Lifestyle

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ – మెగా బిజినెస్ ఉమన్ ఉపాసనల.. ప్రేమ బంధం గురించి తెలుసుకుందామా?

Sandeep Thatla  |  Sep 18, 2019
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ – మెగా బిజినెస్ ఉమన్ ఉపాసనల.. ప్రేమ బంధం గురించి తెలుసుకుందామా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇటీవలే ఓ సందర్భంలో మాట్లాడుతూ  ‘తన 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో తాను సంపాదించుకున్న విలువైన బిడ్డ – ‘రామ్ చరణ్’ (Ram Charan) అని తెలిపారు. నిజమే.. తండ్రికి తగ్గ తనయుడిగా, ఒక మంచి నటుడిగా.. అన్నిటికంటే మరీ ముఖ్యంగా.. తన తండ్రి స్టార్ స్టేటస్‌ని ఎప్పుడు కూడా తలకి ఎక్కించుకోని ఒక మంచి మనిషిగా… సినీ పరిశ్రమలో పేరు సంపాదించుకున్నాడు రామ్ చరణ్.

కృష్ణవంశీ – రమ్యకృష్ణల ప్రేమ చిగురించడానికి.. కారణమైన పాటేమిటో మీకు తెలుసా?

మరి అంతటి మెగా పవర్ స్టార్‌కి కాబోయే భార్య పై.. అటు మెగా కుటుంబంలోనే కాకుండా.. ఇటు మెగా అభిమానుల్లో సైతం ఎన్నో అంచనాలు ఉండేవి. ఆ సమయంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రేమ వివాహం జరిగింది.

ఆ సందర్భంగా  ఫ్యాన్స్ కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో..  “రామ్ చరణ్ పెళ్లి ఎప్పుడు?” అంటూ అభిమానులు అరవడం ప్రారంభించారు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు తన స్పందనను తెలియజేస్తూ – ‘ఆ అవకాశం వాళ్ళు మనకి ఇస్తారా?..’ అంటూ షాకింగ్ కామెంట్ ఒకటి విసిరారు.

వెంటనే మైక్ అందుకున్న రామ్ చరణ్ – ‘నాన్నగారి మాట ఎప్పటికీ దాటను’ అనే వివరణను ఇచ్చినప్పటికీ కూడా.. ఆ షాకింగ్ కామెంట్‌కి చాలా ప్రాధాన్యం ఏర్పడింది.

ఈ క్రమంలో రామ్ చరణ్ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడని.. నిశ్చితార్ధం కూడా రహస్యంగా జరిగిపోయిందని..ఇలా అనేక వార్తలు వచ్చాయి. అలాగే రామ్ చరణ్ ఓ హీరోయిన్ ప్రేమలో పడ్డాడని కూడా వార్తలు వచ్చాయి. అలా కొందరి హీరోయిన్స్ పేర్లు కూడా అప్పట్లో చక్కర్లు కొట్టాయి.

మీడియాలో ఇదే అంశం పై ఆ రోజుల్లో న్యూస్ బులిటెన్స్, చర్చలు కూడా నడిచాయంటే.. రామ్ చరణ్ పెళ్లి ఏ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుందో మీరే అర్ధం చేసుకోవచ్చు. ఇక వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ, అపోలో హాస్పిటల్స్ ఎండీ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన కామినేని … రామ్ చరణ్‌కి కాబోయే భార్య అంటూ.. ఇరు కుటుంబాల నుండి అధికారిక ప్రకటన ఒకటి వెలువడింది.

ఇక ఈ ప్రకటన వచ్చిన తరువాత.. కొన్ని ఆసక్తికరమైన వార్తలు టీవీ ఛానల్స్‌లో హల్చల్ చేశాయి.  ఉపాసన తండ్రి అనిల్ కామినేని.. తెలంగాణ ప్రాంతంలోని దోమకొండ రాజా వంశస్థుడు కావడంతో.. రామ్ చరణ్ ఒక రాకుమారిని పెళ్లాడనున్నారని కొన్ని పత్రికలు వార్తలు రాసాయి.

