Food & Nightlife

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ పార్టీ చేసుకోవాలంటే.. ఈ 15 బెస్ట్ స్పాట్స్‌‌కి వెళ్లాల్సిందే..!

Sandeep Thatla  |  Dec 25, 2018
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ పార్టీ చేసుకోవాలంటే.. ఈ 15 బెస్ట్ స్పాట్స్‌‌కి వెళ్లాల్సిందే..!

డిసెంబర్ 31న పార్టీ చేసుకోవడానికి 15 బెస్ట్ స్పాట్స్ ఇవే…

మడిసన్నాక కాసింత కళాపోషణ ఉండాలయ్యా … ఉత్తినే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటాది?”  ముత్యాలముగ్గు సినిమాలో ముళ్ళపూడి రమణ గారు రాసిన ఈ డైలాగ్‌ని రావు గోపాలరావు తనదైన శైలిలో చెప్పడంతో ఈ డైలాగ్‌కి స్టార్ స్టేటస్ వచ్చిందనే చెప్పాలి.

ఇక ఈ సూపర్ హిట్ డైలా‌గ్‌ని మనకి బాగా నచ్చిన ఏదైనా విషయానికి ఆపాదించి.. మనకి కావాల్సినట్టుగా వాడేసుకుంటూ ఉంటాము. అయితే ఈ సందార్భానికి సదరు డైలాగ్‌ని మేమిలా మార్చేశాం – “మడిసన్నాక  కాసింత  విందు-వినోదాన్ని ఆస్వాదించేలా ఉండాలయ్యా.. ఉత్తినే ఇంటిలో కుసుంటే మనకి గోడకి తేడా ఏటుంటాది

మేము ఈ డైలాగ్ చెబుతోంది ఎవరి కోసమో తెలుసా.. డిసెంబర్ 31న పార్టీ చేసుకునే & చేసుకోబోయే వారి కోసం.

ఏడాది పొడుగునా రోజువారీ పనులతో బిజీ  బిజీగా  గడిపేసి అనేక సమస్యలతో  మునిగిపోయిన వారు డిసెంబర్ 31 (December 31) రాత్రిని సేదతీరే వేళగా భావిస్తుంటారు చాలామంది.  

అలా కొత్త సంవత్సరాన్ని (New Year) ఆహ్వానిస్తూ  చేసుకునే పార్టీకి సంబంధించి ఇప్పటికే మన స్నేహితులలో  కొంతమంది చాలా ఆలోచనలు చేసి ఉంటారు. ఎక్కడ ఈ పార్టీ చేసుకుంటే బాగుంటుంది? ఫ్రెండ్స్‌తో వెళితే ఎక్కడికి వెళ్ళాలి? పోని మన లైఫ్ పార్టనర్‌తో వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పార్టీ  చేసుకోవడానికి మన బడ్జెట్‌లో ఉన్న పబ్  ఏది? ఆ పబ్  ఎక్కడ ఉంది?  హైదరాబాద్ సిటీలో మంచి రెస్టారెంట్స్  ఎక్కడ ఉన్నాయి? ఏ పబ్‌లో సొంత భృ (Brew) ఉంది? డ్యాన్స్ ఫ్లోర్ (Dance Floor) ఎక్కడైతే బాగుంటుంది? రాత్రి పార్టీ అయ్యాక ఇంటికి రావడానికి క్యాబ్  ఫెసిలిటీ (Cab Facility) ఉన్న రెస్టారెంట్ ఏది?

 

ఇలా న్యూ ఇయర్ పార్టీకి  సంబంధించి  అనేక ప్రశ్నలు మిమ్మల్ని చికాకుపెడుతున్న సమయంలో మీ ప్రశ్నలన్నిటికీ వీలైనంతవరకు ఈ క్రింద సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అయితే అందులో ఏ పబ్‌కి లేదా ఏ  రెస్టారెంట్‌కి వెళ్తే ఎంత  అవుతుంది అనే విషయాన్ని మాత్రం అందరికీ సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించడం జరిగింది.

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రత్యేకంగా సిద్దమయ్యే 15 పబ్ & రెస్టారెంట్స్‌లు ఎక్కడ ఉన్నాయి. వాటి బడ్జెట్ ఎంత ఉంటుంది. అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి అన్న సమాచారం విపులంగా మీకోసం…    

గమనిక – ఇక్కడ చెప్పే బడ్జెట్ ఇద్దరికి కలిపి అయ్యే ఖర్చు… (Budget Estimates for 2 People)

 

ముందుగా  బడ్జెట్ రూ 1500/- వరకు ఉండే పబ్స్ & రెస్టారెంట్స్ గురించి – (Range up to Rs 1500)

 

క్లబ్ 8 (Club 8) – బేగంపేట్ (Begumpet) & కొండాపూర్ (Kondapur, Hyderabad) – Rs 800/-

 

క్లబ్  N (Club N) – జూబ్లీ హిల్స్ (Jubilee Hills) – Rs 950/-

 

