Health

Period Tracker.. పీరియడ్స్ గురించి ఏం చెబుతుందో తెలుసా? (What Is Period Tracker And Its Uses)

Akanksha Bhatia  |  Dec 4, 2018
Period Tracker.. పీరియడ్స్ గురించి  ఏం చెబుతుందో తెలుసా? (What Is Period Tracker And Its Uses)

పీరియడ్స్.. రుతుక్రమం మొదలైన ప్రతి అమ్మాయిని నెలనెలా వచ్చి పలకరించి వెళ్లే అతిథి. కొన్నిసార్లు కచ్చితమైన తేదీకే వచ్చినా మరికొన్ని సార్లు  ఆలస్యంగా.. ఇంకొన్నిసార్లు ముందుగా వచ్చేస్తుంది. మరి  నెలసరి ఎప్పుడు వస్తుందో సరిగ్గా వూహించేదెలా? ఈతరం అమ్మాయిలుగా మనం అంతర్జాలానికి  ఓసారి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే నెలసరి ఎప్పుడు వస్తుందో ఇంచుమించుగా చెప్పగలిగే పీరియడ్ ట్రాకర్ ను మన చేతిలోకి తీసుకొచ్చిపెట్టింది. అసలు ఈ పీరియడ్ ట్రాకర్ వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి? దాన్ని ఉపయోగించడం ఎలా? కచ్చితమైన ఫలితాలనే ఇస్తుందా? ఇలాంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. 

కాలం ట్రాకర్ యొక్క చిట్కాలు మరియు ఉపయోగాలు (Tips And Uses Of Period Tracker)

రుతుచక్రం అంటే నెలసరికి, నెలసరికి మధ్య ఉండే సమయం. సాధారణంగా ఇది 28 రోజులు ఉంటుంది. కొంతమందిలో అయితే రుతుక్రమం 21 నుంచి 40 రోజుల వరకు ఉంటుంది. రక్తస్రావం కూడా మూడు నుంచి ఐదు రోజుల వరకు అవుతుంది. ఇది మహిళ గర్భాశయ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. అందుకే పీరియడ్ ట్రాకర్ ఉపయోగిస్తే గర్భాశయ ఆరోగ్యంపై కూడా మనం దృష్టి సారించవచ్చు.

What Is Period Tracker 

Tips For Using Periodic Tracker 

How To Use Period Tracker 

Frequently Asked Questions 

నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, రక్తస్రావం కారణంగా పీరియడ్స్ వస్తోందంటేనే కాస్త భయంగా ఉంటుంది. నేను పీరియడ్ ట్రాకర్ ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత పీరియడ్స్ విషయంలో నిశ్చింతగా ఉన్నాను. పీఎంఎస్ మొదలయ్యే సమయానికే నాకు పీరియడ్ ట్రాకర్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. అంటే రుతుచక్రం మొదలవడానికి రెండురోజుల ముందే నాకు ఆ విషయం తెలుస్తుంది. కాబట్టి నేను సిద్ధంగా ఉంటాను. ఎక్కడికి వెళ్లినా శానిటరీ న్యాప్కిన్ వెంట తీసుకెళ్తాను. దుస్తుల విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తాను.

 

పీరియడ్ ట్రాకర్ అంటే  ఏంటి? (What Is Period Tracker)

పీరియడ్ ట్రాకర్ అంటే రెండు నెలసరుల మధ్య మీ శరీరంలో వచ్చిన మార్పుల ఆధారంగా మీ రుతుక్రమం ఎలా ఉంటుందో తెలిపే క్యాలెండర్ లాంటిది. దీన్ని ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. అండం విడుదలయ్యే సమయం, ఫలదీకరణం చెందే సమయం గురించి మనకు తెలియజేస్తుంది. ఫలితంగా మీ గర్భాశయానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలపై అవగాహన వస్తుంది. అంతర్జాలంలో ఎన్నో రకాల పీరియడ్ ట్రాకర్ యాప్ లున్నాయి. వాటిలో ఒకదాన్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే Popxo యాప్ లో అంతర్భాగంగా ఉన్న Gulabo పీరియడ్ ట్రాకర్ ఉపయోగిస్తాను.

పీరియడ్ ట్రాకర్ వాడటం వల్ల ఉపయోగాలేంటి? (Use Of Period Tracker)

1. ముందే ఊహించవచ్చు

అనుకోకుండా మనకు  ఎవరైనా Zara gift card లాంటి  సర్ప్రైజ్ బహుమతి ఇస్తే ఎలా ఉంటుంది? నా పీరియడ్స్ కూడా నాకలాంటి అనుభూతినే ఇస్తాయి. అందుకే అది ఎప్పుడు వస్తుందో ముందుగానే తెలుసుకోవాలనుకొంటాను. నా Gulabo Period Tracker పీఎంఎస్ మొదలయ్యే సమయానికి నెలసరి ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ పంపిస్తుంది.  ఈ యాప్ ఉపయోగించడం చాలా సులభం. పైగా రుతుక్రమం సంబంధిత విషయాలను హాస్యభరితంగా చెబుతూ పెదవులపై చిరునవ్వు తెప్పిస్తుంది.

