Lifestyle

‘అమ్మ… నాన్న… ఓ మళయాళీ అమ్మాయి’ (సుమ – రాజీవ్ కనకాల ప్రేమకథ)

Sandeep Thatla  |  Aug 30, 2019
‘అమ్మ… నాన్న… ఓ మళయాళీ  అమ్మాయి’ (సుమ – రాజీవ్ కనకాల ప్రేమకథ)

సినిమాల్లో మనం చాలా ప్రేమకథలు (Love Story) చూసుంటాం. అయితే  వైవిధ్యంగా ఉండే ప్రేమకథలే.. సగటు ప్రేక్షకుడిని ఆకర్షిస్తాయి. అలాంటి వైవిధ్యమైన ప్రేమకథే స్టార్ యాంకర్ సుమ (Suma), ప్రముఖ క్యారెక్టర్ యాక్టర్ రాజీవ్ కనకాల (Rajeev Kanakala) మధ్య నడిచింది. 

కృష్ణవంశీ – రమ్యకృష్ణల ప్రేమ చిగురించడానికి.. కారణమైన పాటేమిటో మీకు తెలుసా?

1994లో శాటిలైట్ ఛానల్స్ ఉనికి చాలా తక్కువగా ఉన్న కాలంలో.. కేవలం దూరదర్శన్ మాత్రమే ప్రేక్షకులకు వినోదాన్ని పంచేది. దూరదర్శన్‌లో వార్తలతో పాటుగా కొన్ని ధారావాహికలు, టెలిఫిల్ములు, సింగిల్ ఎపిసోడ్‌లు ప్రసారమవుతుండేవి. అలా ఒక సింగిల్ ఎపిసోడ్ షో షూటింగ్‌లో భాగంగా.. తొలిసారిగా సుమ, రాజీవ్‌లు ఒకరినొకరు చూసుకున్నారట.

వారి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారడం.. తర్వాత అదే స్నేహం ప్రేమగా మారడం జరిగింది. ఇంతకీ వీరిద్దరిలో మొదట ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా..? రాజీవ్ కనకాలే తొలుత తన మనసులోని మాటను తెలిపారట. అయితే తన కుటుంబ నేపధ్యం, ఒక మలయాళీ అయి ఉండి తెలుగు వారి ఇంటికి వెళ్లాల్సి రావడం… అందులోనూ ప్రేమ వ్యవహారం కావడంతో సుమ తొలుత రాజీవ్‌ని వద్దనుకుంది. అయితే కొద్దికాలానికి రాజీవ్ ప్రేమకి.. సుమ ఓకె చెప్పడంతో వారి ప్రేమకథ మొదలైంది.

అయితే కథ సుఖాంతమైందని అనుకుంటుండగానే… సుమ ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అదే “కళ్యాణ ప్రాప్తిరస్తు”.  అయితే సుమ హీరోయిన్ కావడం ఇష్టం లేని రాజీవ్… పలు ఆంక్షలు పెట్టడంతో ఇరువురి మధ్య మనస్పర్థలు వచ్చి.. దాదాపు రెండేళ్ళ పాటు ఒకరికొకరు దూరంగా ఉన్నారట.

అలా రెండేళ్లు గడిచిపోయాక… ఈ ఇద్దరు మరోసారి మాట్లాడుకోవడం.. అంతకుముందు జరిగినదాన్ని మరిచిపోయి ముందుకి వెళ్ళాలని నిర్ణయానికి రావడం జరిగింది. . ఆ సమయంలోనే సుమ ఇంట్లో.. వీరి ప్రేమ విషయం తెలియడం, వారు తొలుత ఒప్పుకోకపోవడంతో.. మళ్లీ వీరి పెళ్ళికి కొన్నాళ్ళు బ్రేక్ పడింది.

అయితే ఆ తరువాత ఇరువురి కుటుంబాలు కలవడం, పరస్పర అంగీకారంతో ఫిబ్రవరి 13, 1999 తేదిన వీరిరువురి వివాహం జరగడంతో.. వారి ప్రేమ బంధం వివాహ బంధంగా మారింది.  ఇప్పటికి దాదాపు 20 ఏళ్ళుగా వారు అన్యోన్యంగా కలిసి ముందుకి సాగుతున్నారు. ఇక వీరి ప్రేమకథ నడిచే రోజుల్లో.. ప్రతి ఆదివారం డ్యాన్స్ క్లాస్‌కి వచ్చే సుమని కలవడానికి ప్రత్యేకించి రాజీవ్ సికింద్రాబాద్‌కి వచ్చేవాడట.  ఆమెకి చాక్లెట్లు, గ్రీటింగ్ కార్డ్స్‌ని కూాడా గిఫ్ట్స్‌గా ఇస్తుండేవాడు రాజీవ్.

సినిమా స్టోరీని తలపించేలా.. దర్శకుడు “పూరి జగన్నాధ్ – లావణ్య”ల లవ్ స్టోరీ..!

సుమ రాజీవ్ ప్రేమని అంగీకరించి.. పెళ్ళికి ఒప్పుకున్న తరువాత వీరిద్దరూ కలిసి చూసిన చిత్రం ‘కుచ్ కుచ్ హోతా హై’ అనే హిందీ సినిమా. అయితే ఆ సినిమాకి సుమతో పాటుగా.. వాళ్ళ అమ్మ కూడా రావడం జరిగింది. అలా రావడమే కాకుండా.. ఈ ఇరువురి మధ్య సీట్లో కూర్చుని మరీ ఆమె ఆ సినిమా చూసిందట. అది జరిగి ఇప్పటికి 20 ఏళ్ళు గడిచిపోయినా.. ఇప్పటికి కూడా ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని వారి కుటుంబీకులు నవ్వుకుంటుంటారు.

అలాగే రాజీవ్ కనకాల తన ప్రేమకథని గుర్తు చేసుకుంటూ… “నా జీవితంలో ప్రేమకథ అంటే ఫైట్స్, ఛేజింగులు వంటివి ఉండాలి అని ఎప్పుడూ కోరుకుంటూ ఉండేవాడిని. కాని అవేమి లేకుండానే చాలా చప్పగా మా ప్రేమకథ పెళ్ళికి చేరింది” అని చాలా ఇంటర్వ్యూలలో చెబుతుంటాడు. ఈ దంపతులకి ఇద్దరు సంతానం. అబ్బాయి రోషన్ & అమ్మాయి మనస్విని. అబ్బాయి రోషన్ కనకాల ఇప్పటికే “నిర్మలా కాన్వెంట్” చిత్రంతో సహాయ నటుడిగా తెరంగేట్రం చేయడం జరిగింది.

ఇక వీరి వివాహం అనంతరం.. సుమ నట శిక్షకులైన రాజీవ్ తల్లిదండ్రులు – లక్ష్మి, దేవదాస్ కనకాల ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో మంచి యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఒక మళయాళీ అయి ఉండి కూడా.. తెలుగులో స్పష్టంగా మాట్లాడుతూ యాంకరింగ్ చేసే ఆమె స్టైల్‌కి అభిమానులు ఎందరో…

అయితే వీరి ప్రేమకథకి మంచి సినిమా స్టైల్‌లో టైటిల్ పెట్టాలంటే మాత్రం – ‘అమ్మ… నాన్న… ఓ మళయాళీ అమ్మాయి’ అనేది చక్కగా సరిపోతుంది.

ప్రభాస్ “సాహో” చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా.. లేదా..?

Read More From Lifestyle