Celebrity Life

టాలీవుడ్ సంగీత దర్శకులు మణిశర్మ బర్త్‌డే స్పెషల్: టాప్ 10 హిట్ సాంగ్స్..!

Babu Koilada  |  Jul 10, 2019
టాలీవుడ్ సంగీత దర్శకులు మణిశర్మ బర్త్‌డే స్పెషల్: టాప్ 10 హిట్ సాంగ్స్..!

ఈ రోజు ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకులు మణిశర్మ (Mani Sharma) పుట్టినరోజు.. ఆయన చిత్రాలలోని బాగా ప్రేక్షకాదరణ పొందిన టాప్ టెన్ హిట్ పాటలు మీకోసం ప్రత్యేకం. 

చిత్రం : ప్రేమించుకుందాం.. రా

పెళ్లికళ వచ్చేసిందే బాలా
పల్లకిని తెచ్చేసిందే బాలా
హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా
ముచ్చటగ మేళం ఉంది ఆజా ఆజా
తద్దినక తాళం ఉంది ఆజా ఆజా
మంటపం రమ్మంటుంది ఆజా ఆజా
జంటపడు వేళయ్యింది ఆజా ఆజా

చరణం:1
అక్షితలు వేసేసింది షాదీ
అడ్డు తెర తీసేసింది షాదీ
స్వయంవరమే శభాషంది హలో డార్లింగ్
ఇష్టపడు కన్యాదానం లేజా లేజా
జానేమన్ ఏ దుల్హన్ కో లేజా లేజా
మై డియర్ హబ్బీ ముజ్కో లేజా లేజా
ఆశపడు అందం చందం లేజా లేజా

చరణం:2
ఆలుమగలైపోయామే భామా
అసలు కధ భాకీ ఉంది రామ్మా
అమాంతంగా ప్రొసీడ్ అవుదాం చలో జానా
మల్లెలతో మంచం సిద్దం దేఖో దేఖో
అల్లరితో మంత్రం వేద్దాం దేఖో దేఖో
మన్మధుని ఆహ్వానిద్దాం దేఖో దేఖో
ముద్దులతో సన్మానిద్దాం దేఖో దేఖో

ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ టాక్ – పూరి జగన్నాధ్ మార్క్ హీరోగా రామ్

చిత్రం : చూడాలని ఉంది

సరిమామగారి సససనిదపసా
రిమదానిదాప సాసనిదప మదపమరి

యమహానగరి కలకత్తా పురి యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి యమహానగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
మది యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి ..

నేతాజీ పుట్టినచోట, గీతాంజలి పూసిన చోట,
పాడనా తెలుగులో.. ఆ హంస పాడిన పాటే,
ఆనందుడు చూపిన బాట సాగనా ..
పదుగురు పరుగు తీసింది
పట్నం బ్రతుకుతో వెయ్యి
పందెం కడకు చేరాలి గమ్యం
కదలిపోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల
బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో..

యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి

బెంగాలీ కోకిల బాల, తెలుగింటి కోడలుపిల్ల మానిని సరోజిని
రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజినీగంధ సాగనీ
పదుగురు ప్రేమలే లేని లోకం, దేవతా మార్కు మైకం,
శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కథలకు నెలవట
కళలకు కొలువట
తిథులకు సెలవట
అతిథుల గొడవట
కలకట నగరపు కిటకటలో ..

యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
మది యమహానగరి కలకత్తా పురి

వందేమాతరమే అన్న వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయ చోరంగి రంగుల దునియా నీదిరా
వినుగురు సత్యజిత్రే సితార యస్ డి బర్మన్ కీ ధారా థెరీసా కీ కుమారా
కదలిరారా జనణమనముల స్వరపద వనముల హృదయపు లయలను
శ్రుతి పరిచిన ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో

యమహానగరి కలకత్తా పూరి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
మది యమహానగరి కలకత్తా పూరి

 