సౌండ్స్ & స్పిరిట్స్ (Sounds & Spirits) – మాదాపూర్ (Madhapur) – Rs 1100/-

 

స్పాయిల్ (Spoil) – జూబ్లీ హిల్స్ (Jubilee Hills) – Rs 1100/-

 

ప్రిజమ్ క్లబ్ (Prism Club) – గచ్చిబౌలి (Gachibowli)- Rs 1200/-  

 

తభులా రసా కేఫ్ & బార్ (Tabula Rasa Cafe & Bar) – జూబ్లీ హిల్స్ (Jubilee Hills) – Rs 1300/-

 

అమ్నీషియా లాంజ్ బార్ (Amnesia Lounge & Bar) – జూబ్లీ హిల్స్ (Jubilee Hills) – Rs 1300/-  

 

ముస్టాంగ్ టెర్రస్ లాంజ్ (Mustang Terrace Lounge) – గచ్చిబౌలి (Gachibowli) – Rs 1300/-

 

 

 

ఈ క్రింద రూ. 1500 నుండి ఆ పై బడ్జెట్‌లో సర్వీస్ చేసే పబ్స్ & రెస్టారెంట్స్ వివరాలు – (Range from Rs 1500 to above)

 

వేపర్ (Vapour) – జూబ్లీ హిల్స్ (Jubilee Hills) – Rs 1800/-

 

హార్ట్ కప్ కాఫీ (Heart Cup Coffee) – కొండాపూర్ (Kondapur) & జూబిలీ హిల్స్ (Jubilee Hills) – Rs 1800/-

 

బ్లాక్ 22  (Block 22) – హైటెక్ సిటీ (Hitech City) – Rs 1900/-

 

10 డౌనింగ్ స్ట్రీట్ (10 Dowing Street or 10D) – SLN టెర్మినస్, గచ్చిబౌలి (Gachibowli)  & బేగంపేట్ (Begumpet) – Rs 1900/-

 

ప్రోస్ట్ (Prost) – జూబ్లీ హిల్స్ (Jubilee Hills) – Rs 2200/-

 

కిస్మత్ – ది పార్క్ (Kismet The Park) – సోమాజిగూడ (Somajiguda)- Rs 2400/-

 

ఓవర్ ది మూన్ (Over The Moon) – దసపల్లా  హోటల్, జూబ్లీ హిల్స్ (Daspalla Hotel, Jubilee Hills) – Rs 2500/-

 

ఇక ఈ పైన చెప్పిన రెస్టారెంట్స్‌లో లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ ఫ్లోర్, క్యాబ్ సదుపాయం, సొంతంగా భృ (Brew) ఉన్న కూడా రెస్టారెంట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేముందు  ఈ వివరాలు తెలుసుకుంటే మీరు ఏ రెస్టారెంట్‌కి వెళ్ళాలన్న దాని పైన ఒక క్లారిటీ వచ్చేస్తుంది. 

అయితే ఈ రెస్టారెంట్స్‌కి సంబంధించిన వెబ్ సైట్స్‌కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ.. లేదా యాజమాన్యాన్ని ముందుగానే సంప్రదించగలిగితే మనకి వారి నుండి మనం డిస్కౌంట్ కూపన్స్ లేదా న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్స్‌ని కూడా  పొందే అవకాశం లేకపోలేదు.

ఈ పైన తెలిపిన వివారాలు మీకున్న అనేక సందేహాలలో కనీసం కొన్నింటికైనా సమాధానం చెప్పే ఉంటాయి  అని  అనుకుంటున్నాను. ఇది చదివాక మీకు తెలిసిన ఇంకేవైనా రెస్టారెంట్స్ & పబ్స్ ఉంటే క్రింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. వాటిని కూడా ఈ జాబితాలో చేరుస్తాం.

చివరగా – పార్టీ చేయడానికి ఎంత ఆసక్తి చూపెట్టామో అంతే ఆసక్తిని క్షేమంగా ఇంటికి వెళ్లేందుకు కూడా చూపిద్దాము. న్యూ ఇయర్ పార్టీ చేసుకోవడమే కాదు ఆ పార్టీ నుండి ఇంటికి క్షేమంగా వస్తేనే కదా కొత్త సంవత్సరాన్ని సంతోషంగా గడపగలం..

అందరికి మా POPXo  తెలుగు తరపున నూతన సంవత్సర (Happy New Year) శుభాకాంక్షలు…

 

హైదరాబాద్‌లో క్రిస్మస్ & న్యూ ఇయర్ ‘కేక్స్’కి.. ఈ బేకరీలు ప్రత్యేకం

క్రిస్మస్ పార్టీ కోసం సెలబ్రిటీ మేకప్ లుక్‌లో మెరిసిపోదాం..!

ఇరానీ ఛాయ్ – కేర్ అఫ్ హైదరాబాద్

Image: Shutterstock

 

Read More From Food & Nightlife