Life

ఈ వెడ్డింగ్ కేక్స్.. నిజంగానే మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి

Lakshmi Sudha  |  Jan 2, 2019
ఈ వెడ్డింగ్ కేక్స్.. నిజంగానే మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి

దుస్తులు, నగలు, అలంకరణ వస్తువులు, పెళ్లి మండపం, డెకరేషన్, ఫొటోగ్రాఫర్, క్యాటరింగ్, పూల దండలు .. ఇలా వివాహ వేడుకకు అవసరమైన వాటన్నింటినీ ఈ రోజు ముందుగానే అందరూ పురమాయించుకుంటున్నారు. ఈ విషయం మనకు తెలిసిందే. ఇలా అన్నింటికీ ముందే సిద్ధంగా లేకపోతే.. వివాహం జరిగే రోజున ఇబ్బంది పడతామని అలా చేస్తుంటారు. కానీ ఈ తొందర వెడ్డింగ్ కేక్స్ (wedding cakes) విషయంలో కనిపించదు. చివరి నిమిషంలో ఏదో ఒక కేక్ తెప్పించి పని అయిందనిపిస్తుంటారు.

అలా కాకుండా చక్కగా వెడ్డింగ్ కేక్‌ను డిజైన్ చేయించుకొని దాన్ని కట్ చేయండి. మరి వెడ్డింగ్ కేక్ ఎలా ఉంటే బాగుంటుంది? అక్కడికే వస్తున్నాం. దిల్లీలో The Hot Pink Cake studio అని ప్రత్యేకంగా కేకులను తయారుచేసే బేకరీ ఒకటుంది. వారు చక్కటి వెడ్డింగ్ కేక్‌లను డిజైన్ చేస్తున్నారు. వాటిని మేం మీకు పరిచయం చేస్తాం. అలాంటి వాటిని మీ పెళ్లికి కూడా తయారుచేయించుకొని మరీ కట్ చేయండి.

 

ఇప్సిత చకల్దార్, షర్మిల బసు ‘ది హాట్ పింక్ కేక్ స్టూడియో’ను ప్రారంభించారు. బెంగళూరులోని ఐహెచ్ఎమ్‌లో చదువు పూర్తిచేసుకొన్న ఇప్సిత తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో తన కెరీర్ ప్రారంభించారు. 2010లో సొంతంగా హాట్ పింక్ కేక్ స్టూడియోను ప్రారంభించారు. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉపయోగించకుండా.. ఇంట్లోనే తయారుచేసిన పదార్థాలను కేక్ తయారీకి వాడతారు.

 

ఈ పెళ్లి సీజన్‌లో మరింత సృజ‌నాత్మ‌కంగా వెడ్డింగ్ కేక్స్ తయారుచేయడానికి సన్నద్ధమవుతున్నారామె. మరీ ముఖ్యంగా మనదేశ వివాహ సంప్రదాయంలో భాగమైన వివిధ అంశాలను థీమ్‌గా ఆమె ఎంచుకోనున్నారు. ముఖ్యంగా బరాత్, వధూవరులు, వారి తొలిరాత్రులను ఆధారంగా చేసుకొని కేక్‌లను తయారుచేస్తున్నారు.

 

ఇలా కేక్‌లను తయారుచేయడంపై ఆమె స్పందిస్తూ.. ‘కేక్ తయారుచేసే విషయంలో నేను ఏ అంశాన్నైనా స్ఫూర్తిగా తీసుకొంటాను. ముఖ్యంగా దుస్తులు, నగలు, ప్ర‌కృతి ఇలా ఏదైనా సరే నా కేక్‌కు థీమ్‌గా మారిపోతుంది.’ 

 

వారందించే వాటిలో చాక్లెట్ రాస్ప్బెర్రీ మడ్ కేక్, బనాఫీ, టిరామిసు, చాక్లెట్ విస్కీ కేక్ అధికంగా అమ్ముడు పోతున్నాయి. వీరు తయారుచేసిన కేక్‌ల ఫొటోలను చూస్తుంటే నోరూరుపోతోంది కదా..! మరింకెందుకు ఆలస్యం.. మీ పెళ్లికి కూడా ఇలాంటి కేక్  ఆర్డర్ ఇచ్చేయండి.

ఇవి కూడా చదవండి

ఎగ్ లెస్ పైనాపిల్ కేక్ తయారినీ గురించి ఆంగ్లంలో చదవండి

ఇషా అంబానీ నిశ్చితార్థ వేడుకకి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కేక్ పై వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి

హైదరాబాద్ నగరంలో క్రిస్మస్, న్యూఇయర్ కేకులకు ఈ బేకరీలు ప్రత్యేకం.. ఈ వ్యాసాన్ని తెలుగులో చదవండి

Read More From Life