చిత్రం : అన్నయ్య

ఆటకావాలా పాటకావాలా స్వచ్చమైన అచ్చతెలుగు బీటు కావాలా
ఆటకావాలి పాటకావాలి గాజువాక సెంటర్లో ఫ్లాటు కావాలి
ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ
మానేదెట్టా గురువా అదినా హాబీ
ఊపే ఊల్లే
చేసేయ్ డ్రిల్లే
భూగోళం అదిరేలా కదం తొక్కాలి
స్వీటుకావాలా హాటుకావాలా నాణ్యమైన నాటుచికెన్‌ లెగ్స్ కావాలా
స్వీటు కావాలి హాటు కావాలి రాసిస్తే వైజాగ్ స్టీలు ఫ్లాంటు కావాలి

చరణం 1

ఝులుకు ఝులుకు కులుకులతో మెరిసే ఓ పోరీ
నీ తళుకు తళుకు అందాలతో మత్తెక్కించేపోరీ
చూపులతో నా మనసును గుచ్చేసావే నారీ
ఇటు చూస్తే మనసాగునంటే ఆయాం వెరీ సారీ
చల్లకొచ్చి ముంత దాస్తే లాభం లేదే
పిల్లగాలి గిల్లుతుందీ దిల్‌తే తేదే
మండపేట కుర్రదాన్ని ఓ బాబయ్య
మనీ పర్సు చూస్తే తస్సదియ్యా మహా ఇదయ్యా
ఓగే రాణీ చేస్తా బోణీ ఆపైన చెప్పొద్దే మరో కహానీ
చిప్స్ కావాలా లిప్స్ కావాలా గరం గరం సింగపూరు పప్సు కావాలా
చిప్స్ కావాలీ లిప్స్ కావాలీ అప్పనంగా ఇస్తే షిప్సు యార్డ్ కావాలీ

చరణం 2

కింగులాంటి నిన్ను చూస్తే మనసౌతాంది
నీ ఫ్రెస్సుతోటే కావాలంటే సిగ్గేస్తుందీ
పట్టుచీర కొనిపెడితే ముంబాయి బుల్లి
గట్టిపట్టు పట్టనిస్తావా జూకామాలే
అయితే రడీ పట్టేయ్యి గిలీ కమ్మంగా ఆడేద్దాం కిస్సు కబాడీ
దిండు కావాలా దుప్పటి కావాలా లైటు లండన్‌ ఫోం బెడ్డుకావాలా
దిండు కావాలీ దుప్పటి కావాలీ రెచ్చిపోతే మినపసున్ని ఉండ కావాలీ
ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ
మీనేదెట్టా గురువా అదినా హాబీ
ఊపే ఊళ్ళే
చేసేయ్ దిళ్ళే
భూగోళం అదిరేలా కదం తొక్కాలే
స్వీటు కావాలా హాటు కావాలా నాణ్యమైన నాటు చికెన్‌ లెగ్స్ కావాలా
స్వీటు కావాలి హాటు కావాలి మస్తుమస్తు మెగాస్టార్ ముద్దు కావాలి

పూరీ దర్శకత్వంలో వస్తున్న.. మరో మాస్ మసాలా చిత్రం “ఇస్మార్ట్ శంకర్”
 

చిత్రం: మురారి

రచన : సిరివెన్నెల

ఆ… ఆ…
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ… ఆ… ఆ..

తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ… ఆ… ఆ…

చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా

పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు

అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన ఆ… ఆ…
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళ గల జంటను పదిమంది చూడంది
తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా

వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా
గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా
మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా

దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా ఆ… ఆ…
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక బందువులంతా కదలండి

చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా

చిత్రం: ఖుషీ

రచన: చంద్రబోస్

అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా
ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులు హో హో
ఈ చూపులు హో హో
ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే
అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే

ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేయేలే (అమ్మమ్మో)
ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే (అమ్మమ్మో)
ప్రేమే తోడుంటే పామైనా తాడేలే
ప్రేమే వెంటుంటే రాయైనా పరుపేలే
నీ ఒంట్లో ముచ్చెమటైనా నా పాలిట పన్నీరే
నువ్విచ్చే పచ్చి మిరపైనా నా నోటికి నారింజే
ఈ వయసులో హో హో
ఈ వరుసలో హో హో
ఈ వయసులో ఈ వరుసలో నిప్పైనా నీరేలే.

అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
నేనొక పుస్తకమైతే, నీ రూపే ముఖ చిత్రం (అమ్మమ్మో)
నేనొక అక్షరమైతే, నువ్వేలే దానర్ధం (అమ్మమ్మో)
ఎగిరే నీ పైటే, కలిగించే సంచలనం
ఒలికే నీ వలపే, చేయించే తలస్నానం
ఎండల్లో నీరెండల్లో నీ చెలిమే చలివేంద్రం
మంచుల్లో పోగమంచుల్లో నీ తలపే రవి కిరణం
పులకింతలే హో హో
మొలకెత్తగా హో హో

పులకింతలే మొలకెత్తగా ఇది వలపుల వ్యవసాయం
అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా
ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులు హో హో
ఈ చూపులు హో హో
ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే

గ్రాడ్యుయేషన్ చేయకపోయినా.. సినిమాలతో కోట్లు సంపాదించేస్తున్నారు..!

చిత్రం : ఠాగూర్

రచన : సుద్దాల అశోకతేజ

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం భువనఘోషకి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం విశ్వశాంతికి వెర్రిగొంతుకనిచ్చి మ్రోశాను
||నేను సైతం ప్రపంచాగ్నికి||

అగ్నినేత్ర మహోగ్రజ్వాలా దాచినా ఓ రుద్రుడా
అగ్నిశిఖలని గుండెలోనా అణచినా ఓ సూర్యుడా
హరశ్వతమును చేతబూనిన పరశురాముని అంశవా
హింసనణచగ ధ్వంసరచనలు చేసినా ఆజాదువా
మన్నెంవీరుడు రామరాజు ధను:శ్శంఖారానివా
భగత్ సింగ కడసారి పల్కిన ఇంక్విలాబ్ శబ్దానివా

అక్రమాలను కాలరాసే ఉక్కుపాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జయతె కే నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా

చిత్రం: స్టైల్

రచన : చిన్ని చరణ్

మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా
నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా
నిప్పులు చిందినా ఏ మెరుపులు ఆపినా
వెనకడుగేయక ముందుకు సాగరా
నలుదిక్కులు నవ్వుతు ఉన్నా
నలుపెక్కని సూర్యుడు నువ్వై
ఆ చుక్కలనే ఇల దించెయ్

నీ శక్తిని యుక్తిగ చూపెయ్
నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో
మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా
నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా
అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి
కొండనే ఢీకొట్టరా అది ఎంత కస్టమైనా
ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు
విందుగా మురిసేనుగా మీ అమ్మ ఎక్కడున్నా

చేయుతే ఇస్తుంటే ఓ స్నేహబంధం
చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం
నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం
ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం
లేరా అడుగేయిరా వెనకడుగే లేక

కిందపడుతూ ఉన్న పైపైకి పరుగు తీసి
అలలతో పోటి పడి చేరాలి కలల కడలి
పందెమేది అయిన నీ పట్టుదలను చూసి
ఒంటరై వణకాలిరా ఆ ఓటమైన హడలి

అందరికి చేతుల్లో ఉంటుంది గీత
నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత
నీ కాళ్ళ అడుగులతో కాలాన్ని ఆపి
లోకాలే పొగిడేలా చూపించు ఘనత
వెయ్ రా చిందెయ్ రా విజయం నీదే

చిత్రం: పరుగు

రచన: సిరివెన్నెల

హృదయం ఓర్చుకోలేనిది గాయం
ఇకపై తలచుకోరానిది ఈ నిజం
పెదవులు విడిరాకా నిలువవే కడదాకా
జీవంలో బతకవె ఒంటరిగా
లో లో ముగిసే మౌనంగా ఓ ఓ ఓ
హృదయం ఓర్చుకోలేనిది గాయం
ఇకపై తలచుకోరానిది ఈ నిజం