2. గర్భం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు

పీరియడ్ ట్రాకర్ ఉపయోగించడం వల్ల అండం ఫలదీకరణం చెందే సమయం ఎప్పుడో కచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి గర్భం ధరించడం కోసం ఆత్రుతగా  ఎదురు చూస్తున్న మహిళలు పీరియడ్ ట్రాకర్ ఉపయోగించడం వల్ల రుతుక్రమం గురించి మాత్రమే కాకుండా ఏ సమయంలో భాగస్వామితో సంభోగం జరిపితే అది ఫలప్రదం అవుతుందో తెలుసుకోవచ్చు.

3. పీసీఓఎస్, పీసీఓడీ సమస్యలుంటే

చాలామంది మహిళలు పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్(పీసీఓఎస్), పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్(పీసీవోడీ) వంటి సమస్యలతో బాధపడుతుంటారు. వారికి రుతుచక్రంలో వచ్చే మార్పులను గమనించమని వైద్యులు చెబుతారు. అలాంటి వారికి Gulabo Period Tracker బాగా ఉపయోగపడుతుంది.

4. రుతుచక్రం బాగా అర్థమవుతుంది

రుతుచక్రం ఎప్పడు మొదలవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది? అండోత్పత్తి సమయం, ఫలధీకరణ సమయం వంటి అతి ముఖ్యమైన అంశాలను మనం తెలుసుకోవచ్చు. ప్రతి నెలా మనలో వచ్చే మార్పులకు అనుగుణంగా పీరియడ్స్ పై మనం అవగాహన పెంచుకోవచ్చు. అవసరమైతే నెలసరి సమయంలో మీకు ఎదురయ్యే సమస్యల గురించి యాప్ లో పొందుపరచవచ్చు. రక్తస్రావం ఎక్కువగా ఉందా? తక్కువగా అవుతోందా? మరీ తక్కువగా ఉందా? అనే అంశాలను యాప్ లో అప్లోడ్ చేయచ్చు. వాటి  ఆధారంగా తక్షణమే వైద్యున్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటే ఆ విషయాన్ని ట్రాకర్ తెలియజేస్తుంది. తద్వారా మీ రుతుక్రమం ఎలా ఉంటుందో అవగాహన పెరుగుతుంది.

5. సమాచారమంతా చేతిలోనే ఉంటుంది

పీరియడ్స్ కి సంబంధించిన సమస్యల చికిత్స కోసం గైనకాలజిస్ట్ ను సంప్రదించినప్పుడు ఈ పీరియడ్ ట్రాకర్ బాగా ఉపయోగపడుతుంది. మీరు ఆరోగ్యకరమైన రుతుక్రమం కలిగి ఉన్నారా? లేక ఏవైనా సమస్యలున్నాయా? అనే విషయం దీని ద్వారా తెలుసుకోవచ్చు.

6. లైంగిక జీవితాన్ని గమనించవచ్చు

పీరియడ్ ట్రాకర్ లో మీరు సంభోగంలో పాల్గొన్న రోజును మార్క్ చేసే వీలుంటుంది. ఇలా చేయడం వల్ల మీ లైంగిక జీవితం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అంతేకాదు.. మీరు సంతానం కోసం ప్రయత్నిస్తుంటే.. ఆ సమయంలో గైనకాలజిస్ట్ ను సంప్రదించినప్పుడు రుతుక్రమం గురించి ఆమె అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం సిద్ధంగా ఉంటుంది.

7. గర్భనిరోధక మాత్రలను గుర్తు చేస్తుంది

మీరు గర్భనిరోధక మాత్రలను వాడుతుంటే.. దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను పొందుపరుచుకొనే అవకాశం పీరియడ్ ట్రాకర్ లో ఉంటుంది. మరికొన్నింటిలో రోజూ మాత్రలు వేసుకోవడానికి అలారం పెట్టుకొనే వీలుంటుంది. కాబట్టి మీరు ఒక్క మాత్రను కూడా మరచిపోయే అవకాశం ఉండదు. కాబట్టి మీ రుతుచక్రం సవ్యంగా సాగుతుంది.

