ADVERTISEMENT
home / Life
పెళ్లయిన కొత్తలో.. అమ్మాయికి ఎదురయ్యే ప్రశ్నలు ఇవే..!

పెళ్లయిన కొత్తలో.. అమ్మాయికి ఎదురయ్యే ప్రశ్నలు ఇవే..!

అమ్మాయి (girl) జీవితంలో అందమైన మలుపు పెళ్లి. ఎన్నో ఆశలు.. మరెన్నో ఊహలతో అత్తింట్లోకి అడుగుపెడుతుంది. భర్తతో కలసి జీవించే ప్రతి క్షణం తనకు సంతోషాన్ని ఇవ్వాలని కోరుకొంటుంది. ఆశలు, ఆనందాలతో పాటు.. మరెన్నో సంశయాలు ఆమె మదిలో ఉంటాయి. అత్తింట్లో నేను ఇమడగలనా? వారు నన్ను బాగా చూసుకొంటారా? ఇలాంటి ఆలోచనలు ఆమెకుంటాయి.

ఇవన్నీ ఒకెత్తయితే.. కొత్త పెళ్లికూతురుని చూడటానికి వచ్చిన పక్కింటి పిన్నిగారు.. పై ఇంటి బామ్మగారు వేసే ప్రశ్నలు (questions) కొన్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. కొన్నిసార్లు కోపమొచ్చినా.. ఏమీ అనలేక ఆ కోపాన్ని దిగమింగుకొంటూ ఉంటాం. అసలు కొత్త కోడలు ఎలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కొంటుందో ఓసారి చూద్దాం.

1.   పెళ్లయిపోయింది కదా.. ఇంకా ఉద్యోగానికి వెళ్తావా?

జాబ్ చేసే అమ్మాయి పెళ్లయిన తర్వాత కచ్చితంగా ఈ ప్రశ్నను వినాల్సి వస్తుంది. “పెళ్లయిపోయింది కదా.. ఇంకా ఉద్యోగం చేస్తావా?” అని అడుగుతారు. దానికి మనం అవుననే సమాధానమే చెప్తాం. కొందరు దాన్ని మెచ్చుకొంటే.. మరికొందరు మాత్రం మెటికలు విరుస్తారు. “పెళ్లయినా ఉద్యోగానికి వెళతావా? మా ఇంటా వంటా ఇలాంటి అలవాట్లు లేవమ్మా. ఇంటిపట్టున ఉండి వంటా వార్పూ చేసుకోవాలి గానీ.. అలా ఉద్యోగాలంటూ ఊరి మీద తిరుగుతారా?” అని నోటికొచ్చింది మాట్లాడతారు. ఆ సమయంలో చాలా కోపం వచ్చినప్పటికీ పెద్దవాళ్లని ఊరుకొంటాం. “పైగా కొత్త కోడలిమాయే.. లేదంటేనా..?”

ADVERTISEMENT

5-questions-bride

2.  అమ్మాయ్.. నీకు చీర కట్టుకోవడం వచ్చా?

కొత్త కోడలిని చూడటానికి వచ్చిన వారిలో నూటికి 90 మంది అడిగే ప్రశ్న ఇది. ‘అమ్మాయ్.. నీకు చీర కట్టుకోవం వచ్చా? ఆ ఏం లేదులే.. ఈ మధ్య అమ్మాయిలంతా మగాళ్లలా ప్యాంట్లు షర్టులు వేసుకొని తిరుగుతున్నారుగా.. నువ్వూ ప్యాంట్లు వేసుకొంటావా?’ ఆ సమయంలో ‘ఏ పని మీద వచ్చారు? ఏం మాట్లాడుతున్నారు?’  అని మనసులో అనుకొన్నా.. పైకి  మాత్రం నవ్వుతూ.. “వచ్చండి” అని చెప్పి తప్పించుకొంటాం. అయినా మనం వేసుకొనే దుస్తుల విషయంలో ఇంట్లోవాళ్లు బాగానే ఉంటారు. కానీ వీళ్లెందుకో ఓ ఉలికి ఉలికి పడుతుంటారు.

3-questions-bride

ADVERTISEMENT

3.  ఏంటీ ఒక్కదానివే వెళ్లి వస్తావా?

ఆఫీసుకు వెళ్లే కొత్తకోడళ్లకు ఎదురయ్యే మరో ప్రశ్న. ‘ఏంటీ ఆఫీసుకి ఒక్కదానివే వెళుతున్నావా? మీ ఆయన్ని తోడు తీసుకెళ్లచ్చుగా’  ‘ప్లీజ్.. ఇలాంటి ప్రశ్నలు మాత్రం అడగకండి. ఎందుకంటే నేటి తరం అమ్మాయిలు స్వతంత్రంగా ఉండగలుగుతున్నారు. ఏ పనైనా చేయగల సమర్థులు. కాబట్టి వారి చుట్టూ ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేయకండి’.

