Lifestyle

మధురమే… మధురమే… ఈ ప్రేమ జ్ఞాపకాలు ఎప్పటికీ మధురమే..

Lakshmi Sudha  |  Dec 18, 2018
మధురమే… మధురమే… ఈ ప్రేమ జ్ఞాపకాలు ఎప్పటికీ మధురమే..

ప్రేమలో పడిన నాటి నుంచి ప్రతి క్షణం ఆనందంగానే గడుస్తుంది. అందులోనూ మనసుకి నచ్చిన వ్యక్తి  సాంగత్యంలో సమయం గడుపుతామేమో.. ప్రపంచమంతా అందంగానే కనిపిస్తుంది. ప్రతి సంఘటన మరపురానిదిగానే అనిపిస్తుంది. కానీ కొన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అవి మరింత లోతుగా ప్రేమలో మునిగిపోయేలా చేస్తాయి. అనుబంధాన్ని మరింత బలంగా చేసే అలాంటి కొన్ని జ్ఞాపకాలను (memories) ఇప్పుడు తరచి చూద్దాం.

1. ప్రేమ బంధం (love) మొదలైన తొలినాళ్లలో చాలా విషయాల్లో స్పష్టత ఉండదు. కానీ తొలిముద్దు ఇచ్చిన తర్వాత ప్రేమ విషయంలో మీకున్న అనుమానాలన్నీ పటాపంచలు అయిపోతాయి. 

నిజమే.. మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తున్నాడనే విషయం తొలిముద్దు సమయంలో తెలుస్తుంది.

2. మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో బంధం మొదలైన రోజుల్లో రాత్రంతా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాం. చుక్కల పందిరి కింద చుట్టూ ఉన్న పరిసరాలను లెక్క చేయకుండా  అలా మాట్లాడటం మీకు గుర్తుంది కదా..!

అలా అర్థరాత్రి వరకు మాట్లాడుకున్న పిచ్చాపాటీ కబుర్లే మీ బంధాన్ని దృఢంగా చేస్తాయి. మాట్లాడుకోవడం వల్లే కదా ఒకరి గురించి మరొకరికి తెలుస్తుంది.

3. మీ మనసు బాగోలేదన్న విషయాన్ని మీరు ప్రేమించిన వ్యక్తి మీరు చెప్పకుండానే గుర్తిస్తాడు. ఆ విషయాన్ని మిమ్మల్ని చూడకుండానే.. మీ మాటల ద్వారా తెలుసుకోగలుగుతాడు. అంతేకాదు.. ఆ సమయంలో మిమ్మల్ని ఉత్సాహపరిచే ప్రయత్నం కూడా చేస్తాడు.

అలా చేసినప్పుడే కదా.. అతడు మిమ్మల్ని ఎలా చూసుకొంటాడో తెలుస్తుంది.

4. మీ ఇద్దరూ మొదటి సారిగా గొడవ పడిన సందర్భం గుర్తుందా? ముందు గొడవపడి.. ఆ తర్వాత ఎన్ని గొడవలొచ్చినా ఫర్లేదు.. ఇతనితోనే నా జీవితం అనుకొన్న విషయం గుర్తుందా?

ఆ గొడవని పక్కనపెట్టి మళ్లీ ఇద్దరూ ఒక్కటైన ఆ సమయంలో ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా..

5. మొదటిసారి మిమ్మల్ని అతని స్నేహితులకు, సహోద్యోగులకు ‘నా గర్ల్ ఫ్రెండ్ రా’ అని పరిచయం చేసిన క్షణంలో కలిగేది చిన్నపాటి ఆనందమైనా ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా..!

ఏంటీ మళ్లీ ఆ మధుర క్షణాలు కళ్ల ముందు మెదులుతున్నాయా?

6. మీమీద అతనికున్న ప్రేమ అనిర్వచనీయం, అవ్యాజమని తెలుసుకొన్న క్షణం.. అప్పటి వరకు మీ బంధం పట్ల ఉన్న అనుమానాలన్ని పటాపంచలైపోయిన ఆ నిమిషం.. మీ భవిష్యత్తు పట్ల మీకు కలిగిన నమ్మకం మీకు ఎప్పటికీ మరచిపోని అనుభూతిగానే మిగిలిపోతుంది.

