Wedding

ఫ్రెండ్ పెళ్లికి వెళుతున్నారా? బొట్టు ఇలా పెట్టుకోండి..

Lakshmi Sudha  |  Dec 18, 2018
ఫ్రెండ్ పెళ్లికి వెళుతున్నారా? బొట్టు ఇలా పెట్టుకోండి..

ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో పెళ్లి సందడి నెలకొంది. చక్కగా సంప్రదాయబద్ధంగా సిద్దమై బంధువుల ఇంట వివాహ వేడుకకో.. స్నేహితురాలి పెళ్లికో వెళుతూ ఉంటాం. దానికోసం ప్రత్యేకంగా షాపింగ్ కూడా చేస్తుంటాం. చీర, లెహంగా ఇలా ఏ రకమైన దుస్తులు ధరించినా వాటిపైకి నగలు, గాజుల దగ్గర నుంచి చెప్పుల వరకు మ్యాచింగ్ ఉండేలా చూసుకొంటాం. కానీ బొట్టు(bindi) విషయంలో మాత్రం అంత శ్రద్ధ తీసుకోమనే చెప్పుకోవాలి. చేతికి దొరికిన స్టిక్కర్ లేదా తిలకమో నుదుట పెట్టుకొని వెళ్లిపోతుంటాం. మనం ఎంత బాగా రెడీ అయినా ముఖాన బొట్టు సరిగ్గా లేకపోతే.. అది అంత అందంగా కనిపించదు. హుందాగా కూడా ఉండదు. అందుకే ఈ సారి మీరు ఎవరి పెళ్లికైనా(wedding) వెళుతున్నట్లయితే మేం చెప్పినట్లుగా బొట్టు పెట్టుకొని వెళ్లండి. మీ సౌందర్యం ఎలా ప్రతిఫలిస్తుందో మీరే స్వయంగా తెలుసుకోండి.

1. రంగుకి తొలి ప్రాధాన్యం

తిలకం లేదా స్టిక్కర్(బిందీ) పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ముందుగా రంగు ఎంచుకోవాలి. మీరు కట్టుకొన్న చీరకు మ్యాచింగ్  పెట్టుకోవాలనుకొంటున్నారో లేదా పూర్తిగా కాంట్రాస్ట్ రంగుని ఎంచుకోవాలనుకొంటున్నారో ముందు నిర్ణయం తీసుకోండి. ఉదాహరణకి మీరు పింక్ రంగు చీర కట్టుకొంటున్నారనుకోండి… దానికి పర్పుల్ రంగులో పైపింగ్ చేశారనుకొందాం. అప్పుడు పర్పుల్ రంగు బొట్టు పెట్టుకొంటే చాలా బాగుంటుంది. ఇలా కాదనుకొంటే.. మీరు ధరించిన డ్రస్‌లో ఏ రంగు ఎక్కువగా కనిపిస్తుందో ఆ రంగుని ఎంచుకోండి.

బాలీవుడ్ కాంట్రాస్టింగ్ బిందీల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి

2. మెరిసేలా ఉండాలా? వద్దా?

ఈ విషయాన్ని మీరు ధరించే దుస్తులను బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మీరు ధరించే చీరపై ఎంబ్రాయిడరీ, స్టోన్, సీక్వెన్స్ వంటివి ఉంటే.. మీరు కూడా క్రిస్టల్ లేదా స్టోన్ స్టిక్కర్ పెట్టుకోండి. అలా కాకుండా మీ చీరపై ఈ వర్క్ మరీ ఎక్కువగా ఉన్నట్లయితే.. దాన్ని బ్యాలన్స్ చేసేలా మీ బొట్టు ఉండాలి. ఈ సందర్భంలో స్టోన్, క్రిస్టల్ జోలికి వెళ్లకుండా మీరు పెట్టుకొనే బిందీ సాధారణంగా ఉండేలా చూసుకోవాలి.

 

3. ఆకారమూ ముఖ్యమే

ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఆకారాల్లో బొట్లు లభిస్తున్నాయి. గుండ్రంగా, నలుచదరంగా, అర్థచంద్రాకారంగా, దోసగింజ మాదిరిగా ఇలా విభిన్న ఆకారాల్లో స్టిక్కర్లు లభ్యమవుతున్నాయి. మరి వీటిలో మనకు నప్పే బొట్టుని ఎలా ఎంచుకోవాలి? మరేం లేదండి.. మీ ముఖాకృతికి తగిన విధంగా బొట్టు ఉంటే సరిపోతుంది. మీది కోల ముఖం అయితే.. గుండ్రటి బొట్టు పెట్టుకోండి. అదే మీ ముఖం గుండ్రంగా ఉంటే.. పొడవుగా ఉండే బొట్టు పెట్టుకోండి. ఇలా కాకుండా మీకు కచ్చితంగా నప్పే బొట్టు ఎంపిక చేసుకోవాలనుకొంటే.. వివిధ ఆకారాల్లో ఉన్నవాటన్నింటినీ ప్రయత్నించి చూడండి.

ప్రియాంక చోప్రా బ్రైడల్ బిందీ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

4. రెండు కంటే ఎక్కువ..

కొన్నిసార్లు మీ అందం మరింత ఇనుమడించాలంటే.. వేర్వేరు రంగులున్న స్టిక్కర్లు రెండు కంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. మరీ ముఖ్యంగా మిక్స్ అండ్ మ్యాచ్ పద్ధతిలో మీ వస్త్రధారణ ఉంటే ఆ రంగులకు చెందిన స్టిక్కర్లు పెట్టుకొంటే బాగుంటుంది. చిన్న చిన్నస్టిక్కర్లను ఒకదానిపై ఒకటి ఉంచడం ద్వారా మీ లుక్ మరింత బాగా కనిపిస్తుంది.

కొత్త పెళ్లికూతుళ్ల కోసం ఈ బొట్టు డిజైన్లు ప్రత్యేకం

5. రంగులతో తీర్చిదిద్దండి..

మన చిన్నప్పుడు అమ్మ రంగుల తిలకాలతో చక్కగా బొట్టు పెట్టేది. మీకు గుర్తుందా? ఇప్పుడు కూడా అదే చేయండి. మీరు వేసుకొన్న అవుట్ ఫిట్‌కి నప్పే రంగులతో బొట్టును తీర్చిదిద్దండి. ఈ విషయంలో మీలోని ఆర్టిస్ట్ ను బయటకు తీయండి. అందరి చూపు మీమీదే ఉంటుంది.

 

POPxo Recomends:

Instabuyz Multi Color Bindi(₹163)

Vega Bindi Brush(₹ 80)

Nidhi Forehead Multicolor Bindis(₹199)

Read More From Wedding