8. నెలసరి సమయంలో పరిస్థితిని నోట్  చేసుకోవచ్చు

పీరియడ్స్ సమయంలో ఒక్కొక్కొరి పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. పొత్తి కడుపులో నొప్పి, నడుము నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు మానసిక ఉద్వేగాల్లో విపరీతమైన మార్పులుటాయి. వీటినే మూడ్ స్వింగ్స్ అంటారు. వీటన్నింటినీ పీరియడ్ ట్రాకర్ లో హెల్త్ సెక్షన్లో పొందుపరచుకోవచ్చు. తద్వారా తర్వాతి నెలసరి సమయంలో మీకెలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ముందుగానే తెలుసుకోవచ్చు. దీని సాయంతో అవసరమైన ఔషధాలను ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. అలాగే భావోద్వేగాల్లో వచ్చే మార్పులను కూడా ట్రాకర్ లో నోట్ చేసుకోవడం వల్ల వైద్యులకు మీ సమస్యను స్పష్టంగా చెప్పి సరైన వైద్యం అందుకోవచ్చు. ఫలితంగా మరుసటి రుతుక్రమం లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు.

9. హార్మోన్ల పనితీరు గమనించవచ్చు

నెలసరి సమయంలో మాత్రమే కాదు.. పీఎంఎస్ సమయంలో సైతం మీరెలా ప్రవర్తిస్తున్నారు? ఎలా స్పందిస్తున్నారనే విషయాలను సైతం పీరియడ్ ట్రాకర్ లో నోట్ చేసుకోవచ్చు. దీని సాయంతో పీరియడ్స్ వచ్చినప్పుడు మీ మానసిక ఆరోగ్య పరిస్థితిపై అవగాహన పెరుగుతుంది. అంతేకాదు ఆ రోజుల్లో నొప్పి, వికారం, రక్తస్రాావం ఎప్పుడు ఎక్కువగా ఉంటున్నాయో గుర్తించే వీలుంటుంది. కాబట్టి మరుసటి నెల ఆ సమయానికి సిద్ధంగా ఉండచ్చు.

10.  ఇతర మార్పులు గుర్తించవచ్చు

రుతుక్రమం మొదలైన అమ్మాయిల్లో చాలా మందికి కాళ్లకు నీరు పట్టడం, పొట్ట ఉబ్బరంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి పీరియడ్స్ రావడానికంటే ముందే పలకరించే సమస్యలు. ఇలాంటి వాటిని ట్రాకర్ ద్వారా ముందుగానే గుర్తించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సౌకర్యవంతమైన దుస్తులను ధరించడం లాంటివి చేయడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.

పీరియడ్ ట్రాకర్ సమర్థంగా వాడటానికి చిట్కాలు(Tips For Using Periodic Tracker)

పీరియడ్ ట్రాకర్ యాప్ లోకి సైన్ అప్ అవడానికి ముందే మనం కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవడం మంచిది. అవేంటంటే..

1. మీరిచ్చే సమాచారం సరిగ్గా ఉండాలి

యాప్ లో మీరిచ్చే సమాచారం సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. మీకు నెలసరి మొదలైన తేదీ నుంచి రుతుచక్రం చివరి రోజు వరకు మీ శరీరంలో వచ్చిన ప్రతి చిన్న మార్పును యాప్ లో పొందుపరచుకోవాలి. ముఖ్యంగా సంభోగం జరిపిన రోజులు, గర్బనిరోధక మాత్రల వివరాల వరకు అంటే రుతుక్రమం గురించి  ప్రతి చిన్న అంశానికి సంబంధించిన సమాచారాన్ని అందివ్వాలి.

2. క్రమం తప్పకుండా అప్ డేట్ చేయాలి

నెలసరికి సంబంధించిన సరైన వివరాలను పీరియడ్ ట్రాకర్ మనకు అందించాలంటే క్రమం తప్పకుండా మనం సమాచారం అందించాల్సిందే. ఒక్క నెలకు సంబంధించిన వివరాలు లేకపోయినా నెలసరి తేదీని యాప్ సరిగ్గా గుర్తించలేదు. ముఖ్యంగా పీసీఓఎస్, పీసీఓడీ సమస్యలున్నట్లయితే రుతుక్రమం ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించలేం. కాబట్టి క్రమం తప్పకుండా పీరియడ్స్ కు సంబంధించిన వివరాలను యాప్ లో పొందుపరచాల్సి ఉంటుంది.

3. జీవనశైలిలో మార్పులు గుర్తించాలి

మన జీవనశైలిలో మార్పుల ప్రభావం రుతుక్రమంపై పడుతుంది. ముఖ్యంగా నిద్ర లేకపోవడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, ప్రయాణాలు చేయడం, అనారోగ్యాలు వంటివి కూడా పీరియడ్స్ పై ప్రభావం చూపిస్తాయి. వీటి కారణంగా పీరియడ్ ట్రాకింగ్ యాప్ అన్ని సందర్భాల్లోనూ నూరు శాతం కచ్చితమైన ఫలితాలను ఇవ్వదు. కాబట్టి ఈ మార్పులన్నింటినీ పీరియడ్ ట్రాకర్ లో నోట్ చేసుకోండి. ఏదైనా సమస్య తలెత్తినపుడు వాటిని గైనకాలజిస్ట్ తో చర్చించండి. దాని ఆధారంగా వారు అందించే చికిత్స ద్వారా రుతుక్రమం సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు.

