రాశి ఖన్నా.. ఆమెకు 'సారీ' ఎందుకు చెప్పిందంటే..?

రాశి ఖన్నా.. ఆమెకు 'సారీ' ఎందుకు చెప్పిందంటే..?

టాలీవుడ్ కథానాయిక రాశి ఖన్నా (Raashi Khanna) వాయిస్ ఆర్టిస్ట్ రవీనాకి సారీ చెప్పారు. ఆమె తనకు అందమైన వాయిస్ ఇచ్చారని.. అయినా తనను క్షమాపణ కోరుతున్నానని.. ఈ సందర్భంగా తెలిపారు.  ఇంతకీ అసలు విషయానికి వస్తే.. రాశీ ఇటీవలే తమిళ చిత్రం "అయోగ్య"లో నటించారు. తెలుగు ‘టెంపర్' చిత్రానికి ఈ సినిమా రీమేక్.


విశాల్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి.. బి.మధు నిర్మాతగా వ్యవహరించగా.. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్సే వచ్చింది.


కాకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యాక.. రాశికి డబ్బింగ్ చెప్పిన వాయిస్ ఆర్టిస్ట్ రవీనా తన బాధను వెళ్లగక్కుతూ ట్వీట్ చేశారు. "సినిమా విడుదల అయ్యాక.. డ్రైవర్లకు, పెయింటర్లకు, మెస్ వారికి కూడా ఎండ్ క్రెడిట్స్‌లో పేర్లు వేశారు. కానీ వాయిస్ ఆర్టిస్టుల పేర్లను ఎక్కడా వేయలేదు. ఇది మేం బాధపడే అంశం" అని తెలిపారు.


ఈ ట్వీట్ చదివిన రాశిఖన్నా తనదైన శైలిలో స్పందించారు. "మా పాత్రలను ఎలివేట్ చేయడానికి.. అందమైన గొంతును ఇచ్చిన మీకు నా కృతజ్ఞతలు. మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం" అని తెలిపారు.
రాశి స్పందించాక.. అనేకమంది సినీ అభిమానుల నుండి ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తాయి. చాలా హుందాగా.. ప్రేమతో ఆమె సమాధానమిచ్చారని నెటిజన్లు ట్వీట్స్ చేశారు. ఆమెది చాలా మంచి మనసని కొందరు తెలిపారు.


రాశికి వాయిస్ ఇచ్చిన రవీనా ఎస్సార్, ప్రముఖ వాయిస్ ఆర్టిస్టులు శ్రీజ రవి, రవీంద్రనాథన్‌ల కుమార్తె. చిన్నప్పటి నుండే ఆమె ఈ రంగంలో తన ప్రతిభను నిరూపించుకుంటూ.. మంచి వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా రాణించారు.


అమలా పాల్, అమీ జాక్సన్, ఆదితి రవి, హ్యుమా ఖురేషీ, మెహ్రీన్, నందితా రాజ్, నయనతార, ప్రియా ఆనంద్, మోనల్ గుజ్జార్, కాజల్ అగర్వాల్, మడోన్నా సెబాస్టియన్, నిక్కీ గల్రానీ, రెజీనా, శ్రీ దివ్య, రాశి ఖన్నా మొదలైనవారికి రవీనా వాయిస్ ఇచ్చారు.


తెలుగులో కూడా నవాబ్ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్‌కు.. ఉత్తమ విలన్ చిత్రంలో పార్వతికి రవీనా వాయిస్ అందించారు. వాయిస్ ఆర్టిస్టుగానే కాకుండా.. మంచి నటిగా కూడా రవీనా సుపరిచితులు ఓరు కిడయిన్ కరునై మను అనే తమిళ చిత్రంతో నటిగా తన కెరీర్ ప్రారంభించిన రవీనా.. ఆ తర్వాత నిత్య హరిత నాయకన్ అనే మలయాళ చిత్రంలో నటించారు. ప్రస్తుతం రాకీ, కల్వ తురయ ఉంగల్ నంబన్ అనే రెండు తమిళ చిత్రాలలో నటిస్తున్నారు.


కాగా.. ప్రస్తుతం తన ట్వీట్ ద్వారా మళ్లీ వార్తల్లో నిలిచారు రవీనా. రవీనా ట్వీట్‌కి బదులిస్తూ.. ఆమెను ట్యాగ్ చేస్తూ.. రాశిఖన్నా జవాబు ఇవ్వడంలో ఇప్పుడు వీరిద్దరూ వార్తల్లో నిలిచారు. రాశిఖన్నా ప్రస్తుతం తెలుగులో "వెంకీమామ" చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  అలాగే సంఘ తమిళన్, కడైసి వివసాయి అనే రెండు తమిళ చిత్రాలలో కూడా నటిస్తున్నారామె.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ


కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !


ఇవి కూడా చదవండి


నాగచైతన్య, వెంకటేష్ చేస్తున్న.. మూవీ మ్యాజిక్ "వెంకీ మామ" విశేషాలివే..!


2018 తెలుగు చిత్రాల్లో.. టాప్ 9 హీరోయిన్స్ ఎవరో తెలుసా..?


2018లో టాలీవుడ్ టాప్ 20.. సూపర్ హిట్ సాంగ్స్ ఇవే