Bigg Boss

నాగార్జున స్థానంలో.. “బిగ్ బాస్ తెలుగు సీజన్ 3” షో వ్యాఖ్యాతగా రమ్యకృష్ణ ..!

Sandeep Thatla  |  Aug 31, 2019
నాగార్జున స్థానంలో.. “బిగ్ బాస్ తెలుగు సీజన్ 3” షో వ్యాఖ్యాతగా రమ్యకృష్ణ ..!

“బిగ్ బాస్ తెలుగు సీజన్ 3″లో (Bigg Boss Telugu) ఈవారం ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది. అదేంటంటే – ఈ సీజన్ మొత్తానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న నాగార్జున స్థానంలో, ఈ వారం వరకు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణని చూడబోతున్నారు.

ఈ మార్పుకి కారణమేంటంటే – ఆగస్టు 29వ తేదిన నాగార్జున (Nagarjuna) తన 60వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ క్రమంలో తన కుటుంబంతో సహా విదేశాలకు వెళ్లారు. దీంతో  ఈ వారం ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి వీలు దొరకలేదు. అందుకే.. ఆయనకి బదులుగా ఓ 2 ఎపిసోడ్లకు.. రమ్యకృష్ణని వ్యాఖ్యాతగా వ్యవహరించమని బిగ్ బాస్ షో నిర్వాహకులు కోరారట.

దాంతో.. ఈ వారం బిగ్ బాస్ ఇంటిలో రమ్యకృష్ణ అలియాస్ శివగామి తన మరో కోణాన్ని చూపించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు ముగ్గురు వ్యాఖ్యాతలని “బిగ్ బాస్ తెలుగు” 3 సీజన్స్‌లో చూడగా.. మొదటిసారి ఒక మహిళా వ్యాఖ్యాతగా రమ్యకృష్ణ కనిపిస్తుండడం విశేషం. ఒకరకంగా చెప్పాలంటే.. తొలి మహిళా బిగ్ బాస్ వ్యాఖ్యాత కూడా రమ్యకృష్ణ మాత్రమే అని తెలుస్తోంది.

కృష్ణవంశీ – రమ్యకృష్ణల ప్రేమ చిగురించడానికి.. కారణమైన పాటేమిటో మీకు తెలుసా?

అలాగే ఒకే సీజన్‌లో ఇద్దరు వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం.. గతంలో హిందీ బిగ్ బాస్ షోలో జరిగింది. హిందీలో బిగ్ బాస్ మొదలైనప్పటి నుండీ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా.. “బిగ్ బాస్ సీజన్ 5” లో మాత్రం సంజయ్ దత్.. కొన్ని ఎపిసోడ్స్‌కి సల్మాన్ ఖాన్‌కి బదులు వ్యాఖ్యానం చేయడం జరిగింది. అందుకే బిగ్ బాస్ సీజన్‌లో ఇద్దరు వ్యాఖ్యాతలు ఉండడం కొత్తేమి కాదు.

ఇక రమ్యకృష్ణ (Ramyakrishna) విషయానికి వస్తే.. ఆమె గతంలో పలు టీవీ సీరియల్స్‌లో నటించడమే కాకుండా.. కొన్ని షోలకి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది. ఆమెకి  వ్యాఖ్యాతగా మంచి అనుభవం ఉండడంతో.. ఈ వారం బిగ్ బాస్ తెలుగు షో మరింత ఆకట్టుకునే విధంగా ఉండబోతుంది అని చెప్పవచ్చు.

ఇదిలావుండగా “బిగ్ బాస్ తెలుగు సీజన్ 3″లో రేపటితో ఆరవ వారం ముగియనుంది. అలాగే రేపు మహేష్ విట్టా, పునర్నవి, హిమజలలో ఒకరు ఇంటిని విడిచి బయటకి వెళ్లడం ఖాయం అని తెలుస్తోంది. దీనితో ఇంటి సభ్యుల సంఖ్య 10 కి చేరుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న అంచనాలు, అలాగే జన సామాన్యం చెప్పుకుంటున్న దాన్ని బట్టి, మహేష్ విట్టా లేదా హిమజ… ఈ వారం బిగ్ బాస్ హౌస్‌ని విడిచి వెళ్లేందుకు అవకాశముందని టాక్.

వాస్తవంగా ఈ వారం మరో ముగ్గురు – రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, రవికృష్ణలు కూడా నామినేషనులో ఉండగా.. వారు ముగ్గురు బిగ్ బాస్ ఇచ్చిన డీల్‌లో విజయం సాధించి ఎలిమినేషన్ నుండి ఇమ్మ్యూనిటీ పొందారు. ఆ విధంగా.. ఈ వారం వారు సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు.

మరోసారి నామినేషన్స్‌లోకి పునర్నవి & హిమజ

అయితే “ఇది బిగ్ బాస్ షో, ఇక్కడ ఏమైనా జరగవచ్చు” అన్న క్యాప్షన్ అని ఒకటి ఉంది కాబట్టి, పైన చెప్పిన ఇద్దరు కాకూండా పునర్నవి ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ ఎలిమినేషన్ అంశం తేలాలంటే ..రేపటి వరకు ఆగాల్సిందే. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్‌లో విజేతగా నిలిచి.. ఈ సీజన్‌లో రెండవ సారి కెప్టెన్ అయ్యాడు వరుణ్ సందేశ్.

కెప్టెన్సీ టాస్క్‌లో రాహుల్ సిప్లిగంజ్ & బాబ్ భాస్కర్‌లని ఓడించి బిగ్ బాస్ ఇంటి నాల్గవ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్‌గా బిగ్ బాస్ నుండి విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో.. ఈ వారం అతని కెప్టెన్సీ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

ఆఖరుగా మన్మథుడు వ్యాఖ్యాతగా ఉంటే చూసిన ఇంటిసభ్యులు, వీక్షకులకు ఈ వారం ఒక మెరుపు ఝలక్ రూపంలో రమ్యకృష్ణ అలియాస్ శివగామి ఎదురుకానుంది.

బిగ్ బాస్‌తో డీల్ కుదుర్చుకున్న వరుణ్, రాహుల్, రవికృష్ణ

Read More From Bigg Boss