Entertainment

తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించిన.. యూట్యూబ్ ఛాన‌ల్స్ ఇవే..! (Famous Youtube Channels In Telugu Language)

Sandeep Thatla  |  Feb 11, 2019
తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించిన.. యూట్యూబ్ ఛాన‌ల్స్ ఇవే..! (Famous Youtube Channels In Telugu Language)

మునుప‌టి రోజుల్లో వినోదం కోసం ప్ర‌జ‌లు ఎక్కువ‌గా సినిమా (Cinema) ల‌ను ఆశ్ర‌యించేవారు. కానీ ఆ త‌ర్వాత వ‌చ్చిన టీవీ (Television) లు ఇంటి వ‌ద్దే వినోదాన్ని అందించ‌డం ప్రారంభించ‌డంతో వీటిని బాగా ఆద‌రించారు సామాన్య ప్ర‌జానీకం. ఇక ప్ర‌స్తుతం పెరుగుతోన్న టెక్నాల‌జీ పుణ్య‌మా అని అన్నీ అర‌చేతుల్లోనే క‌నిపించేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే సినిమాలు, టీవీల‌ను త‌ల‌ద‌న్నేలా వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్, మినీ షోస్ .. వంటివి ఎన్నో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ప్రసిద్ధ తెలుగు యుట్యూబ్ ఛానళ్ళు (Popular Telugu Youtube Channels You Need To Follow)

ప్రేక్ష‌కులు కూడా వాటిని అంతే చ‌క్క‌గా ఆద‌రిస్తున్నారు. అందుకే యూట్యూబ్ (YouTube) లో సైతం ఎంతోమంది ఎన్నో ఛానళ్ల‌ను ప్రారంభించి ఎవ‌రికి వారు త‌మదైన శైలిలో వినోదాన్ని పంచేందుకు సిద్ధ‌మైపోతున్నారు. అయితే ఇందులో రోజూ కొత్త కొత్త ఛానల్స్ పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొస్తున్న‌ప్ప‌టికీ కొన్ని మాత్రం వాటి స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాయ‌నే చెప్పాలి. ఎందుకంటే వాటికి ల‌భించిన ప్రేక్ష‌కాద‌ర‌ణ అలాంటిది మ‌రి. ఈ విధంగా తెలుగులో బాగా పాపుల‌ర్ అయిన కొన్ని యూట్యూబ్ ఛాన‌ల్స్ ఏవో మ‌న‌మూ చూద్దాం రండి..

చికాగో సుబ్బారావు (Chicago Subbarao)

అమెరికాలో ఉండే పృథ్వీ రాజ్, ప్రణీత్, & హరీష్ ల సృష్టే ఈ చికాగో సుబ్బారావు ఛానల్. వీరు అమెరికాలో తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటూ చేసే వీడియోలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీరి ఫాలోయర్స్ సంఖ్య అక్షరాలా 1 కోటి దాటి ప్రస్తుతం 1 కోటి 50 లక్షలకి చేరువలో ఉంది, దీన్ని బట్టి ఈ ఛాన‌ల్ కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న పాపులారిటీ ఎలాంటిదో మీరే అర్ధం చేసుకోవచ్చు.

మహాతల్లి (Mahathalli)

మహాతల్లి పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసిన జాహ్నవి అందులో ప్రతి వారం ఏదో ఒక టాపిక్ తీసుకుని దాని పైన వీడియోలు రూపొందిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమె ఛానల్ కు ఉన్న ఫాలోయర్స్ సంఖ్య 10 లక్షలు దాటింది. ఆమె తీసుకునే టాపిక్స్ కూడా స‌మ‌కాలీన అంశాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటూ మ‌న డైలీ రొటీన్ లో మ‌న‌కూ ఎదురైన‌ట్లే ఉంటాయి. అందుకే వాటికి ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ కూడా అంతే చ‌క్క‌గా ఉంటుంది.

మై విలేజ్ షో (My Village Show)

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి ఊర్లోని కొందరు యువకులు వారి ఊరిలో జరిగే విశేషాలని షూట్ చేసి యు ట్యూబ్ లో పెట్టడంతో ఈ ఛాన‌ల్ మొద‌లైంది. ఇది వారి గురించి ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు వారికి పరిచయమయ్యేలా చేసింది. ఇప్పుడు ఈ ఛాన‌ల్ కు ఉన్న ఫాలోయర్స్ సంఖ్య ఎంతో తెలుసా?? అక్ష‌రాలా 6.60 లక్షలు.

