Celebrity Life

టాలీవుడ్ టాప్ 10.. లేడీ కమెడియన్స్ వీరే

Babu Koilada  |  Jul 21, 2019
టాలీవుడ్ టాప్ 10.. లేడీ కమెడియన్స్ వీరే

సాధారణంగా మనకు సినీ పరిశ్రమలో హస్య నటులంటే.. మగాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. కానీ అంతేస్థాయిలో పేరు, ప్రఖ్యాతులు సాధించిన హాస్య నటీమణులు (lady comedians) కూడా ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అటువంటి లేడీ కమెడియన్స్ గురించి ప్రత్యేకంగా ఈ కథనం మీ కోసం 

సూర్యకాంతం – ఆనాటి కాలంలో అత్త పాత్రలలో ఎక్కువగా రాణిస్తూ.. చిన్నపాటి విలనిజానికి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన నటి సూర్యకాంతం. కానీ ఆమె మాటల్లోనే హాస్యం తొణికిసలాడుతుంది. ఆమె మూతి విరుపులు, తిట్టే తిట్లు, నోరుపారేసుకొని పద్ధతి అన్నీ నవ్వు తెప్పిస్తాయి. ఇక రేలంగితో ఆమె కాంబినేషన్ అంటే చాలు.. వారి మధ్య వచ్చే సంభాషణలకు కడుపుబ్బా నవ్వుతూనే ఉంటాం. 

Suryakantham – Movie Still (IMDB)

రమాప్రభ – తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూర్యకాంతం తర్వాత చెప్పుకోదగ్గ నటి రమాప్రభ. హాస్యనటుడు రాజబాబుతో ఆమె కాంబినేషన్ ప్రతిదీ సూపర్ హిట్టే. 1970, 1980 ల్లో ఈ పెయిర్ పండించిన కామెడీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాదాపు 1400 సినిమాలలో నటించిన రమాప్రభ.. ఇప్పటికీ సినిమాల్లో యాక్ట్ చేస్తూనే ఉన్నారు. 

Rama Prabha and Raja Babu (Movie Poster)

శ్రీ లక్ష్మి – ఇక 1980 ల్లోని మహిళా కమెడియన్స్ గురించి చెప్పుకోవాలంటే శ్రీలక్ష్మి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఎక్కువగా జంధ్యాల సినిమాల్లో ఆమె కామెడీ చాలా బాగా పండింది. “బాబూ… చిట్టీ” అంటూ ఆమె  ప్రేమతో పేల్చిన డైలాగ్ థియేటర్లలోనూ నవ్వులు పూయించి మరీ.. ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది. సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం.. ఇలా హాస్యనటులు అందరితోనూ నటించిన ఈమె దాదాపు 500 సినిమాల్లో యాక్ట్ చేసింది. పలు టీవీ సీరియల్స్‌లో కూడా నటించింది. 

తెలుగమ్మాయిల అందాన్ని.. అపురూపంగా చూపిన ఘనత “బాపు” చిత్రాలదే..!

Srilakshmi – Movie Still (Youtube)

కోవై సరళ – ఇక తెలుగు సినిమాల్లో 1990 సంవత్సరం నుండి బాగా పాపులరైన మహిళా కమెడియన్ కోవై సరళ. ముఖ్యంగా బ్రహ్మానందంతో తన కాంబినేషన్ ప్రతిదీ సూపర్ డూపర్ హిట్టే. “క్షేమంగా వెళ్లి లాభంగా రండి” చిత్రం వీరికి మంచి పేరు తీసుకువచ్చింది. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా పాపులర్ కమెడియన్‌గా కోవై సరళ సుపరిచితురాలు. 

Movie Still (Youtube)

గీతా సింగ్ – అల్లరి నరేష్ నటించిన “కితకితలు” చిత్రంలో.. గీతా సింగ్ నటన ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడమే కాదు.. ఆమె హాస్యానికి మంచి మార్కులను కూడా సంపాదించి పెట్టింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో ఆమె కమెడియన్‌గా నటించారు.

తెలుగు వారి పల్లె పడుచు.. “ఎంకి” ముచ్చట్లు మీకోసం..!

Movie Still (Youtube)

హేమ – తొలుత క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించినా.. తర్వాత హాస్యనటిగా కూడా తన మార్కు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు హేమ. ముఖ్యంగా బ్రహ్మానందంతో ఆమె కాంబినేషన్.. ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ‘అతడు’ చిత్రంలో వీరి కాంబినేషన్‌కి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. 

Movie Still (Youtube)

కల్పనా రాయ్ – ఇక తెలుగు సినిమాలకు సంబంధించి బాగా పాపులారిటీ దక్కించుకున్న మరో కమెడియన్ కల్పనా రాయ్. తన కాకినాడ యాసతో జనాలను ఆకట్టుకున్న ఈమె.. దాదాపు 400 చిత్రాలకు పైగా నటించారు. ఆపద్భాంధవుడు, హిట్లర్, పాపే నా ప్రాణం లాంటి చిత్రాలలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. పూరీ జగన్నాథ్, అల్లరి రవిబాబు మొదలైన వారు డైరెక్ట్ చేసిన చిత్రాలలో కూడా తనదైన మార్కు హాస్యంతో ఆకట్టుకున్నారు. 

నాన్న ప్రేమలో మాధుర్యాన్ని తెలుసుకోవాలంటే.. ఈ ఛాయాచిత్రాలు చూడాల్సిందే

Movie Still (Youtube)

ఝాన్సీ – బుల్లితెర నటిగా, హాస్య ఛలోక్తులు విసిరే వ్యాఖ్యాతగా ఝాన్సీ మనకు బాగా సుపరిచితురాలే. అయితే “తులసి” చిత్రంలో ఈమె పోషించిన కోకాపేట ఆంటీ పాత్ర తన కెరీర్‌ను మలుపు తిప్పింది. తెలుగు చిత్రాలలో హాస్యనటిగానూ ఈమె తనదైన శైలిలో దూసుకుపోతోంది. 

Movie Still (Youtube)

విద్యుల్లేఖా రామన్ – నేటి తరం లేడీ కమెడియన్స్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ క్రియేట్ చేసుకున్న అమ్మాయి విద్యుల్లేఖా రామన్. ఎటో వెళ్లిపోయింది మనసు, నిన్ను కోరి, సరైనోడు, రన్ రాజా రన్, రాజా ది గ్రేట్ లాంటి చిత్రాలలో తనదైన మార్కు హాస్యంతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది ఈ  అమ్మాయి. రన్ రాజా రన్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ హాస్య నటిగా నంది అవార్డు కూడా అందుకుంది. 

స్నిగ్ధ – ఇక ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్న మరో లేడీ కమెడియన్ స్నిగ్ధ. అలా మొదలైంది చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన స్నిగ్ధ… ఆ తర్వాత మేం వయసుకి వచ్చాం, రొటీన్ లవ్ స్టోరీ, దమ్ము, కేటుగాడు, గుంటూరు టాకీస్,  సెల్ఫీరాజా మొదలైన చిత్రాలలో తనదైన శైలిలో ఆకట్టుకుంది. 

Movie Still

Read More From Celebrity Life