ఊహల లోకంలో ఎగరకు అన్నావే
తేలని మైకంలో పడకని ఆపావే
ఇతరుల చిరునవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా
మరి నా కనుపాపల్లో నలుపై నిలిచావేమ్మా
తెలవారి తొలికాంతి నీవో బలి కోరు పంతానివో
అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి ఓ ఓ ఓ
హృదయం ఓర్చుకోలేనిది గాయం
ఇకపై తలచుకోరానిది ఈ నిజం

వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు
చల్లని చూపులతో దీవెనలిస్తాడు
అంతటి దూరం ఉంటే బ్రతికించే వరంవుతాడు
చెంతకి చేరాడంటే చితి మంటే అవుతాడు
హలాహలం నాకు సొంతం నువ్వు తీసుకో అమృతం
అనకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా ఓ ఓ ఓ
హృదయం ఓర్చుకోలేనిది గాయం
ఇకపై తలచుకోరానిది ఈ నిజం

చిత్రం: కృష్ణం వందే జగద్గురుమ్

రచన: సిరివెన్నెల

జరుగుతున్నది జగన్నాటకం .. జరుగుతున్నది జగన్నాటకం ..
పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం
నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్ధం
జరుగుతున్నది జగన్నాటకం .. జరుగుతున్నది జగన్నాటకం ..

చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని
ధర్మ మూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని
సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి
నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం

చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే
పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే
బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక
ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీరసాగరమథన మర్మం

ఉనికిని నిలిపే యిలను కడలిలో కలుపగనురికే ఉన్మాదమ్మును
కరాళ దంష్ట్రుల కుళ్ళగించి యీ ధరాతలమ్మును ఉధ్ధరించగల
ధీరోధ్ధతి రణ హుంకారం ఆదివరాహపు ఆకారం

ఏడీ ఎక్కడరా నీ హరి ? దాక్కున్నాడేరా భయపడి ?
బయటకి రమ్మనరా .. ఎదుటపడి నన్ను గెలవగలడా తలపడి ?
నువు నిలిచిన యీ నేలని అడుగు .. నీ నాడుల జీవ జలమ్ముని అడుగు
నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు నీ ఊపిరిలో గాలిని అడుగు
నీ అడుగుల ఆకాశాన్నడుగు నీలో నరునీ హరినీ కలుపు
నీవే నరహరివని నువు తెలుపు

ఉన్మత్త మాతంగ భంగి ఘాతుక వితతి
హంతృ సంఘాత నిర్ఘృణ నిబడమే జగతి
అఘము నగమై ఎదిగె అవనికిదె అశనిహతి
ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి
శితమస్తి హత మస్తకారి నఖ సమకాసియో
కౄరాసి గ్రోసి హుతదాయ దంష్ట్రుల ద్రోసి మసిజేయు మహిత యజ్ఞం

అమేయమనూహ్యమనంత విశ్వం..
ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం ..
కుబ్జాకృతిగా బుధ్ధిని భ్రమింపజేసే.. అల్పప్రమాణం
ముజ్జగాలనూ మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం

జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగన్నాటకం
జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగమే నాటకం

పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మగ్లానిని పెరుకగ
పరశురాముడై .. భయదభీముడై .. పరశురాముడై భయదభీముడై
ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన శోత్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు

ఏ మహిమలూ లేక యే మాయలూ లేక నమ్మశక్యముగాని యే మర్మమూ లేక
మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగ మహిని మిగలగలిగే మనికి
సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచే

ఇన్ని రీతులుగా యిన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్నపరిచితునిగా
దర్శింపజేయగల జ్ఞాన దర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణతరణము

అణిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాకామ్యవర్తిగా
ఈశత్వముగా వశిత్వమ్ముగా నీలోని అష్ట సిధ్ధులూ నీకు కన్పట్టగా
స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా

నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా
తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతె నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే

వందే కృష్ణం జగద్గురుమ్ వందే కృష్ణం జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్ కృష్ణం వందే జగద్గురుమ్
వందే కృష్ణం జగద్గురుమ్ వందే కృష్ణం జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్ కృష్ణం వందే జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్

చిత్రం: ఐస్మార్ట్ శంకర్

రచన: కాసర్ల శ్యామ్

రాయ రాయె రాయ రాయె మైసమ్మ,
బల్కంపేట ఎల్లమ్మవే,
మా తల్లి బంగారు మైసమ్మవే

నీ ముక్కుపోగు మెరుపులోన.. పొద్దు పొడిసె తూరుపులోన మైసమ్మా
ఎర్రా ఎర్రని సూరీడే.. నీ నుదుటున బొట్టాయె ఓ సల్లని సూపుల తల్లి మాయమ్మ

అమ్మలగన్న అమ్మరన్నా.. పచ్చి పసుపు బొమ్మరన్నా
యాపచెట్టు కొమ్మరన్నా.. దూపమేసే దుమ్మురన్నా
ఆషాఢ మాసమన్నా.. అందులోన ఆదివారమన్నా
కొత్త కుండల బోనమన్నా.. నెత్తికెత్తెను పట్నమన్నా
హోసే.. హోసే.. బోనాలురే

ఛలో ఛలో గండి మైసమ్మరో
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండి మైసమ్మరో

హే రాయ రాయె రాయ రాయె మైసమ్మ,
బల్కంపేట ఎల్లమ్మవే,
మా తల్లి బంగారు మైసమ్మవే
ఉజ్జయిన మహంకాళివే.. మాయమ్మ ఊరూరా పోచమ్మవే
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండి మైసమ్మరో

రేవుల పుట్టింది.. రేణుక ఎల్లమ్మ
జెర్రిపోతుల తీసి జడల చుట్టింది
నాగుపాముల తీసి నడుముల కట్టింది
ఏడుగురు అక్కచెల్లెళ్లు ఎంటరాంగ
ఏడేడు లోకాలు ఏలుతుందమ్మ
మావురాల ఎల్లమ్మ దండాలు తల్లీ

దిస్ దిస్ దిస్.. బర్కత్ పుర
డీజే ఇస్మార్ట్.. డిస్కో బోనాల్

పెయ్యి నిండ గవ్వల్ని పేసుకున్నవే
వెయ్యి కళ్లా తల్లీ నీకు యాకపోతులే
నిమ్మకాయ దండల్లో నిండుగున్నవే
కల్లూ కుండ తెచ్చి ఇక సాక పోస్తమే

చింతాపూల చీరకట్టినవే
చేత శూలం, కత్తి పట్టినవే
మొత్తం దునియానే ఏలుతున్నవేహే
రాయ రాయె రాయ రాయె మైసమ్మ,

జూబ్లీహిల్సు పెద్దమ్మవే.. జగమేలే మా తల్లివే
గోల్కొండ ఎల్లమ్మవే.. లష్కరుకే మా రానివే
హోసే… హోసే.. పోతురాజురో..జజ్జనకర జజ్జనకర తీనుమారురో
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండి మైసమ్మరో

అగ్గి గుండాల్లో నువ్వూ భగ్గుమన్నవే
సుట్టూ ముట్టు సుక్కల్లో ముద్దుగున్నవే
పుట్టల్లో ఉన్నట్టి మట్టిరూపమే.. బాయిలోన పుట్టి అల్లినావు బంధమే
గాలీ దూళీ.. అంతా నువ్వేలే
జాలీ గల తల్లీ నువ్వేలే
ఈ జనమంతా నీ బిడ్డలే
రాయ రాయె రాయ రాయె మైసమ్మ,

బెజవాడ దుర్గమ్మవే.. కలకత్తా మహంకాళివే
కంచిలోన కామాక్షివే.. మాయమ్మ మధురలోన మీనాక్షివే
యోసే.. యోసే..ఈల గోలరో.. తొట్టేళ్లతో పొట్టేళ్ల బండి కదిలెరో
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండి మైసమ్మరో

 

 

 

 

 

Read More From Celebrity Life