నాకు నేను కోల్పోయిన ఆనందం కావాలి – పంజా (Panjaa)
24. సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పో! సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు! – పంజా (Panjaa)
25. నేనొచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి.. టైం మారాలి, టైం టేబుల్ మారాలి.. మారకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా.. – గబ్బర్ సింగ్ 2 (Gabbar Singh 2)
26. నిజమైన ప్రేమకి అర్ధమేంటో తెలుసా.. మనం ప్రేమించినవాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే – తొలిప్రేమ (Tholiprema)
27. పుట్టిన ప్రతి ఎదవా భూమి తన సొంతమనుకుంటాడు.. కాని ఏ ఎదవైనా భూమికే సొంతం – గబ్బర్ సింగ్ 2 (Gabbar Singh 2)
28. ప్రేమ, దోమ.. ఇలాంటి తొక్కలో కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నన్ను చూడు.. ఎంత సంతోషంగా ఉన్నానో, ఎంత ఉల్లాసంగా ఉన్నానో.. – ఖుషి (Khushi)
29. ఆ అమ్మాయి కనిపించినప్పుడల్లా .. నాకేం జరుగుతుందో, నేను ఏం చేస్తున్నానో నాకే అర్ధం కావట్లేదు.. హృదయం స్థంబించిపోతుంది – తొలిప్రేమ (Tholiprema)
30. నీకోసం నెలలు కాదు, సంవత్సరాలు కాదు.. ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తుంటాను… ప్రేమ మన లక్ష్యాన్ని సాధిస్తుంది – తొలిప్రేమ (Tholiprema)
31. ప్రేమంటే ఇష్టమైనప్పుడు… నువ్వంటే నాకెంతో ఇష్టం. అటువంటిది ఇప్పుడు ప్రేమంటేనే నచ్చడం లేదు.. ఇంకా నువ్వేం నచ్చుతావ్ – సుస్వాగతం (Suswagatham)
32. నేను మార్గదర్శిలో చేరాను! ఒక గన్ను కొనుక్కున్నాను – జల్సా (Jalsa)
33. యుద్ధంలో గెలవడమంటే శత్రువుని చంపడం కాదు.. శత్రువుని ఓడించడం.. శత్రువుని ఓడించటమే యుద్ధం ఒక్క లక్ష్యం – జల్సా (Jalsa)
34. అందంగా ఉండటం అంటే మనకి నచ్చేలా ఉండటం… ఎదుటివాళ్ళకి నచ్చేలా ఉండటం కాదు – జల్సా (Jalsa)
35. నేను ట్రెండ్ ఫాలో అవ్వను .. ట్రెండ్ సెట్ చేస్తాను – గబ్బర్ సింగ్ (Gabbar Singh)
36. అసంతృప్తి , భావప్రాప్తి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కాని.. ఇలా మార్కెట్ మీద పడ్డారేంటి రా!! – గబ్బర్ సింగ్ (Gabbar Singh)
37. కంటెంట్ ఉన్నోడికి కటవుట్ చాలు – గబ్బర్ సింగ్ (Gabbar Singh)
38. నేను టైంకి రావడం కాదు మిత్రమా… నేను వచ్చాకే టైం వస్తుంది – గోపాల గోపాల (Gopala Gopala)
39. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వొచ్చు కాని… రావడం మాత్రం పక్కా.. – గోపాల గోపాల (Gopala Gopala)
40. ఇది మనం కూర్చునే కుర్చీ.. పచ్చని చెట్టుని గొడ్డలితో పడగొట్టి, రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి, బెరడుని బ్లేడుతో సానబెట్టి, ఒళ్ళంతా మేకులు కొట్టి కొట్టి తయారుచేస్తారు. ఎంతో హింస దాగుంది కదా! జీవితంలో మనం కోరుకునే సౌకర్యం వెనుక ఒక మినీ యుద్ధమే ఉంటుంది. – అజ్ఞాతవాసి (Agnathavaasi)
41. చరిత్ర స్మరించుకుంటుంది, ఝాన్సీ లక్ష్మి భాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాలని… కాని ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు… ఆంగ్లేయులు పైన తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు .. సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy) చిత్రంలో .