4. వాటిని ఉపయోగించడం మానకూడదు

మీ భాగస్వామితో ఏ రోజున సంభోగం జరిపితే గర్భం దాల్చే అవకాశాలుంటాయో యాప్ తెలియజేస్తుంది. కాని దాన్ని ఆధారంగా చేసుకొని మిగిలిన రోజుల్లో సురక్షితం కాని లైంగిక చర్య జరపకూడదు. దానివల్ల మీరు అవాంఛిత గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. మీరు దానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఫర్వాలేదు కానీ.. కొంత విరామం తర్వాత సంతానాన్ని కనాలనుకొనే వారికి ఇబ్బందులేర్పడవచ్చు. అందుకే యాప్ ఇచ్చే సమాచారం ఆధారంగా చేసుకొని గర్భనిరోధక పద్ధతులను పాటించకుండా ఉండకూడదు.

పీరియడ్ ట్రాకర్ ఎలా ఉపయోగించాలి? (How To Use Period Tracker)

– Popxo యాప్ డౌన్లోడ్ చేసుకొన్న తర్వాత దానిలో ఉన్న Gulabo Widget ను క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ మెయిల్ లేదా ఫేస్బుక్ ఐడీతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

– గత నెలసరి తేదీని Gulabo Period Tracker మిమ్మల్ని అడుగుతుంది. 

– మీ రుతుచక్రం ఎన్ని రోజులుంటుందనే వివరాలను విడ్జెట్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన మహిళలకు ఇది 28 రోజులుగా ఉంటుంది.

– తర్వాత వచ్చే నెలసరి తేదీని కచ్చితంగా గణించాలంటే.. చివరి మూడు పీరియడ్స్ కు సంబంధించిన వివరాలను Gulaboలో పొందుపరచాల్సి ఉంటుంది. మీరిచ్చిన వివరాల్లో తప్పులేమైనా ఉంటే తర్వాత మార్చుకోవచ్చు.

– నెలసరి ఎప్పుడొస్తుందనే విషయం Gulabo Period Tracker మీకు చెప్పాలంటే నోటిఫికేషన్స్ ఆప్షన్ ను టర్న్ ఆన్ చేయండి.

– Popxo పీరియడ్ ట్రాకర్ అయిన Gulaboలో ‘feel better’ అనే సెక్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే రుతుక్రమంకు సంబంధించిన సమాచారాన్నందించే కథనాలు చదువుకోవచ్చు.

తరచూ అడిగే ప్రశ్నలు (Frequently Asked Questions)

పీరియడ్ ట్రాకర్ యాప్ సురక్షితమైన లైంగిక సంబంధానికి తోడ్పడుతుందా?

ముందే మనం చెప్పుకున్నట్లుగానే period tracker యాప్ ఉపయోగిస్తున్నాం కదా అని గర్భనిరోధక పద్ధతులను ఆచరించడం మానకూడదు. అలాగే గర్భం ధరించే అవకాశాలపై పీరియడ్ ట్రాకర్ ఇచ్చే సమాచారం పైనే పూర్తిగా  ఆధారపడకూడదు. ఒకవేళ మీరు గర్భం దాల్చినా ఇబ్బంది లేదనుకొంటే తప్ప మీరు అనుసరిస్తున్న నిరోధక పద్ధతులను మానకూడదు.

రుతుక్రమం గురించి 100% కచ్చితమైన సమాచారమిస్తుందాా?

మనం ఇచ్చిన సమాచారంలో ఎలాంటి తప్పులు లేనట్లయితే పీరియడ్ ట్రాకర్ యాప్ నెలసరి తేదీని కచ్చితంగా గణిస్తాయి. కాబట్టి మీరు వివరాలను సరిగ్గా ఇచ్చారా? లేదా? అనేదానిపైనే యాప్ పనితీరు ఆధారపడి ఉంటుంది.

అసలు పీరియడ్ ట్రాకర్ పనిచేస్తాయా?

Period Tracker మనమిచ్చిన సమాచారం ఆధారంగానే మన నెలసరి తేదీని లెక్కిస్తుంది. మీ రుతుక్రమం సంబంధిత అంశాలు తెలుసుకోవడానికి ఇది చాలా సులభమైన పద్ధతి. అలాగని పూర్తిగా వీటి మీదే ఆధారపడటం మంచిది కాదు. అందులోనూ మీరు సంతానం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే.. గైనకాలజిస్ట్ ను సంప్రదించడం ముఖ్యం.

Read More From Health