Bigg Boss

బిగ్ బాస్ హౌస్ లో రీ-యూనియన్ రెట్రో పార్టీలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హంగామా

Sandeep Thatla  |  Nov 2, 2019
బిగ్ బాస్ హౌస్ లో రీ-యూనియన్ రెట్రో పార్టీలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హంగామా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3కి శుభం కార్డు పడే సమయం వచ్చేసింది. రేపటితో ఈ సీజన్ పూర్తవ్వనుంది. ఇక ఈ సందర్భంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొన్న కంటెస్టెంట్స్ (contestants) అందరిని బిగ్ బాస్ హౌస్ (bigg boss house) లోకి మరలా పంపించి వారందరితో బిగ్ బాస్ హౌస్ లో ఒక రీ-యూనియన్ (reunion) రెట్రో పార్టీ (retro party) ఏర్పాటు చేశారు బిగ్ బాస్.

బిగ్ బాస్ హౌస్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్

దీనికి సంబందించిన ప్రోమో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఆ వీడియో లో ఇంటిసభ్యులందరికి రకరకాలైన అవార్డులు ఇవ్వడంతో పాటుగా కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ ప్లే చేసే పాటలకి డ్యాన్స్ చేయడం మనం చూడవచ్చు. 

ఇదిలావుండగా నిన్నటి ఎపిసోడ్ మొత్తం కూడా సరదా సరదాగా గడిచిపోయింది. కారణమేంటి అంటే – మొదటి వారం నుండి కూడా ఎలిమినేట్ అయిన సభ్యులు మరలా బిగ్ బాస్ (bigg boss) హౌస్ కి రావడం & అలా వచ్చిన వారందరూ కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మిగిలిన అయిదుగురు సభ్యులని కలవడం.. చాలా రోజుల తరువాత ఇలా అందరిని కలుస్తుండడంతో వీరంతా కూడా తమ ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. గతంలో తాము ఇంట్లో ఉన్నప్పటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఇంట్లో వారందరితో సరదాగా మాట్లాడుతూ సమయాన్ని ఆనందంగా గడిపేశారు. సీజన్ పూర్తయ్యే ముందు ఇలా ఇంటి సభ్యులందరినీ మరోసారి రీ యూనియన్ చేయడం గత రెండు సీజన్ల నుంచి జరుగుతున్నా.. ఈ సీజన్ రీ యూనియన్ మాత్రం ఎంతో ప్రత్యేకం.. గత రెండు సీజన్ల కంటే ఎంతో ఎంటరటైనింగ్ అని చెప్పుకోవచ్చు. 

ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ఎవరెవరు ఎవరితో సన్నిహితంగా ఉండేవారో.. వారంతా కూడా మరలా కబుర్లు చెప్పుకుంటూ డ్యాన్స్ వేస్తూ సరదాగా గడిపారు. ముఖ్యంగా జాఫర్ & బాబా భాస్కర్ ల మధ్య బ్రొమాన్స్ చాలా బాగా ఆకట్టుకుంది. అదే సమయంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు రవికృష్ణని దూషించిన తమన్నా సింహాద్రి.. క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇక రాహుల్ సిప్లిగంజ్ (rahul sipligunj) కి కూడా శ్రీముఖి (sreemukhi) తో ఉన్న విభేదాలని పరిష్కరించుకోమని పునర్నవి సలహా ఇవ్వడం, వరుణ్ సందేశ్ కి బయట ఉన్న పరిస్థితులు వివరిస్తూ వితిక అన్నం తినిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాబా భాస్కర్ & అలీ రెజా కి సైతం బయట నుండి వచ్చిన వారు ప్రేక్షకులు ఎలా అనుకుంటున్నారో అన్న విషయాలు కూడా చెప్పారు. మరి ముఖ్యంగా బాబా భాస్కర్ ఎమోషనల్ అయిన అంశం గురించి ఇంటిలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది.

బిగ్ బాస్ హౌస్ లో తమ ప్రయాణం చూసి ఎమోషనల్ అవుతున్న కంటెస్టెంట్స్

ఇక వీరందరిని కూడా లివింగ్ ఏరియాలో ఉన్న సోఫా లో కూర్చుపెట్టి ఈ సీజన్ మొత్తానికి సంబందించిన ఒక ట్రైలర్ ని చూపెట్టడం జరిగింది. ఆ వీడియో చూశాక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది. అలాగే తమ ప్రయాణం గురించి కూడా ఎన్నో జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు.

అయితే ఇంటికి వచ్చిన పాత కంటెస్టెంట్స్ & అలాగే ఇంటిలో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ కి ఒక షీట్ ఇవ్వడం జరిగింది. ఆ షీట్లో కొన్ని అవార్డులు ఇవ్వడం జరిగింది, వీరంతా కూడా ఆ అవార్డులకు ఎవరు అర్హులు అని ఆలోచించి రాయమని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ లో అవార్డుల ప్రదానోత్సవం చూపించనున్నారు. ఇప్పటికి ప్రసారమైన ప్రోమో లో పక్కా మాస్ అవార్డు ని హేమకి ఇవ్వడం జరిగింది. మరి మిగిలిన అవార్డులని ఎవరికి రావడం జరిగింది అనేది రాత్రికి ప్రసారమయ్యే ఎపిసోడ్ లో తేలిపోనుంది.

బాబా భాస్కర్ సూపర్ స్టార్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్.. మరి, శ్రీముఖి ఏంటి?

Read More From Bigg Boss