ఈ భావాన్ని మించింది ఇప్పటి వరకు మీకు అనుభవంలోకి రాలేదు కదా..!

7. మీరు అతడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా.. అతడు మీ పట్ల అంతులేని ప్రేమ కనబరుస్తున్నా.. ఎక్కడో చిన్న భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అయినా అతని ప్రేమ ఆ భయాన్ని మరచిపోయేలా చేస్తుంది.

అసలు ఒక వ్యక్తిని ఇంతలా ప్రేమించడం ఎలా సాధ్యమవుతుంది చెప్పండి.

8. ప్రపంచంలో మీకు తోడుగా ఎవరూ లేరని భావిస్తున్న తరుణంలో.. మీకు తోడుగా అతడు నిలబడితే.. ప్రపంచాన్నే జయించిన భావన కలుగుతుంది. ఆ సమయంలో ఏ నాటికీ నేను ఒంటరి కానని మీకనిపించే ఉంటుంది.

అతను మీ పక్షాన నిలబడిన క్షణం ఈ ప్రపంచమే మీ ముందు మోకరిల్లుతుంది.

9. మీరు చెప్పకుండానే మీ మనసులోని మాట అతని నోటి నుంచి విన్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం నిజమైనదనిపిస్తుంది.

ఇలాంటి సంఘటనలు  ఇప్పటి వరకు చాలానే జరిగి ఉంటాయి కదా..!

10. భవిష్యత్తు గురించి మాట్లాడుకొనే సమయంలో ఇద్దరి అభిప్రాయాలు కలిస్తే.. ఇద్దరం ఒకే పడవపై ప్రయాణం చేస్తున్నాం అనిపించకమానదు. అంతేకాదు అందమైన భవిష్యత్తు కళ్ల ముందు మీకు కనిపించిందా?

అప్పుడు అందమైన జీవితం మీ కళ్ల ముందు మెదిలే ఉంటుంది.

11. మీరేదైనా తప్పు చేసినప్పుడు మీరు ప్రేమించిన వ్యక్తికి బాగా కోపం వచ్చిన సందర్భాలు ఉండే ఉంటాయి. అప్పుడు మీరు ఆ తప్పుని ఒప్పుకొంటే.. తిట్టడం మాని.. గట్టిగా హత్తుకొని మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన సంఘటన మీకు గుర్తొచ్చిందా?

ఆ సమయంలో అతనికి ముద్దు మీద ముద్దు పెట్టి మీ ప్రేమను అతనికి తెలియచేసే ఉంటారుగా.

12. మీ చేతిని సుతిమెత్తగా నొక్కి నేనున్నానే ధైర్యం కల్పించినప్పుడు..

మన ప్రపంచమే మన వెంట ఉంటే ఈ లోకంతో మనకు పని ఏల?

13. మీకు నచ్చినట్టుగా తనను తాను మలచుకోవడానికి అతడు ప్రయత్నిస్తున్నాడని మీకు తెలిసినప్పుడు సప్తసముద్రాలు అడ్డు వచ్చినా సరే అతన్ని ఆ క్షణం చేరుకొని గట్టిగా కౌగిలించుకోవాలనుకొన్న సమయం మీకు గుర్తుందా?

అతనే కాదు.. మీరు కూడా అతని కోసం మిమ్మల్ని మీరు మార్చుకొనే ఉంటారు కదా.. అది మీకు అంతులేని సంతోషాన్ని కలిగించి ఉంటుంది.

అమ్మాయిలూ ఇప్పుడు చెప్పండి. మీలో ఎంత మందికి ఇవి అనుభవంలోకి వచ్చాయి?

GIFs: Giphy, Tumblr

ఇవి కూడా చదవండి

ఉంగరం తొడగాలా? ప్రేమ లేఖ ఇవ్వాలా? అతడికి ఎలా ప్రపోజ్ చెయ్యాలి?

పెళ్లయ్యాక.. మీరు మీ భాగస్వామితో చర్చించకూడని 9 విషయాలు ఇవే..!

ఈ 12 ఊహాజనితమైన ఆలోచనలూ.. మీకు తెలియకుండానే మీ ప్రేమబంధంలో కలతలు తీసుకురావచ్చు

Read More From Lifestyle