Beauty

ఓ కామన్ గర్ల్.. నేటితరానికి చెప్పిన అతిగొప్ప సౌందర్య చిట్కా ఇదే..!

Lakshmi Sudha  |  Jan 17, 2019
ఓ కామన్ గర్ల్.. నేటితరానికి చెప్పిన అతిగొప్ప సౌందర్య చిట్కా ఇదే..!

చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి రోజూ మ‌నం బ్యూటీ రొటీన్ ఫాలో అవుతుంటాం. దానికోసం వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను కూడా ఉపయోగిస్తుంటాం. ఫేస్‌వాష్ సైతం అందులో భాగ‌మే. సాధార‌ణంగా ఫేస్‌వాష్ అన‌గానే మార్కెట్లో ల‌భించే ఉత్ప‌త్తుల‌ వైపే చాలామంది చూస్తారు. కానీ స‌హ‌జసిద్ధంగా కూడా దానిని త‌యారు చేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా?? అవునండీ.. దాని వ‌ల్ల సౌంద‌ర్య‌పరంగా చాలా ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మార్కెట్లో ల‌భ్య‌మ‌య్యే ఉత్ప‌త్తుల‌ను ఉప‌యోగించే వారి కంటే సహజసిద్ధ‌మైన చిట్కాలు పాటించే వారి చర్మమే తాజాగా ఉన్నట్టు కనిపిస్తుంది. మా టీం సభ్యురాలైన ఉర్జితా వాణీని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. అందుకే మేం ఆమె సున్నితమైన (Soft), మెరిసే చర్మానికి కారణం ఏంటో తెలుసుకోవడంతో పాటు.. ఆమెతో బ్యూటీ షూట్ చేశాం.

ఆమె బ్యూటీ రొటీన్, మేకప్ రొటీన్ గురించి ఎన్నో ప్రశ్నలడిగాం. వాటికి ఆమె ఇచ్చిన సమాధానాలు విని కాస్త షాకయ్యామనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఇప్పటి వరకూ అసలు ఫేస్ వాష్ ఉపయోగించనేలేదట. దీనికి బదులుగా ఆమె బామ్మ చెప్పిన సౌందర్య చిట్కాను పాటిస్తోందట. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఆ చిట్కానే పాటించే ఆమె స్కిన్ పసిపాప చర్మమంత సున్నితంగా ఉంది.

అందుకే మాకూ ఆ నేచురల్ (Natural) బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనిపించింది. చాలాసేపు బ్రతిమాలిన తర్వాత గానీ మాకు ఆమె సౌందర్య రహస్యం ఏంటో తెలియలేదు. దాన్ని మీతోనూ పంచుకోవాలని మేం భావిస్తున్నాం.

ఫేస్ వాష్‌కి బదులుగా ఉర్జితా వాణి ఉపయోగించిన నేచురల్ బ్యూటీ ప్యాక్‌కి కావాల్సినవి..

ఈ మూడింటినీ ఓ గ్లాస్ బౌల్‌లో వేసి బాగా క‌లిపి మెత్త‌ని మిశ్రమంగా చేయాలి. గాజు బౌల్‌లోనే కలపాలని ఎందుకు చెబుతున్నామంటే.. ప్లాస్టిక్ లేదా చెక్కతో తయారైన గిన్నెల్లో కలిపితే వాటికైన పసుపు మరకలు అంత సులభంగా వదలవు. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాస్త పలుచగా చేసి ఫేస్ ప్యాక్ (Face pack)లానూ వేసుకోవచ్చు. ఈ క్ర‌మంలో ముఖానికి ప్యాక్ వేసుకొన్న పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

ఫేస్ వాష్ (Face wash) ఉపయోగించకపోవడానికి కారణం ఏంటని ఉర్జితాని అడిగినప్పుడు 20 ఏళ్ల నుంచి హోంమేడ్ ఫేస్ వాష్ (Homemade Facewash) ఉపయోగిస్తున్నానని చెప్పింది. ఆమె చిన్నతనంలో సైతం ఆమె తల్లి ఈ మిశ్రమంతోనే తనకు నలుగు పెట్టేవారని చెప్పింది. అందుకేనేమో ఆమె చర్మం అంత సున్నితంగా, ఆకర్షణీయంగా ఉంది.

ఈ నేచురల్ ఫేస్ వాష్ మీ చర్మాన్ని సున్నితంగా మార్చేస్తుంది. ఇందులో ఉన్న పాలు చర్మాన్ని స‌హ‌జ‌సిద్ధంగా మాయిశ్చరైజ్ (Moisturise) చేసి మృదువు (Soft)గా మారిస్తే; శెన‌గ పిండి (Besan Powder) తెరుచుకున్న చ‌ర్మగ్రంధులు (Open Pores) మూసుకునేలా చేయ‌డంతో పాటు, చ‌ర్మంపై ఉండే మ‌చ్చ‌లు (Blemishes) త‌గ్గుముఖం ప‌ట్టేలా కూడా చేస్తుంది. ఒక‌వేళ ఉర్జితకు ఎప్పుడైనా త‌న చ‌ర్మం పొడిబారిన‌ట్లు అనిపిస్తే నివ్యా ఫేస్ క్రీం ఉప‌యోగిస్తుంద‌ట‌!

తన బామ్మ, అమ్మ అందించిన ఈ పాతతరం చిట్కాను వదిలి ఫేస్ వాష్ ఉపయోగించడానికి అసలు ఇష్టపడదు ఉర్జిత. మీకో విషయం తెలుసా.. ఆమె ఎప్పుడో గానీ మేకప్ వేసుకోదు. ఈ ఫేస్ ప్యాక్ ఉప‌యోగించ‌డం వల్ల ఆమె చర్మంపై మొటిమలు కూడా రావు.

మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ (Exfoliate) చేసుకోవాలనుకొంటే ఈ ప్యాక్‌లో శెనగపిండికి బదులుగా సజ్జ పిండి (Millet flour)ని ఉపయోగించమని చెబుతోంది ఉర్జిత.

మీరు కూడా ఈ natural face wash ఉపయోగించి మీ చర్మాన్ని మృదువుగా మార్చేసుకోండి మ‌రి.

ఇవి కూడా చ‌ద‌వండి

పసుపు వాడేద్దాం.. ఈ ప్రయోజనాలు పొందేద్దాం..!

బ్యూటీ రిజల్యూషన్స్: సులభమైన చిట్కాలతో అందం మీ సొంతం..

సౌందర్యాన్ని పరిరక్షించే.. పది రకాల కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్..!

Read More From Beauty