42. మీ ప్రేమ నిజమైతే.. ఆ ప్రేమే మిమ్మల్నిద్దరిని కలుపుతుంది – ఖుషి (Khushi)
43. జీవితంలో దేనినైనా నాశనం చేయడం చాలా తేలిక. సృష్టించడం చాలా కష్టం. సృష్టించడం తెలియని వాళ్ళకి నాశనం చేసే హక్కు లేదు . – బాలు (Balu)
44. చిరంజీవి…. ఓ ఫిలిం యాక్టర్ చిరంజీవా!! ఫైట్లు చేస్తాడు, డ్యాన్సులు బాగా చేస్తాడు. రక్తదానాలు, బ్లడ్ బ్యాంక్, సంఘ సేవ… ఐ లైక్ హిమ్. మంచి వ్యక్తి , ఆయనంటే మనకి కూడా బాగా ఇష్టం. – ఖుషి (Khushi)
45. సింహం పడుకుంది కదా అని జూలుతో జడ వేయకూడదు రా .. అదే పులి పలకరించింది కదా
అని పక్కన నిలబడి ఫోటో దిగాలనుకోకూడదు రోయి – అత్తారింటికి దారేది (Attarintiki Daredi)
46. అమ్మితే కొనుక్కో అది వ్యాపారం, అంతే తప్ప లాక్కోకు .. అది దౌర్జన్యం. – అత్తారింటి దారేది (Attarintiki Daredi)
47. రేయ్ .. ఆయన గాంధీగిరికి తలొంచి మౌనంగా ఉన్నాను… అదే దాదాగిరి చేస్తే మీలో ఒక్కడు కూడా మిగలడు – శంకర్ దాదా జిందాబాద్ (Shankar Dada Zindabad)
48. నేనెవరో తెలుసా.. భగభగమండే భూమి పొరల్లోంచి వచ్చిన బంగారం. దాన్ని ముట్టుకుంటే మాడి మసైపోతావ్ – బంగారం (Bangaram)
49. భయమున్నోడు అరుస్తాడు.. బలమున్నాడు భరిస్తాడు – అత్తారింటి దారేది (Attarintiki Daredi)
50. నాకు తిక్కలేస్తే.. చీమైనా ఒక్కటే.. సీఎం అయినా ఒక్కటే – కెమెరామెన్ గంగతో రాంబాబు (Cameraman Ganga Tho Rambabu)
‘అల్లు అర్జున్ – స్నేహ రెడ్డిల’ ప్రేమకథ.. సినిమా కథని మరిపించేలా ఉంటుంది తెలుసా…!
ఈ డైలాగ్స్ చదవగానే మీకు కూడా ఒక్కసారి ఆయా చిత్రాలలోని సన్నివేశాలు.. మీ కళ్ళముందు కదలాడే ఉంటాయి. ఎందుకంటే ఈ డైలాగ్స్ అన్ని పవన్ కళ్యాణ్ నోట వచ్చినప్పుడు థియేటర్స్‌లో.. అభిమానుల ఆనందానికి అవధులుండవని తెలుసు. మీరు మరోసారి ఈ డైలాగ్స్ గుర్తు చేసుకుని.. ఆ చిత్రాలని నెమరువేసుకొని ఉంటారనే అనుకుంటున్నాం.
అలాగే పైన చెప్పిన డైలాగ్స్ మాత్రమే కాకుండా.. మీకు ఇంకేదైనా మంచి పాపులర్ డైలాగ్ ఆయన చెప్పింది గుర్తుకు వస్తే.. కామెంట్ బాక్స్‌లో తప్పకుండా తెలియజేయండి. అలాగే పైన పేర్కొన్న 50 డైలాగ్స్‌లో.. మీకు బాగా నచ్చిన డైలాగ్‌ని కూడా ఈ క్రింది కామెంట్ బాక్స్‌లో పోస్టు చేయండి. ఆ డైలాగ్‌తో మీకున్న వ్యక్తిగత అనుబంధమేమిటో కూడా పంచుకోండి. ఈ పైన చెప్పినవే కాకుండా.. పవన్ కళ్యాణ్ డైలాగ్స్‌లో ఇంకా మీకు నచ్చినవి ఏవైనా ఉంటే.. వాటిని కూడా ఇందులో జతచేసి ప్రయత్నం చేస్తాం.