Lifestyle

ఫిమేల్ కండోమ్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే..

Lakshmi Sudha  |  Mar 14, 2019
ఫిమేల్ కండోమ్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే..

ఫిమేల్ కండోమ్స్(female condom) మార్కెట్లోకి వచ్చి చాలా కాలమే అయినప్పటికీ అవగాహన లేకపోవడం వల్ల మహిళలు వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. వీటిని ఉప‌యోగించడం వల్ల లైంగికంగా సంక్రమించే వ్యాధులు సోకకుండా ఉంటాయి. అలాగే అవాంఛిత గర్భధారణ జరిగే అవకాశం ఉండదు. మార్కెట్లో ఇవి విరివిగానే లభిస్తున్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో పాటు.. వాటి విషయంలో ఉన్న కొన్ని సందేహాల కారణంగానూ ఫిమేల్ కండోమ్స్ ఉపయోగించడానికి మహిళలు సంశయిస్తున్నారు. ఫిమేల్ కండోమ్స్ విషయంలో మహిళలకు ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉండ‌డం స‌హ‌జ‌మే. కాబ‌ట్టి సమాధానాలు తెలుసుకొని వాటిని తొలగించుకొందాం.

1. ఫిమేల్ కండోమ్ ఎలా ఉపయోగించాలి?

ఫిమేల్ కండోమ్ పెట్టుకోవడానికి ముందు అది పెట్టుకునేందుకు మీకు వీలుగా ఉండే పొజిషన్ లో ఉండాలి. బొటనవేలి సాయంతో కండోమ్ ను యోని లోపలికి ఇన్సర్ట్ చేయాలి. ఇలా పెట్టుకొనేటప్పుడు కండోమ్ కి ఉన్న రింగ్ బయటే ఉండేలా జాగ్రత్తపడాలి. 

2. మేల్ కండోమ్, ఫిమేల్ కండోమ్ రెండూ ఒకేసారి ఉపయోగించవచ్చా?

ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ రెండింటి మధ్య జరిగే ఘర్షణ కారణంగా కండోమ్స్ చిరిగిపోవడం లేదా జారిపోవడం జరగవచ్చు.

Also Read: ఈ తొలిరేయి జ్ఞాప‌కాలు.. కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా ఉంటాయి..

3. ఫిమేల్ కండోమ్స్ మళ్లీ మళ్లీ ఉపయోగించవచ్చా?

ఉపయోగించకూడదు. ఫిమేల్ కండోమ్ ధరించి సెక్స్ లో పాల్గొన్న వెంటనే దాన్ని తొలగించడం మంచిది. దీన్ని ఉపయోగించడం వల్ల మీకు లైంగిక పరమైన వ్యాధులు సోకకుండా ఉండటంతో పాటు అవాంఛిత గర్భం దాల్చుతామ‌న్న భ‌యం ఉండ‌దు.

4. పొరపాటున గర్భాశయంలో ఫిమేల్ కండోమ్ ఉండిపోతే..?

ఆ సందేహమే అక్కర్లేదు. ఎందుకంటే ఫిమేల్ కండోమ్ నిర్దేశిత సైజ్ లో ఉంటుంది. కాబట్టి అది గర్భాశయ ముఖద్వారాన్ని దాటి లోపలికి వెళ్లదు.

5. ఏ రకమైన మెటీరియల్ తో దీన్ని తయారుచేస్తారు?

పాలీ యురేథేన్ తో ఫిమేల్ కండోమ్స్ తయారుచేస్తారు. ఈ కండోమ్స్ కు ఉండే రింగ్స్ ను సైతం అదే మెటీరియల్ తో తయారుచేస్తారు. అందుకే అవి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. అంతేకాదు ప్రస్తుతం మార్కెట్లో ప్రీ లూబ్రికేటెడ్ కండోమ్స్ కూడా దొరుకుతున్నాయి.

6. ఫిమేల్ కండోమ్స్ భిన్న సైజుల్లో లభిస్తుందా?

ఫిమేల్ కండోమ్స్ ఫ్రీ సైజులో లభిస్తాయి. కాబట్టి ఇవి ఎవరికైనా సరిపోతాయి.

7. పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఫిమేల్ కండోమ్ ఉపయోగించవచ్చా?

నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు. ఇది నెలసరిపై ఎలాంటి ప్రభావం చూపించదు. మీరు టాంఫూన్ లేదా మెనుస్ట్రువల్ కప్ ఉపయోగిస్తుంటే కనుక వాటిని తీసిన తర్వాత ఫిమేల్ కండోమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది.

Also Read: నెల‌స‌రి స‌మ‌యంలో క‌ల‌యిక.. ఆరోగ్యానికి మంచిదేనా?

8. ఫిమేల్ కండోమ్ ఉపయోగించడం వల్ల కలిగే లాభాలేంటి?

ఇది అవాంఛిత గర్భాన్ని నివారిస్తుంది. అలాగే లైంగిక చర్య ద్వారా సంక్రమించే వ్యాధులు, హెచ్ ఐవీ వంటివి సోకకుండా కాపాడుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్యాక్ పై ఉన్న సూచనల ప్రకారం ఫిమేల్ కండోమ్ ధరించినట్లయితే.. గర్భం రావడానికి 95% అవకాశం ఉండదు.

9. ఫిమేల్ కండోమ్స్ ఎక్కడ దొరుకుతాయి?

సూపర్ మార్కెట్స్, ఫార్మసీ షాపుల్లో ఇవి దొరుకుతాయి. వీటిని ఆన్లైన్ లో సైతం కొనుగోలు చేయవచ్చు.

Also Read: ఇంట్లో ఒంటరిగా ఉంటే.. అమ్మాయిలు ఎలాంటి చిలిపి పనులు చేస్తారో తెలుసా?

10. ఫిమేల్ కండోమ్ సౌకర్యవంతగానే ఉంటుందా?

ఆరంభంలో కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ నెమ్మదిగా వాటికి అలవాటు పడతారు. మేల్ కండోమ్స్ ఎంత పొడవు ఉంటాయో.. ఇవి కూడా అంతే పొడవు ఉంటాయి. అయినా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. కాబట్టి అసౌకర్యంగా అనిపిస్తుందేమననే సందేహం అవసరం లేదు.

Images: Giphy, Tumblr, Shutterstock

Read More From Lifestyle