తొలి ప్రేమ, బ్రేకప్.. ఇంకెన్నో సంగతులు పంచుకున్న కాజల్, కియారా..!

తొలి ప్రేమ, బ్రేకప్.. ఇంకెన్నో సంగతులు పంచుకున్న కాజల్, కియారా..!

సాధారణంగా సెలబ్రిటీల పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానులకు చాలా ఎక్కువగా  ఉంటుంది. అందులోనూ వారి ప్రేమ, పెళ్లికి సంబంధించినవైతే మరింత ఆసక్తి కనబరుస్తారు. అయితే.. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు తారలు సాధారణంగా స్పందించడానికి అస్సలు ఇష్టపడరు. కానీ క్రష్, లవ్, బ్రేకప్, అట్రాక్షన్ ఇవన్నీ మనకేనా? సెలబ్రిటీలకు ఉండవా? అంటే మనలాగే వాళ్లకి కూడా ఉంటాయి. కాకపోతే ఈ మధ్యకాలంలో ఇలాంటి వాటి వల్లే కలిగే మనోవేదనలు, మానసిక సంఘర్షణల నుండి సెలబ్రిటీలు వేగంగానే బయటపడుతున్నారు. మళ్లీ తమ కెరీర్ పై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

మీకో విషయం తెలుసా? టాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ కాజల్ అగర్వాల్  (Kajal Agarwal), కియారా అద్వాని (Kiara Advani) సైతం ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత తాము ప్రేమించిన వ్యక్తులతో బ్రేకప్ కూడా చేసుకున్నారట. ఈ విషయాన్ని వేరెవరో చెప్పడం కాదు. వారే స్వయంగా చెప్పారు. వారు పంచుకున్న తొలి ప్రేమ విషయాలను మనమూ తెలుసుకుందామా..

భరత్ అను నేను, వినయ విధేయ రామ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కియారా అద్వానీ పదో తరగతిలో ఉన్నప్పుడే ప్రేమలో పడిందట. అయితే విషయం తెలుసుకొన్న కియారా తల్లి ఈ విషయంలో ఆమెను మందలించారట. ప్రేమలో పడటానికి ఇంకా తనది చిన్న వయసు అని ఆమె చెప్పారట. అంతేకాదు.. ముందు చదువుపై శ్రద్ధ పెట్టమని.. ఆ తర్వాతే ప్రేమని హితబోధ చేశారట. ప్రస్తుతం కియారా హిందీ వర్షన్ అర్జున్ రెడ్డి అయిన ‘కబీర్ సింగ్’లో నటిస్తోంది. అలాగే ‘ఇందూ కీ జవానీ’ అనే మరో ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రంలోనూ ముఖ్య కథానాయికగా నటిస్తోంది.

ఇది కూడా చదవండి: ఇలాంటి సినిమా తీయడానికి సిగ్గు లేదా? కియారా సినిమాపై కంగనా సోదరి కామెంట్

View this post on Instagram

🖤

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

దశాబ్దానికి పైగా హీరోయిన్‌గా రాణించడమంటే మాటలు కాదు. దానికి ఎంతో ప్రతిభ ఉండాలి. అంత ప్రతిభ ఉంది కాబట్టే .. కాజల్ ఇప్పటికీ హీరోయిన్‌గా రాణిస్తోంది. మీకో విషయం తెలుసా.. కాజల్‌కి కూడా ఫస్ట్ లవ్ ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల తాను అతనికి బ్రేకప్ చెప్పింది. తాను సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలి నాళ్లలో ఓ అబ్బాయితో ఆమె ప్రేమలో పడిందట.

అయితే అతడు పెడుతున్న నియమ నిబంధనల కారణంగా.. అతని ప్రేమను వదులుకుందట కాజల్. ముఖ్యంగా అతనికి సినిమా ఇండస్ట్రీ మీద మంచి అభిప్రాయం లేదట. అంతే కాదు.. ఈ రంగం నుంచి  తప్పుకోమని  ఒత్తిడి చేసేవాడట. తాను కూడా కథానాయికగా బిజీ కావడం.. అతనితో సమయం గడపడానికి వీలు చిక్కకపోవడం వల్ల కూడా అతనికి దూరమైందని చెప్పుకొచ్చింది కాజల్.

ఇది కూడా చదవండి: నీకెంత మంది ప్రపోజ్ చేశారు? అభిమాని ప్రశ్నకు రకుల్ ఎలాంటి జవాబిచ్చిందంటే..?

వీరిద్దరూ మాత్రమే కాదు.. సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ప్రేమలో పడటం.. వివిధ కారణాల వల్ల బంధంలో కలతలు రేగితే బ్రేకప్ చెప్పడం మనకు తెలిసిందే. నయనతార, హన్సిక, దీపిక పదుకొణె, సమంత, అమలాపాల్, శ్రుతి హాసన్ లాంటి హీరోయిన్లు తమను ఇబ్బంది పెట్టే రిలేషన్ షిప్స్ నుంచి బయటకు వచ్చిన వారే. అయినప్పటికీ ఆ బాధను అధిగమించి తిరిగి కెరీర్‌లో నిలదొక్కుకున్నవారే. వారంతా ప్రస్తుతం విజయవంతమైన హీరోయిన్లుగా రాణిస్తున్నారు. హీరోయిన్ అనగానే వారి గ్లామర్‌నే చూస్తారు.. కానీ వారి స్థైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రజలు గుర్తించరు.

బ్రేకప్‌తోనే జీవితం అయిపోయిందనుకుంటే వారు ఇంత మంచి పేరు తెచ్చుకొని ఉండే వారే కాదు. అందుకే కెరీర్, ఫ్యాషన్, స్టైల్ విషయంలోనే కాదు.. మానసిక స్థైర్యం విషయంలోనూ వారిని ఆదర్శంగా తీసుకొంటే మనం కూడా వారిలానే విజయపథంలో నడవగలుగుతాం. కేవలం సినిమా రంగంలో రాణించాలనుకొనేవారికే కాదు.. ఇతర రంగాల్లో రాణించేవారికి సైతం వీరి జీవితాలు ఆదర్శంగా నిలబడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Feature Image: Instagram

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.