Lifestyle

ప్రతి అమ్మాయి.. తనకు కాబోయే భర్తను ఈ ప్రశ్నలు అడగాలని భావిస్తుందట..!

Lakshmi Sudha  |  May 13, 2019
ప్రతి అమ్మాయి.. తనకు కాబోయే భర్తను ఈ ప్రశ్నలు అడగాలని భావిస్తుందట..!

పెళ్లి (marriage) అంటేనే అమ్మాయి(girl) మదిలో ఎన్నో ప్రశ్నలుంటాయి. ఎందుకంటే తన జీవితం మలుపు తిరగబోయేది పెళ్లితోనే. మరో వ్యక్తితో కలసి కొత్త జీవితం ప్రారంభించేది ఈ పెళ్లితోనే. పెళ్లి కాబోతోందనే సంతోషం తనలో నిండినప్పటికీ తన భర్త (husband) గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకొంటుంది. మరికొన్ని ప్రశ్నలు (questions) వేయాలనుకొంటుంది. వాటికి సమాధానాలు తెలుసుకోవాలని కూడా భావిస్తుంది. కానీ అలా అడిగితే ఏమైనా అనుకొంటారేమోననే భయంతో సంకోచిస్తుంది. అసలు అమ్మాయి తనకు కాబోయే భర్తను ఎలాంటి ప్రశ్నలు అడగాలనుకొంటుందో మనం కూడా తెలుసుకొందాం..

1. నన్ను మొదటిసారి చూసినప్పుడు మీకేమనిపించింది?

ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు కదా.. మొదటి సారి చూసినప్పుడే తనకు కాబోయే వాడిపై ఎలాంటి ముద్ర వేశానో తెలుసుకోవాలనుకొంటుంది ప్రతి అమ్మాయి.

2. నన్ను మీరెందుకు పెళ్లి చేసుకొన్నారు? కట్నం ఎక్కువ ఇచ్చారనా? నేను అందంగా ఉన్నాననా? నాలో ఏం చూసి మీరు ఈ పెళ్లికి ఒప్పుకొన్నారు?

ఇది చాలా మంచి ప్రశ్న. దీనికి సమాధానం కనుక్కోవాల్సిందే. అప్పుడే కదా.. అసలు మీ మీద తనకి ఉన్న అభిప్రాయం ఏంటో తెలుస్తుంది.

3. ఒక్కసారి చూడగానే పెళ్లి చేసుకోవాలనేంత బాగా నాలో మీకు ఏది నచ్చింది?

నిజమే కదా.. మొదటిసారి పెళ్లి చూపుల్లో చూడగానే అమ్మాయి నచ్చింది అని చెబుతారు. కానీ ఒక్కసారి చూడగానే ఎలా నచ్చేస్తుంది?

4. మీకు స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ వంటి దురలవాట్లు ఉన్నాయా?

ఈ ప్రశ్నకి కూడా చాలామంది సమాధానం కనుక్కోవాలని ప్రయత్నిస్తారు. ఎందుకంటే తన భర్తకు దురలవాట్లు ఉండటం ఏ అమ్మాయి ఇష్టపడదు.

5. నాలో మీకు నచ్చేది, నచ్చనిది ఏంటి?

ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అప్పుడే కదా నచ్చిన విషయాన్ని కొనసాగించవచ్చు. నచ్చని వాటిని మార్చుకోవచ్చు. ఏమంటారు?

6. నేను ఫ్రెండ్స్‌తో కలసి సరదాగా బయటకు వెళ్లడానికి మీరు ఒప్పుకొంటారా?

ఇది కూడా పెళ్లికి ముందు అడిగి తెలుసుకోవాల్సిన ప్రశ్నే. ఎందుకంటే అనవసరమైన ఆంక్షలున్న చోట జీవితమంతా ఇబ్బంది పడుతూ బతకడం కంటే ముందుగానే ఈ విషయంపై క్లారిటీ తెచ్చుకొంటే సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది.

7. ఇన్ని రోజులు బ్యాచిలర్‌గా ఉన్నారు కదా.. మీకు వంట చేయడం వచ్చా?

సాధారణంగా బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు స్వయంగా వంట చేసుకొని తిన్న అబ్బాయిలు.. పెళ్లి తర్వాత అసలు వంట చేయడానికి ఇష్టపడరు. ఈ విషయం తెలిసినా తన భర్త నోటి నుంచి సమాధానం వినాలని ప్రతి అమ్మాయి అనుకొంటుంది.

8. నేనెలా ఉండాలని మీరు భావిస్తున్నారు?

తన భర్త తనని ఎలా చూడాలనుకొంటున్నాడో తెలుసుకోవాలని ప్రతి అమ్మాయి తహతహలాడుతుంది. అవసరమైతే తనను తాను మార్చుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. అంతకంటే ముందు తన భర్త ఇష్టాన్ని తెలుసుకోవాలి కదా. అందుకే ఈ ప్రశ్న అడగాలనుకొంటుంది.

9. నేను సంపాదించిన డబ్బులో కొంత భాగం మా అమ్మానాన్నకు ఇవ్వాలని అనుకొంటున్నాను. కూతురిగా వారి బాగోగులు చూడటం నా బాధ్యత. దానికి మీరు అంగీకరిస్తారా?

చాలామంది అమ్మాయిలకు తమ తల్లిదండ్రులకు సాయం చేయాలని ఉంటుంది. కానీ చాలామంది తమ అత్తింట్లో ఒప్పుకోకపోవడం లేదా తన భర్త అంగీకారం లేకపోవడం వల్ల అలా చేయలేకపోతుంటారు. ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో చాలా వరకు మార్పులు వచ్చినప్పటికీ అమ్మాయిలు మాత్రం ఈ ప్రశ్న తన భర్తను అడగాలనుకొంటారు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

GIFs: Giphy

ఇవి కూడా చదవండి:

పెళ్లయిన కొత్తలో.. అమ్మాయికి ఎదురయ్యే ప్రశ్నలు ఇవే..!

కొత్తగా పెళ్లయిన దంపతులకు చికాకు పెట్టే ప్రశ్నలు

Read More From Lifestyle