Bigg Boss

Bigg Boss Telugu 3: హౌస్ కెప్టెన్ రేసులో రాహుల్ సిప్లిగంజ్, రవికృష్ణ & హిమజ ..!

Sandeep Thatla  |  Sep 4, 2019
Bigg Boss Telugu 3: హౌస్ కెప్టెన్ రేసులో రాహుల్ సిప్లిగంజ్, రవికృష్ణ & హిమజ ..!

“బిగ్ బాస్ తెలుగు సీజన్ 3”  వీక్లి టాస్క్‌లో భాగంగా ఇటీవలే జరిగిన – “దొంగలు దోచిన నగరం” టాస్క్ ఎన్నో ట్విస్టులు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ టాస్క్‌లో భాగంగా రెండు గ్రూపులుగా విడిపోయిన ఇంటి సభ్యుల మధ్య తీవ్రమైన ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఆ వాతావరణం నిన్నటికి మరింతగా ముదిరింది. అదే వాతావరణం ఇంటి సభ్యుల మధ్య దూషణలతో పాటు.. కుమ్ములాటలకు దారితీసింది. ఆ పరిస్థితుల్లో టాస్క్‌ని నిలిపివేస్తున్నట్టుగా బిగ్ బాస్ ప్రకటించారు.

Bigg Boss Telugu 3: బిగ్‌బాస్ హౌస్‌లోని వెన్నుపోటుదారుల గురించి తెలుసా..?

ఇదిలావుండగా బిగ్ బాస్ (Bigg Boss) ఇంటి తదుపరి కెప్టెన్ అయ్యేందుకు రాహుల్ సిప్లిగంజ్, రవికృష్ణ, హిమజ.. పోటీలో నిలిచారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా పోటీ పడుతున్నట్లు ప్రోమోలో చూపించారు. మరి ఈ ముగ్గురిలో ఎవరు బిగ్‌బాస్ ఇంటి తదుపరి కెప్టెన్ అవుతారన్నది.. ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో తేలిపోనుంది.

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో వీక్లి టాస్క్ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించిన తరువాత.. ఇంటి సభ్యులు పదే పదే ఇంటి నియమాలని ఉల్లంఘించడం జరిగింది. ఈ  కారణంగా బిగ్‌బాస్ ఈ టాస్క్‌ని రద్దు చేస్తున్నట్లుగా తెలిపారు. అదే సమయంలో ఈ టాస్క్ ఇలా రద్దవ్వడానికి కారణమైన.. ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు చెప్పమని బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ వరుణ్ సందేశ్‌ని ఆదేశించడం జరిగింది.

అప్పుడు వరుణ్.. మిగతా ఇంటి సభ్యులందరిని ఒక్కొక పేరుని సూచించమని కోరడంతో.. ఎక్కుమంది సభ్యులు రాహుల్ సిప్లిగంజ్, రవికృష్ణల పేర్లు చెప్పారు. అయితే కొందరు ఇదే సమయంలో అలీ రెజా పేరును కూడా ప్రస్తావించారు. ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), రవికృష్ణల (Ravikrishna) పేర్లని బిగ్ బాస్‌కి తెలియచేయగా.. వారిరువురిని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జైలులో బంధించమని వరుణ్‌ని బిగ్‌బాస్ ఆదేశించారు. 

Bigg Boss Telugu 3: టాస్క్ సందర్భంగా.. ఇంటిసభ్యుల మధ్య గొడవలు ..!

అలా ఈ ఇద్దరు ప్రస్తుతం బిగ్ బాస్ జైలులో ఉన్నారు. పైగా వీరిరువురికి ఇంటి సభ్యులు సాధారణంగా తీసుకునే ఆహరం ఇవ్వకూడదని బిగ్ బాస్ తెలిపారు. బిగ్‌బాస్ ప్రత్యేకించి వీరిద్దరికి పంపించే ఆహారాన్ని మాత్రమే వారు తినాలని చెప్పడం జరిగింది. ఇద్దరికి గడకను తినాలని తెలిపారు (ఇది మొక్కజొన్నలతో చేసే ఓ పదార్థం) . ఆ పదార్దాన్ని తినడానికి అటు రవికృష్ణ, ఇటు రాహుల్ సిప్లిగంజ్‌లు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటివరకు ఈ షోలో అనేక సందర్భాలలో.. ఇంటి సభ్యులని జైలులో పెట్టడం జరిగింది. కాని ఇలా వారికి ఇటువంటి ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని ఇవ్వడం జరగలేదు!

ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లో ఒకరంటే మరొకరికి రకరాలైన భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ తరుణంలో జరిగిన ఈ వీక్లి టాస్క్ వారి మధ్య మరింత దూరాన్ని పెంచేసింది. ఇవ్వన్నీ పక్కకిపెడితే, ఇంటిలోకి జంటగా ప్రవేశించిన వరుణ్ సందేశ్, వితికల మధ్య కూడా ఈ టాస్క్‌ల కారణంగా దూరం పెరిగింది. ఇద్దరూ కూడా వేరొక గ్రూప్‌లో ఉన్న కారణంగా ప్రత్యర్థులుగా ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. దీని కారణంగా వీరి మధ్య టాస్క్ ముగిసాక కూడా వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వీరి మధ్య జరిగిన గొడవ కారణంగా వితిక కన్నీటిపర్యంతమైంది. మరి చూడాలి.. ఈరోజు జరగబోయే ఎపిసోడ్‌లో వీరి మధ్య ఇంకా దూరమనేది పెరిగిందా లేక మళ్ళీ కలిసిపోయారా..?                            

మొత్తానికి “బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3” ఏడవ వారంలోకి ప్రవేశించాక.. ఆట జరుగుతున్న తీరులో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. చూడాలి.. ఇంకెన్ని చిత్ర విచిత్రాలు మనల్ని కనువిందు చేయనున్నాయో.

Bigg Boss Telugu 3: డబుల్ ఎలిమినేషన్‌కి ప్లాన్ చేసిన బిగ్‌బాస్?

 

 

 

Read More From Bigg Boss