Celebrity Life

విజయ్ దేవరకొండ కెరీర్ గురించి.. కాజల్ అగర్వాల్ ఏమందంటే..?

Babu Koilada  |  Sep 20, 2019
విజయ్ దేవరకొండ కెరీర్ గురించి.. కాజల్ అగర్వాల్ ఏమందంటే..?

(Kajal Aggarwal Twitter comments on Vijay Devarakonda)

“లక్ష్మీ కళ్యాణం” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత మగధీర, టెంపర్, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, బిజినెస్‌మ్యాన్,  ఖైదీ నెంబర్ 150 మొదలైన సినిమాలలో నటించిన కాజల్.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంతో పాటు.. అప్పుడప్పుడు హిందీలో కూడా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ఇటీవలే బెల్లంకొండ శ్రీనివాస్ సరసన “సీత” చిత్రంలో నటించింది. అలాగే హిందీ చిత్రం “క్వీన్”కి తమిళ రీమేక్ రూపంలో వస్తున్న “పారిస్ పారిస్”లో కూడా నటిస్తోంది. 

ఇటీవలే కాజల్ అగర్వాల్ ట్విటర్ వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తన ఇష్టాలేమిటో, అయిష్టాలేమిటో కూడా తెలిపింది. అలాగే సాంఘిక సమస్యల గురించి.. ఇతర నటుల పై తన అభిప్రాయాలను గురించి కూడా తెలిపింది. ముఖ్యంగా తమిళ హీరో సూర్యను “ఐరన్ మ్యాన్”గా పేర్కొంది. అలాగే తను నటి కాకపోయుంటే..  ఓ పెద్ద కార్పొరేట్ చెయిన్ నడిపేదానని కూడా తెలిపింది. 

తొలి ప్రేమ, బ్రేకప్.. ఇంకెన్నో సంగతులు పంచుకున్న కాజల్, కియారా..!

అలాగే “అర్జున్ రెడ్డి” హీరో విజయ్ దేవరకొండ పై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది కాజల్. అతని సినిమాలు తనకు నచ్చుతాయని.. విజయ్‌కి మంచి భవిష్యత్తు ఉందని కూడా కితాబిచ్చింది. అలాగే “భారతీయుడు 2” చిత్రంలో కమల్ హాసన్, శంకర్‌లతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని.. నటన పరంగా చాలా విషయాలను నేర్చుకొనే అవకాశం దక్కిందని ఈ సందర్బంగా  కాజల్ తెలిపింది. 

లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటోన్న.. అందాల చందమామ కాజల్ అగర్వాల్..!

ముంబయిలో స్థిరపడిన పంజాబీ కుటుంబానికి చెందిన కాజల్ 2004లో “క్యో.. హోగయా నా” అనే బాలీవుడ్ చిత్రంతో తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది. ఆమె తండ్రి వినయ్ అగర్వాల్ ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త. కాజల్ సోదరి నిషా అగర్వాల్ కూడా పలు తెలుగు సినిమాలలో నటించింది. ఏమైంది ఈ వేళ, సోలో, సుకుమారుడు మొదలైన చిత్రాలలో నిషా కథానాయికగా నటించింది. తర్వాత ఆమె పూర్తిగా నటనా రంగానికి స్వస్తి చెప్పి.. వివాహం చేసుకుంది. 

‘సీత’ అభిమానులను ఆకట్టుకోగలిగిందా? (సినిమా ప్లస్ & మైనస్ పాయింట్స్)

తమిళ చిత్రం “తుపాకీ”లో విజయ్ సరసన కూడా నటించింది కాజల్. ఆ సినిమా ఆమెకు కోలీవుడ్‌లో మంచి పేరు తీసుకొచ్చింది. ఆ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటిగా సైమా క్రిటిక్స్ అవార్డు కూడా అందుకుంది. అలాగే రానా దగ్గుబాటి సరసన కాజల్ నటించిన “నేనే రాజు నేనే మంత్రి” చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలోని కాజల్ నటన.. విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. అలాగే అజిత్ సరసన తమిళంలో కాజల్ నటించిన “వివేగం” చిత్రం కూడా తనకు మంచి పేరు తీసుకొచ్చింది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.                                                                                             

 

Read More From Celebrity Life