Entertainment

2018 తెలుగు చిత్రాల్లో.. టాప్ 9 హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

Sandeep Thatla  |  Dec 26, 2018
2018 తెలుగు చిత్రాల్లో..   టాప్ 9 హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

తెలుగు (Telugu) సినిమాలలో హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యం ఎంత? అని ఎవరైనా ప్రశ్నిస్తే…  చాలామంది దగ్గర సమాధానం ఉండదు. రొటీన్‌గా చెప్పాలంటే “మూడు సన్నివేశాలు.. ఆరు పాటలకి” మాత్రమే హీరోయిన్స్ పరిమితం అని పలువురు చెబుతుంటారు. ఇలాంటి ఒక బలమైన అభిప్రాయం ఉన్న సమయంలో కూడా.. తమకంటూ ఒక గుర్తింపుని తమకి లభించిన పాత్రల ద్వారా పొందిన నటీమణులూ ఉన్నారు. 2018లో (Tollywood) టాలీవుడ్‌లో అలా మెరిసిన పలువురు అందాల తారల గురించి సంక్షిప్తంగా మీకోసం…

సమంత

పెళ్లి అనేది సినిమా సక్సెస్‌కి అడ్డుకాదు అని తెలుగు చిత్రపరిశ్రమలో నిరూపించిన నేటి తరం హీరోయిన్‌గా సమంత (Samantha) పేరు అందరికి గుర్తుండిపోతుంది. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తరువాత హీరోయిన్లకు సరైన అవకాశాలు రావని.. ఒకవేళ వచ్చినా అంతకముందు ఉన్నంత ఫాలోయింగ్ ఉండదనే మాటలకి చెక్ పెడుతూ రంగస్థలం సినిమాలో సమంత తన నటనకి మంచి పేరు తెచ్చుకోగలిగింది. అదే సమయంలో హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన  U -టర్న్ చిత్రంలో సైతం ఆమె నటన అందరిని కట్టిపడేస్తుంది. మొత్తానికి ఈ తరం నటీమణులకు సమంత ఆదర్శమనే చెప్పాలి.

కీర్తి సురేష్

కెరీర్ మొదలుపెట్టిన కొన్ని సంవత్సరాలకే.. తమ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకొనే పాత్రలు హీరోయిన్లకు దొరకడం కష్టం. అట్లాంటిది కీర్తి సురేష్‌కి (Keerthy Suresh) అనతికాలంలోనే తన కెరీర్‌లో ఎప్పటికి గుర్తుండిపోయే పాత్ర లభించింది. అదే మహానటి సావిత్రి పాత్ర. కీర్తి ఈ పాత్రని ఛాలెంజింగ్‌గా తీసుకొని మీరీ నటించింది. ఈ చిత్రం చూసాక ప్రేక్షకులు కీర్తికి బ్రహ్మరథం పట్టారనడంలో సందేహం లేదు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయి నటించిందని.. ఆమెకి కచ్చితంగా ఈ ఏడాది ఇవ్వబోయే అవార్డులలో పెద్దపీట వేస్తారని విమర్శకులు అంటున్నారు.

కాజల్ అగర్వాల్

తెలుగు పరిశ్రమలో దాదాపు దశాబ్ధకాలం పైగానే ఉన్న ఈ అందాల భామకి.. ఇప్పటికీ అవకాశాల పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోతోంది. హీరోయిన్ కెరీర్ అంటేనే చాలా స్వల్పకాలికం అనుకునే ఈ రోజుల్లో కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) మాత్రం  చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరు హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీ‌గా కెరీర్‌లో ముందుకు వెళ్లడం విశేషం. ఇక ఈ సంవత్సరంలో కాజల్ ‘అ’ అనే ఒక వైవిధ్యమైన చిత్రంతో పాటుగా ఎమ్యెల్యే (MLA) & కవచం (kavacham) అనే రెండు కమర్షియల్ చిత్రాలలో కూడా మెరిసింది.  

రెజినా

రెజినా (Regina Cassandra) చాలాకాలం నుండి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ  సరైన సక్సెస్ లేక కెరీర్ పరంగా కాస్త ఇబ్బందిపడుతోంది. అయితే ఈ సంవత్సరంలో  వచ్చిన ‘అ’ (Awe) చిత్రం కోసం ఆమె మేకోవర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె తన లుక్ కోసం దాదాపు రెండు రోజులు కష్టపడింది  అని తెలిసాక ఆమెని చాలామంది ప్రశంసించారు. అదే సమయంలో  ఆ పాత్రకి సంబంధించి రెజినా నటనకి కూడా మంచి మార్కులే పడ్డాయి. 

