Fashion

ఫ్యాష‌న్ క్వీన్ సోన‌మ్ క‌పూర్ అవుట్ ఫిట్స్ చూశారా??

Sridevi  |  Feb 2, 2019
ఫ్యాష‌న్ క్వీన్ సోన‌మ్ క‌పూర్ అవుట్ ఫిట్స్ చూశారా??

సోన‌మ్ క‌పూర్ (Sonam kapoor).. బాలీవుడ్ ఫ్యాష‌నిస్టా అని పిలుచుకునే ఈ ముద్దుగుమ్మ ఎలాంటి ఫ్యాష‌న్‌లో అయినా చ‌క్క‌ని చుక్క‌లా మెరిసిపోతుంది. ప్ర‌తి ఫ్యాష‌న్ ను త‌న‌కు అనువుగా మార్చుకుని, త‌న‌దైన మార్క్ వేసే సోన‌మ్ ప్ర‌స్తుతం ఏక్ ల‌డ‌కీ కో దేఖా తో ఏసా ల‌గా (Ek Ladki Ko Dekha Toh Aisa Laga) సినిమా ప్ర‌మోష‌న్స్ తో ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. అయితేనేం.. ఈ ప్ర‌మెష‌న్స్ వేదిక‌గా కూడా త‌న ఫ్యాష‌న్ సెన్స్ ను చ‌క్క‌గా చాటుకుంటోంది. ఇందుకు ఈ అమ్మ‌డు ధ‌రించిన స్టైలిష్ అవుట్ ఫిట్స్ నిద‌ర్శ‌నం అని చెప్ప‌వ‌చ్చు.

చీర‌ను స్టైలిష్‌గా క‌ట్టుకోవ‌డం ఎలాగో సోన‌మ్ ని చూసి మ‌నం తెలుసుకోవ‌చ్చు. ర‌క‌ర‌క‌రాల శారీ ట్రెండ్స్ ను ఫాలో అవ్వ‌డంలో ఎప్పుడూ ముందు వ‌రుస‌లో ఉండే ఈ భామ తాజాగా త‌న సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా గ్రీన్ క‌ల‌ర్ శారీలో మెరిసింది. అయితే ఈ చీర‌కు ఒక ప్ర‌త్యేత‌క ఉంది. అదేంటో మీకు తెలుసా?? ఈ చీర పూర్తిగా చేతితో నేసిన‌ది. అంతేకాదు.. రంగుల‌ను కూడా చేతితోనే వేశారు. భార‌తీయ సంప్ర‌దాయానికి అద్దంప‌ట్టే ఈ చీర‌కు ఒక వింటేజ్ బెల్ట్, ప‌ర్స్, ఫుట్ వేర్ జ‌త చేసిన సోన‌మ్ లైట్ మేకప్ తో త‌న లుక్ ని పూర్తి చేసింది. ఆమె సోద‌రి రియాక‌పూర్ స్టైలింగ్ లో అందంగా మెరిసిపోయిన ఈ భామ‌ను మీరూ ఓసారి చూడండి.

అమ్మాయిలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే ఫ్యాష‌న్స్ (Fashions) లో ఫ్లోర‌ల్ డిజైన్స్ కూడా ఒక‌టి. అందుకే ఎన్ని ట్రెండ్స్ వ‌చ్చినా వీటికి ఉండే ఆద‌ర‌ణ మాత్రం ఎప్ప‌టికీ త‌గ్గ‌దు. అలాంటి ఫ్లోర‌ల్ డిజైన్ ఉన్న అవుట్ ఫిట్ కు ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగుల‌ను జ‌త చేస్తే ఆ మ్యాజిక్ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలియాలంటే సోన‌మ్ ధ‌రించిన ఈ అవుట్ ఫిట్ చూడాల్సిందే! లైట్ సీ బ్లూ క‌ల‌ర్ డ్ర‌స్ పై మ‌ల్టీ క‌ల‌ర్స్ లో ఉన్న పువ్వులు డ్ర‌స్ కే ఒక కొత్త లుక్ ని తెచ్చిపెట్టాయి క‌దూ!