ఉపాసన కుటుంబ సభ్యులు కూడా.. ఇదే క్రమంలో ఎప్పటినుండో శిథిలావస్థలో ఉన్న దోమకొండ గడీని శుభ్రం చేయించడం.. అలాగే అక్కడ పెళ్లి చేయడానికి వీలుగా ఏర్పాట్లు మొదలుపెట్టడం చేశారట. అయితే అతిథులు గడీకి రావడానికి అనేక ఇబ్బందులున్న కారణంగా.. వధు, వరుల నిశ్చితార్ధం, వివాహ వేడుకలని హైదరాబాద్‌కి షిఫ్ట్ చేశారు. అయినప్పటికి కూడా దోమకొండ గడీలోనే.. వీరిద్దరి చేత శివ పూజ చేయించడం.. అలాగే పెళ్ళికి సంబంధించి తొలి క్రతువుని జరిపించడం విశేషం. 

‘అల్లు అర్జున్ – స్నేహ రెడ్డిల’ ప్రేమకథ.. సినిమా కథని మరిపించేలా ఉంటుంది తెలుసా…!

ఆ తరువాత వీరి నిశ్చితార్ధం 1 డిసెంబర్ 2012 తేదిన జరిగితే..  పెళ్లి మాత్రం 14 జూన్ 2012 తేదిన జరిగింది. అలా వీరిద్దరి  వివాహ వేడుకలు అప్పట్లో టాక్ అఫ్ ది టౌన్‌గా నిలిచాయి. అయితే వీరి వివాహానికి ముందు చాలా విషయాలు జరిగాయట.

తొలుత వీరిద్దరి ప్రేమని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడానికి కాస్త సంశయించారట. ఎందుకంటే ఈ రెండు కుటుంబాల మధ్య సారూపత్య కలిగిన అంశాలు చాలా తక్కువ. అలాగే పరిచయాలు కూడా అంతంతమాత్రమే అని టాక్. దీనితో ఈ ఇరు కుటుంబాల మధ్య ఉపాసన పిన్ని.. అలాగే అపోలో హాస్పిటల్స్ ఎండీలలో ఒకరైన సంగీత రెడ్డి మధ్యవర్తిత్వం చేశారట. ఆ విధంగా ఆమె వారి ప్రేమకథ (Love Story) ముందుకు సాగేందుకు తోడ్పాడ్డారట.

ఇరు కుటుంబాలు ఈ పెళ్ళికి ఒప్పుకునేలా చేసిన క్రెడిట్ ఆమెకే దక్కుతుంది అంటుంటారు. ఒక ఇంటర్వ్యూలో సైతం ఉపాసన తన పిన్ని సంగీత రెడ్డి లేకపోతే.. తమ వివాహం జరగకపోయేది అని చెప్పడం విశేషం. అలా ఈ మెగా వివాహానికి అనుసంధాన కర్తగా సంగీత రెడ్డి ఉన్నారని చెప్పవచ్చు.

ఇక వీరి పెళ్లి సమయంలో ఉపాసన (Upasana) గురించి.. ఆమె శరీరాకృతి గురించి ఎన్నో కామెంట్స్ వినిపించాయి. అలాగే వీరి మధ్య ఈ పెళ్లి ఒక ఆర్ధిక ఒప్పందమే అంటూ.. కొందరు చాలా దిగువస్థాయి కామెంట్స్ చేశారు. అయినప్పటికి ఇటువంటి కామెంట్స్ ఈ ఇరువురి మధ్యే కాకుండా.. రెండు కుటుంబాల మధ్య కూడా ఎటువంటి పొరపచ్చాలకి తావివ్వలేదు.

హీరో ‘శ్రీకాంత్’ తన రియల్ లైఫ్ హీరోయిన్ ‘ఊహ’కి చేసిన.. ప్రపోజల్ గురించి మీకు తెలుసా?

పెళ్లి తరువాత రామ్ చరణ్ తన చిత్రాలతో బిజీ అయిపోతే.. ఉపాసన అపోలో హాస్పిటల్స్‌లో ఒక విభాగానికి అధిపతిగా కొనసాగుతూనే.. ప్రజల్లో ఫిట్‌నెస్ మీద అవగాహన కల్పించేందుకు ‘బీ పాజిటివ్’ అనే ఒక మ్యాగజైన్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ మ్యాగజైన్ ద్వారా సెలబ్రిటీస్ ఫిట్‌నెస్ రహస్యాలను బహిర్గతం చేసే ఇంటర్వ్యూ‌లు కూడా చేస్తున్నారు.

ఏదేమైనా.. రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగిన క్రమంలో వచ్చిన విమర్శలు.. వీరి అన్యోన్య దాంపత్యం ముందు నిలవలేకపోయాయనేే చెప్పవచ్చు. 

Read More From Lifestyle