Also Read: పెళ్లికి సన్నద్ధమవుతున్నారా? ఈ మెహందీ డిజైన్లపై ఓ లుక్కేయండి

4-questions-bride

ADVERTISEMENT

4.  మీ ఆయన్ని బాగానే బుట్టలో పడేశావే పిల్లా..  ఏం చేశావేంటి?

ఎప్పుడైనా భర్తతో కలసి షాపింగ్‌కి వెళ్లినా, సినిమాకి వెళ్లినా.. మరుసటి రోజు ఏ పొరుగింటి అమ్మో ఈ ప్రశ్న అడుగుతుంది. అరె.. భార్యాభర్తలన్న తర్వాత చిన్న చిన్న సరదాలుండవా..? అయినా భార్యపై భర్తకు, భర్తపై భార్యకు ప్రేమ కచ్చితంగా ఉంటుంది. దాన్నే బుట్టలో పడేయడం అనుకొంటే ఎలా? ఇదొక్కటే అయితే ఫర్వాలేదు. ఏదో సరదాగా అడిగారులే అనుకోవచ్చు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి డబ్బులు అలా ఖర్చు పెట్టకండమ్మా.. ఇప్పుడే పెళ్లయింది కదా ముందు ముందు బోలెడు ఖర్చులుంటాయి. అని క్లాస్ పీకేస్తుంటారు. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్.

2-questions-bride

5.  ఏంటమ్మా.. పుట్టింట్లో ఇవేమీ నేర్పలేదా నీకు

ADVERTISEMENT

మిగిలిన ప్రశ్నలకి పోనీలే అని ఏదో సర్దుకొంటాం కానీ.. ఇలా  అడిగితే మాత్రం కోపం నషాళానికి అంటుతుంది. ఈ తరం అమ్మాయిలు చక్కగా చదువుకొని.. ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగని వంటావార్పు రాదనుకొంటే పొరపాటే. అవసరమైనంత మేరకు వారు నేర్చుకొంటున్నారు. కొత్తరకం వంటలేమైనా వండాలంటే.. ఇంటర్నెట్‌లో బోలెడన్ని రెసిపీలున్నాయి. వాటిని చూసి చక్కగా వంట చేయగలుగుతున్నారు. ఒకవేళ.. వారికి ఏదైనా.. ఎలా వండాలో తెలియకపోతే.. ఎవరో ఒకరిని అడుగుతారు. ఈ సమయంలో వారు మనకి చెప్పకపోయినా ఫర్వాలేదు. కానీ ఇలా అడిగితే మాత్రం చిర్రెత్తుకొస్తుంది. వంటలనే కాదు.. చాలా విషయాల్లో ఈ ప్రశ్న ఎదురవుతుంది.

Also Read: పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఉండే.. ప్రత్యేకత ఏమిటంటే..?

1-questions-bride 2490649

6.  ఫోన్లో ఎక్కువగా మాట్లాడతావెందుకు?

ADVERTISEMENT

ఇటీవలి కాలంలో ప్రపంచం అంతా మన చేతిలోనే ఉంటోంది. ప్రస్తుతం ఏ చిన్న విషయం తెలుసుకోవాలన్నా స్మార్ట్ ఫోన్ మీదే ఆధారపడుతున్నాం. అంతే.. నా మన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువులతో టచ్‌లో ఉండటానికి ఉన్న మార్గం అది. మనకు బాగా దగ్గరైన వాళ్లు ఫోన్ చేస్తే కాస్త ఎక్కువ సమయమే మాట్లాడతాం. అంత మాత్రానికే ఇలా అనడం అవసరమా? ఎవరిదాకానో ఎందుకు ఈ ప్రశ్న అడిగేవాళ్లు కూడా అలాగే చేస్తారు. మరి మమ్మల్నెందుకు అలా అడుగుతారో అర్థం కాదు. పైగా పుట్టింటి వాళ్లతో అంత ఎక్కువ సేపు మాట్లాడటం అవసరమా అని  ప్రశ్నిస్తారు. పెళ్లయితే మాత్రం వారు పరాయివాళ్లైపోతారా?

ఇలాంటి ప్రశ్నలు ప్రతి అమ్మాయికి ఏదో సందర్భంలో ఎదురవ్వడం సహజం. కాబట్టి ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు బాధపడిపోవద్దు. అలాగే ఎవరో ఏదో అన్నారని ఇతరుల కోసం మిమ్మల్ని మీరు మార్చుకోవద్దు. ఎందుకంటే మీరు మీరులా ఉన్నప్పుడే మీరు సంతోషంగా ఉండగలుగుతారు.

Also Read: ఫ్రెండ్ పెళ్లికి వెళుతున్నారా? బొట్టు ఇలా పెట్టుకోండి..

22 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT