Celebrity Life

పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సమంత నా ఫేవరెట్ నటి : రాశి ఖన్నా

Babu Koilada  |  Dec 12, 2019
పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సమంత నా ఫేవరెట్ నటి : రాశి ఖన్నా

Raashi Khanna’s interesting comments on Tollywood actors

ఇప్పటికే తొలి ప్రేమ, ఊహలు గుసగుసలాడే, టచ్ చేసి చూడు, శ్రీనివాస కళ్యాణం లాంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన రాశి ఖన్నా.. తాజాగా ‘వెంకీ మామ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న ఆమె ట్విటర్ వేదికగా సినీ అభిమానులతో ముచ్చటించింది.  ముఖ్యంగా టాలీవుడ్ హీరోల గురించి ఆమె అభిమానులకు ఇచ్చిన ట్విటర్ ఇంటర్వ్యూ ఆసక్తికరంగా సాగింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ప్రిన్స్ మహేష్ బాబుతో  కలిసి నటించే అవకాశం తనకు వస్తే.. తప్పకుండా ఆ సినిమాకి సైన్ చేస్తానని.. ఆయన ఒక సూపర్ స్టార్ అని రాశి నెటిజన్లకు తెలిపింది. 

రంజాన్ ఫ్యాషన్‌కు.. కాస్త సెలబ్రిటీ టచ్ ఇద్దాం..!

అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఆయనో ‘అసాధారణమైన వ్యక్తి’ అని తను అభిప్రాయపడింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ‘ఎంత చెప్పినా తక్కువే అని.. ఆయన గురించి చెప్పాలంటే మాటలు చాలవని’ తెలిపింది రాశి ఖన్నా. అలాగే రామ్ చరణ్‌తో కూడా తనకు నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇక ఎదుటివారిని నవ్వించాలంటే.. తమిళ హీరో అజిత్ తర్వాతే ఎవరైనా అని చెబుతోంది ఈ బ్యూటీ. ఇక డార్లింగ్ ప్రభాస్ ‘సాహో’ తర్వాత ఏ చిత్రాన్ని సైన్ చేస్తారో తెలుసుకోవాలని.. అతని అభిమానులతో పాటు తనకూ ఉబలాటంగా ఉందని చెప్పింది రాశిఖన్నా.

రాశి ఖన్నా.. ఆమెకు ‘సారీ’ ఎందుకు చెప్పిందంటే..?

అలాగే విజయ్ దేవరకొండ మీద కూడా ప్రశంసల వర్షం కురిపించింది రాశి. అతను మంచి ‘టాలెంటెడ్’ నటుడని.. చాలామంది నటులకు ఆయన స్ఫూర్తని తెలపింది. ఇక వెంకటేష్ ‘ఒక పుస్తకం లాంటి వ్యక్తని’.. ఆయన నుండి ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉండవచ్చని.. ‘వెంకీ మామ’ షూటింగ్ మొత్తం ఆయనతో ఒక మంచి ప్రయాణంలా సాగిపోయిందని అభిప్రాయపడింది రాశి ఖన్నా. ఇక నాగ చైతన్య విషయానికి  వస్తే.. తాను చాలా స్వీట్ పర్సన్ అని.. అలాగే చాలా ప్రొఫెషనల్ అని తెలిపింది.

 

 

అలాగే నటుడు నాని గురించి మాట్లాడుతూ ‘తనతో మూవీ కోసం వెయిట్ చేస్తున్నానని’ తెలిపిందామె. ఇక టాలీవుడ్ కథానాయికలలో సమంత తన ఫేవరెట్ హీరోయిన్ అని కూడా తెలిపింది రాశి. అలాగే వరుణ్ తేజ్‌తో కలిసి తను నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం అంటే తనకు ఎంతో ఇష్టమని.. థియేటర్‌లో ఆ సినిమాని అయిదు సార్లు చూశానని తెలిపింది రాశి ఖన్నా. ప్రస్తుతం రాశి ఖన్నా వెంకీమామ, ప్రతి రోజూ పండగే అనే రెండు చిత్రాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళంలో ‘సైతాన్ కా బచ్చా’ అనే చిత్రంలో కూడా నటిస్తుందామె.

2018 తెలుగు చిత్రాల్లో.. టాప్ 9 హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

అలాగే విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రానికి కూడా సైన్ చేసింది రాశి ఖన్నా. ఈ చిత్రాన్ని ‘మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు’.. ‘ఉంగరాల రాంబాబు’ చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘మద్రాస్ కేఫ్’ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమైన రాశి ఖన్నా.. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రానికి గాను ‘ఉత్తమ నూతన నటి’గా సైమా అవార్డును సైతం దక్కించుకుంది. అలాగే ‘తొలి ప్రేమ’ చిత్రంలో నటనకు గాను జీ సినీ అవార్డును కూడా కైవసం చేసుకుంది రాశి ఖన్నా. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.   

Read More From Celebrity Life