వైవా (VIVA)

వైవా పేరుతో వచ్చిన షార్ట్ ఫిలిం దాదాపు అందరు చూసే ఉంటారు. ఆ వీడియోలో ప్రధాన పాత్ర పోషించిన హర్ష సారథ్యంలోనే ఈ వైవా ఛానల్ నడుస్తుంటుంది. రకరకాల‌ వినోదాత్మక వీడియోలను ఇందులో పోస్ట్ చేస్తూ ఇప్పుడు డిజిటల్ మీడియాలో తనకంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హ‌ర్ష‌. ప్రస్తుతం ఈయన ఫాలోయ‌ర్స్ సంఖ్య 10 లక్షలు దాటింది.

ఐ డ్రీమ్ మీడియా (iDream Media)

సోషల్ మీడియా అందులోనూ యూట్యూబ్ తో పరిచయం ఉన్న వారెవ‌రికైనా సరే.. ఈ ఛానల్ గురించి త‌ప్ప‌కుండా ఎంతో కొంత అవగాహన ఉండి తీరుతుంది. అంతలా ప్రజల్లోకి వెళ్ల‌గ‌లిగింది ఈ ఛాన‌ల్. ప్ర‌ధానంగా అన్ని రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను ఇంట‌ర్వ్యూలు చేస్తూ ఆ వీడియోల‌ను ఈ ఛాన‌ల్ లో అప్ లోడ్ చేస్తుంటారు. ఈ మీడియాలో ప్రధానంగా ఉన్న చానెళ్ళు, వాటి ఫాలోయర్స్ వివరాలు – ఐ డ్రీమ్ న్యూస్ (iDream News)- 3.60 లక్షలు & ఐ డ్రీమ్ తెలుగు మూవీస్ (iDream Telugu Movies) – 25 లక్షలు.

ధేతడి (Dhethadi)

ఈ ఛానల్ కూడా దాదాపు మహాతల్లి ఛానల్ ని పోలి ఉంటుంది. అయితే ఇందులో అలేఖ్య ప్రధాన పాత్రలో నటిస్తున్నది. ఇక అలేఖ్య ప్రత్యేకత ఏంటంటే – ఆమె ఫక్తు తెలంగాణ మాండలికంలో మాట్లాడడమే.. ఈ వీడియోస్ అన్నింటిలోనూ ఆమె తెలంగాణ యాసని చక్కగా పలుకుతుంటుంది. ప్రస్తుతం ఈ ఛానల్ కు ఉన్న ఫాలోయ‌ర్ల సంఖ్య – 6.5 లక్షలు.

గర్ల్ ఫార్ములా (Girl Formula)

గర్ల్ ఫార్ములా అంటూ కొందరు అమ్మాయిలు ఒక గ్రూప్ గా చేరి మన జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా వీడియోలు తీసి పెడుతుంటారు. ఈ ఛాన‌ల్ కు ఉన్న ఫాలోయర్స్ సంఖ్య 4 లక్షల పైచిలుకే…

బాయ్ ఫార్ములా (Boy Formula)

గర్ల్ ఫార్ములా విజయంతో బాయ్ ఫార్ములా కి బీజం పడింది. అలా మొదలైన ఈ ఛానల్ కూడా ఇప్పుడిప్పుడే ప్రజాద‌రణ పొందుతున్నది. దీని ఫాలోయర్స్ సంఖ్య ప్రస్తుతం 1 లక్షకి దగ్గరగా ఉంది.

ఈ ఛానెల్స్ లో ఉన్న ప్రతి వీడియోలు మన జీవితంలో జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నవే..! అందుకే ఇవి ప్రజలని అంతగా ఆకట్టుకోగలుగుతున్నాయి… అయితే ఇక్క‌డ మేం చెప్పిన‌వి కేవ‌లం వినోద రంగానికి సంబంధించిన కొన్ని ఛాన‌ల్స్ గురించే.. ఇలా ర‌క‌ర‌కాల అంశాల‌పై వీడియోలు పోస్ట్ చేస్తూ తెలుగులో బాగా పాపుల‌ర్ అయిన యూట్యూబ్ ఛాన‌ళ్ల జాబితా ఇంకా చాలా పెద్ద‌దే ఉంటుందండోయ్..

ఇవి కూడా చ‌ద‌వండి

తెలంగాణ స్పెషల్ వంటకం – సర్వ పిండి ముచ్చట్లు మీకోసం..!

హైదరాబాద్ వెళ్తున్నారా… అయితే తప్పకుండా ఈ ఖీర్ టేస్ట్ చేయండి..!

గండికోట – ది ఇండియన్ గ్రాండ్ కాన్యన్ .. ఈ ప్ర‌దేశాన్ని అంద‌రూ చూసి తీరాల్సిందే..!

Read More From Entertainment