పాయల్ రాజ్ పుత్

సాధారణంగా  హీరోయిన్స్‌కి వాళ్ళ  తొలిచిత్రాలు కమర్షియల్ చిత్రాలే అవుతుంటాయి. ఎక్కడో కొద్దిమందికి మాత్రమే తొలి చిత్రంతోనే తమ టాలెంట్‌ని ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. అలాంటి ఒక పాత్రే నటి పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ని వరించింది. RX 100 చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడికి తొలిచిత్రమే పెద్ద సవాలుగా నిలిచింది. పాత్ర పరంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రని ఎంపిక చేసుకోవడం వల్ల.. ఆమె అందులో రాణించేందుకు శాయశక్తులా  కృషిచేసింది. ముఖ్యంగా బోల్డ్ సన్నివేశాలలో  సైతం నటించి..  నటన కోసం ఎటువంటి పాత్రలోనైనా తాను నటించేందుకు సిద్ధమని.. తనకి బెరుకులేదని పాయల్  చెప్పకనే చెప్పింది. 

నభ నటేష్

ఈ సంవత్సరం తెలుగులో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్న నటీమణులలో  నభ నటేష్ (Nabha Natesh) పేరు ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే ఆమె నటనకి ప్రేక్షకులే కాదు.. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు కూడా మంత్రముగ్ధులవ్వడం గమనార్హం. “నన్ను దోచుకొందువటే” సినిమాలో ఆమె నటనకు గాను రాఘవేంద్రరావు తనను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. కన్నడ పరిశ్రమలో 2015లోనే ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్.. ఇక్కడ కూడా తన సత్తా చాటింది.

సాయి పల్లవి

మలయాళంలో వచ్చిన ప్రేమమ్ (Premam) చిత్రంలో మలర్‌‌గా నటించి.. తెలుగు వారిని సైతం ఆకట్టుకున్న సాయి పల్లవి ఆ తరువాత ఫిదా (Fidaa) చిత్రంతో ఇక్కడి వారిని ఫిదా చేసేసింది. ఇక ఈ సంవత్సరం సాయి పల్లవి (Sai Pallavi) నటించిన పడి పడి లేచే మనసు (Padi Padi Leche Manasu) చిత్రం విడుదల కావడంతో మరోసారి ఆమెని తెరపైన చూడడానికి ఫ్యాన్స్ క్యూలు కట్టారు. సినిమా టాక్ అంత బాగా రాకపోయినా సాయి పల్లవి నటనకి మాత్రం ఎప్పటిలాగే నూటికి నూరు శాతం మార్కులు పడ్డాయి. సినిమా పరంగా విజయం తన ఖాతాలో పడకపోయినా.. అభిమానుల పరంగా ఆమె మరోసారి సక్సెస్ కొట్టినట్టే. 

అదితి రావు హైదరి 

బాలీవుడ్ నుండి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన సహజ నటనతో అందరిని తనవైపుకు తిప్పుకోగలిగింది. సమ్మోహనం (Sammohanam) చిత్రంలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం ద్వారా తన పాత్రకి పూర్తి న్యాయం చేయగలిగింది. అదే సమయంలో ఆమె హవాభావాలు సైతం పాత్రకి తగట్టుగా సరిగా సరిపోయాయి. ఇక గతవారమే విడుదలైన అంతరిక్షం (Antariksham) చిత్రంలో కూడా ఒక మంచి పాత్రలో అదితి మెరిసింది. ఇందులో కూడా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. భవిష్యత్తులో మరిన్ని వైవిధ్యమైన పాత్రలలో తెలుగులో ఆమె నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు.

రాశి ఖన్నా

రాశి ఖన్నా (Raashi Khanna) కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అని అనుకునే వారందరికీ షాక్ ఇస్తూ తొలిప్రేమ చిత్రంలో (Tholiprema) తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఆమె నటించిన తీరు అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. సరైన పాత్ర దొరికితే.. ఆమె ఆ పాత్రలో ఎంతలా లీనమై నటిస్తుందో ఆ సినిమాలో ఆ ప్రేమకథా చిత్రంలో ఆమె చూపించింది. ఇక ఈ సినిమా తరువాత ఆమెకి అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా మన దర్శక-నిర్మాతలు ఇవ్వడానికి ముందుకి వస్తున్నారు అని సమాచారం .

ఈ నటీమణులంతా.. ఈ సంవత్సరం తెలుగు సినిమాలలో  తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వీరందరికి 2019లో కూడా మరిన్ని మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..!

ఇవి కూడా చదవండి

2018లో టాలీవుడ్‌ ఇండస్ట్రీని షేక్ చేసిన.. టాప్ 6 మూవీస్ ఇవే..!

టాలీవుడ్ మహిళా దర్శకుల గురించి ఆసక్తికర విషయాలివే..!

టాలీవుడ్‌‌లో సత్తా చాటిన.. బాలీవుడ్ ముద్దుగుమ్మలు వీరే.. !

Read More From Entertainment