మగవాళ్ల (Men) మనస్తత్వాలు, ఆడవారి మనస్తత్వాలు వేరుగా ఉంటయనేది అందరూ చెప్పే విషయమే. అందుకే మెన్ ఆర్ ఫ్రం మార్స్.. వుమెన్ ఆర్ ఫ్రం వీనస్ అని అంటుంటారు. ఒక జంట కొన్నాళ్లు డేటింగ్ చేసినా లేదా ఇద్దరూ పెళ్లి (marriage) చేసుకున్న తర్వాత లివింగ్ రిలేషన్ షిప్‌లోకి మారిన కూడా.. తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. పెళ్లికి ముందు ఒకలా ఉన్న మగవాళ్లు.. పెళ్లయ్యాక మరోలా ఉంటారు.
అయితే ఇందులో సీరియస్ విషయాలేవీ లేవు కానీ.. కొన్ని మీకు నవ్వు తెప్పిస్తే మరికొన్ని చిరాకు కలిగిస్తాయి. అందుకే పెళ్లి తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌లో ఇదీ ఒకటి అని భావించి మర్చిపోవాలి అంతే. మరి, పెళ్లయ్యాక మాత్రమే అబ్బాయిల గురించి మనం తెలుసుకోగలిగే విషయాలేంటో మీకు తెలుసా? అవేంటో ఒకసారి చూద్దాం రండి.
1. తను ఎంత బద్ధకస్తుడో తెలుస్తుంది.
పెళ్లికి ముందు మిమ్మల్ని కలవడానికి.. టిప్ టాప్‌గా సిద్ధమై వచ్చే ఆ వ్యక్తి బద్ధకస్తుడని మీకేం తెలుసు. పెళ్లయ్యాక సండే సాయంత్రం అయినా స్నానం చేయడానికి.. మీతో తిట్లు తింటే తప్ప మీకు ఆ విషయం అర్థం కాదు మరి..
2. సినిమాలు చూస్తుంటే తను ఏడుస్తాడు..
పెళ్లికి ముందు మీరిద్దరూ కలిసి సినిమాలు చూసినా.. తను మీతో మాట్లాడుతూ బిజీగా ఉంటాడు కాబట్టి సినిమా చూడలేదేమో.. అందుకే ఈ విషయం కూడా పెళ్లయ్యాక బాగా తెలుస్తుంది.
3. తన మనసుకు దారి మీ చేతి వంట..
పెళ్లికి ముందు బయట తింటుంటే తనకేం ఇష్టమో అర్థమవుతుంది. కానీ తను ఎలా తింటాడో మీకు తెలీదు కదా.. పెళ్లయ్యాక మీ చేతి ఛీజ్ పాస్తా అంటే తను పడిచచ్చిపోతాడని ముందే వూహించలేం కదాా.
4. ఇంతకుముందు జన్మలో తను పోలార్ బేర్ అనుకుంటా..
మరి, రాత్రి పడుకునేటప్పుడు గది అంటార్టికాలో ఉన్నంత చల్లగా ఉండాలనుకుంటాడు.
5. బ్లాంకెట్ లాగడంలో తనే నంబర్ వన్..
గది మంచు కురిసేంత చల్లగా మార్చి నేను దుప్పటి కప్పుకొని.. నిద్రపోతే దాన్ని లాక్కొని పడుకోవడంలో తను నంబర్ వన్ అని పెళ్లయ్యాక తెలుస్తుంది.
6. కొన్ని వస్తువులంటే తనకెంతో ఇష్టం.
పదిహేనేళ్ల క్రితం కొన్న సీడీ ప్లేయర్ ఇంకా దాచుకునే వ్యక్తులు ఇంకెవరైనా ఉంటారా?
7. తను మూడీ కూడా..
అమ్మాయిలే మాటిమాటికీ మూడీ అవుతారని అనవసరంగా మమ్మల్ని ఆడిపోసుకుంటారెందుకో..
8. టీవీ చూసేటప్పుడు డిస్టర్బ్ చేస్తే యుద్ధమే..
మనకు నచ్చినవి చూసేటప్పుడు ఇలా చేస్తే మనకూ కోపమొస్తుంది. కానీ అబ్బాయిలు కోపగించుకోవడం కాస్త డిఫరెంట్.. కదండీ..
9. తనకు శుభ్రత అస్సలు ఉండదు.
స్నానం చేశాక టవల్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు.. పుస్తకాల అరలో ఒక్కటి తీసుకొని మిగిలినవన్నీ కింద పడేస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత అవుతుంది.
10. మీరు కొన్ని గంటలు కనిపించకపోతే తను బెంగపడతాడు..
మీరు ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చినా.. లేక ఎక్కడికైనా వెళ్లినా.. గంటకోసారి ఫోన్ చేయడం లేక మెసేజ్ చేయడం వంటివి చేస్తుండడం పెళ్లికి ముందు చేసినా పెళ్లయ్యాక కాస్త ఎక్కువవుతుంది.
11. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే తను నర్స్ అయిపోతాడు..
మీరు తుమ్మినా, దగ్గినా సరే.. అది తగ్గేవరకూ కేర్ తీసుకుంటుంటాడు.
12. మీపై ప్రేమను చాటేందుకు అతడికి కోట్ల మార్గాలు తెలుసు..
పెళ్లికి ముందు ఇవన్నీ ఎందుకు చేయలేదా అని అనిపించడం ఖాయం.
ఇవి కూడా చదవండి.
తొలిచూపులోనే పుట్టిన ఈ ప్రేమ కథలు.. మీ మనసును హత్తుకుంటాయి..!
సెలబ్రిటీ టాక్: ప్రేమబంధం కలకాలం.. నిలవాలంటే ఏం చేయాలి ..?
పచ్చని కొండలనే.. పెళ్లి వేదికగా చేసుకున్న ప్రేమ జంట..!
Gifs : Giphy