సూట్స్ ఫ్యాష‌న్ ను ఎవ‌రైనా ఎంత చ‌క్క‌గా ఫాలో అవ్వ‌చ్చో సోన‌మ్ ని చూసి తెలుసుకోవ‌చ్చు. ఈ అమ్మ‌డికి సూట్ ఫ్యాష‌న్ ఫాలో అవ్వ‌డంలో కాస్త నైపుణ్య‌త ఎక్కువే. ఇదే విష‌యం ఈ అవుట్ ఫిట్ ద్వారా మ‌రోసారి నిరూపిత‌మైంది. బీజ్ క‌ల‌ర్ సూట్ లో మెరిసిపోతోన్న సోన‌మ్ క్లాసీ లుక్ లో భ‌లేగా క‌నిపిస్తోంది క‌దూ! సూట్ కి జ‌త‌గా ఆమ్ర‌పాలి ఇయ‌ర్ రింగ్స్ పెట్టుకున్న సోన‌మ్ త‌న మేక‌ప్, హెయిర్ స్టైల్ కూడా డ్ర‌స్ కు మ్యాచ‌య్యేలా జాగ్ర‌త్త‌ప‌డింది.

పేస్ట‌ల షేడ్స్ ధ‌రించాలంటే చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ షేడ్ మ‌న‌కు న‌ప్పుతుందో, లేదో స‌రిచూసుకోవాలి. మేకప్ దానికి అనుగుణంగా ఉండేలా జాగ్ర‌త్త ప‌డాలి. అప్పుడే మ‌న‌కు మంచి లుక్ వ‌స్తుంది. ఒకటి లేదా రెండు షేడ్స్ ధ‌రించ‌డానికి మ‌నం ఇంత ఆలోచిస్తే సోన‌మ్ మాత్రం ఏకంగా పేస్ట‌ల్ షేడ్స్ లోనే మ‌ల్టీ క‌ల‌ర్ అవుట్ ఫిట్ ధ‌రించి అంద‌రి దృష్టినీ చ‌క్క‌గా ఆక‌ర్షించింది. ముఖ్యంగా ఈ అవుట్ ఫిట్ కు జ‌త‌గా ఆమె వేసుకున్న ఎల్లో క‌ల‌ర్ ఐ షాడో, మెస్సీ బ‌న్.. త‌న లుక్ ని మ‌రింత ఇనుమ‌డించేలా చేశాయి.

డిఫ‌రెంట్ కోట్స్, లైన్స్ రాసి ఉన్న అవుట్ ఫిట్స్ ధ‌రించ‌డంలో సోన‌మ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఏక్ ల‌డ‌కీ కొ దేఖా తో ఏసా ల‌గా సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మ‌రోసారి ఈ మాట‌లు నిజ‌మే అని నిరూపించిందీ అమ్మ‌డు. ప్ర‌ముఖ డిజైన‌ర్ మ‌సాబా గుప్తా డిజైన్ చేసిన క‌స్ట‌మ్ మేడ్ శారీతో అంద‌రి చూపూ త‌న‌వైపు తిప్పుకుందీ సొగ‌స‌రి. త‌మిళంలో ఏక్ ల‌డ‌కీ కో దేఖా తో ఏసా ల‌గా అని రాసి ఉన్న ఈ శారీకి ఆక‌ర్ష‌ణీయ‌మైన బ్లౌజ్ జ‌త చేసి అందంగా మెరిసిపోయింది.

తెలుపు, లేత గులాబీ రంగుల కాంబినేష‌న్ అంటే ఎంత బాగుంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇలాంటి అంద‌మైన క‌ల‌ర్ కాంబినేష‌న్ లో రూపొందించిన హ్యాండ్ ప్రింటెడ్ ఆర్గాంజా లెహెంగాలో సోన‌మ్ ఎంత స్టైలిష్ గా మెరిసిపోయిందో చూడండి. చోక‌ర్, ఇయ‌ర్ రింగ్స్, బ్రేస్ లెట్ తో త‌న లుక్ ని సింపుల్ గా పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ ఫ్యాష‌న్ లోనూ క్వీన్ అని అనిపించుకుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

మ‌న‌సులోని దేశ‌భ‌క్తిని.. మువ్వ‌న్నెల అవుట్‌ఫిట్స్‌తో ప్ర‌తిబింబించండి..!

కాలేజీ అమ్మాయిలకు ప్రత్యేకం.. రకుల్ ప్రీత్ ఫ్యాషన్స్

స్టైలిష్‌గా క‌నిపించాలా?? అయితే ఈ టాలీవుడ్ హీరోయిన్స్‌ని ఫాలో అవ్వండి!

 

Read More From Fashion