(Top Ten varieties of Omelettes you must try)
ఆమ్లెట్స్ అంటే ఇష్టం ఉండని వారు ఎవరు ఉంటారు చెప్పండి. అయితే ఇప్పటికి వరకూ కేవలం మనం మసాలా ఆమ్లెట్, పొటాటో ఆమ్లెట్ లేదా చికెన్ ఆమ్లెట్ లాంటి పేర్లను మాత్రమే వినుంటాం. కానీ మనసుంటే మార్గముంది అన్నట్లు.. ట్రై చేయాలే గానీ.. మనకోసం లెక్కలేనన్ని ఆప్షన్స్ సిద్ధంగా ఉంటాయి. ఈ కథనం చదివితే.. ఆమ్లెట్స్‌లో ఇన్ని రకాలా..? అని మీకు మీరే ఆశ్చర్యపోతారు.
1. ప్రాన్ మసాలా ఆమ్లెట్ (Prawns Masala Omelette) : రొయ్యలతో ఆమ్లెట్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అవునండీ. ప్రస్తుతం పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలో ఇది బాగా ఫేమస్. చిన్న చిన్న రొయ్యలను బాగా ఫ్రై చేయించి.. గుడ్డుతో మిక్స్ చేసి పైన పచ్చి మిర్చి అద్దితే.. అదో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్ మీకు నచ్చుతుంది కూడా.
2. బీన్ కర్డ్ ఆమ్లెట్ (Bean Curd Omelette) : బీన్స్, కర్డ్ మిక్స్ చేసిన ఆమ్లెట్‌ను ఎప్పుడైనా ట్రై చేశారా..? లేకపోతే ఇప్పుడు ఓసారి తయారుచేసి చూడండి. ఇండోనేషియాలో బాగా ఫేమస్ డిష్ ఇది. అయితే ఇది ఒక ప్యాన్ కేక్ మాదిరిగా కనిపిస్తుంది. అంతే..!
NDTV Food
3. ఆఫ్రికన్ ఆమ్లెట్ (African Omelette) : మటన్ ముక్కలను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. వాటికి మసాలా అద్ది.. తర్వాత కోడి గుడ్డు సొనతో కలిపి ఆమ్లెట్ వేయండి. ఒక వైవిధ్యమైన టేస్ట్ వస్తుంది.
ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే.. మీరే కిచెన్ క్వీన్ ..!
4. మగ్ ఆమ్లెట్ (Mug Omelette) : ఆమ్లెట్‌ని మగ్‌లో తయారుచేయడం ఎప్పుడైనా చూశారా..? చూడకపోతే ఇప్పుడు చూడండి. సాధారణంగా పెనం మీద ఫ్రై చేయాల్సిన ఆమ్లెట్‌ని మగ్‌లో ఉడికించి చేయడమే దీని స్పెషాలిటీ. ఇలా చేస్తే టేస్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందట.
భోజనప్రియులైనా.. వంట రాకపోతే ఎలా ఉంటుందో మీకు తెలుసా?
5. చీజ్ ఆనియన్ ఆమ్లెట్ (Cheese Onion Omelette) : మీరు ఆమ్లెట్‌ని నూనెతో ఫ్రై చేసే బదులు.. ఈసారి చీజ్‌తో ఫ్రై చేయండి. అలా ఫ్రై చేసిన ఆమ్లెట్‌ని ఉల్లిగడ్డలతో సర్వ్ చేయండి. సూపర్ టేస్ట్ అంటే దీనిదే మరి
6. పప్పు ఆమ్లెట్ (Moonglet) : పప్పు ప్లస్ గుడ్డు. ఇదేం కాంబినేషన్ బాబోయ్ అని అనుకుంటున్నారా..? అయితే మూంగ్ దాల్‌ను బాగా గ్రైండ్ చేసి.. ఎగ్ మిక్స్‌తో కలిపి ఫ్రై చేయండి. మీకు నిజంగానే ఒక కొత్త టేస్ట్ వస్తుంది.
7. మష్రూమ్ ఆమ్లెట్ (Mushroom Omelette) : పుట్టగొడుగులతో ఆమ్లెట్ ఏంటి..? అని అనుకుంటున్నారా..? అయితే మీరు ఈ మష్రూమ్ ఆమ్లెట్ ట్రై చేయాల్సిందే. మష్రూమ్స్‌ను బాగా వేయించాక.. గుడ్డు సొనతో వాటిని బాగా కలిపి ఫ్రై చేయండి. ఒక కొత్తరకం ఆమ్లెట్ టేస్ట్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
ఈ కేక్ రెసిపీలతో.. మీ క్రిస్మస్‌ని అద్భుతంగా జరుపుకోండి
8. చెర్రీ టొమాటో ఆమ్లెట్ (Cherry Tomotoes Omelette) : ఇది కూడా ఓ చిత్రమైన కాంబినేషన్. చెర్రీ టొమాటోలను గ్రైండ్ చేసి.. గుడ్డు సొనతో మిక్స్ చేశాక.. పైన కొంచెం బ్లాక్ పెప్పర్ అద్ది.. ఆమ్లెట్ వేస్తే ఆ రుచే వేరు.
9. శ్రీలంకన్ ఆమ్లెట్ (Srilankan Omelette) : దోరగా వేయించిన టొమాటోలు, ఉల్లిపాయలను.. గుడ్డుసొనతో మిక్స్ చేసి ఆమ్లెట్ చేసే సమయంలోను.. మధ్య మధ్యలో టేస్ట్ కోసం కొంచెం పాలను ఆమ్లెట్ పై చిలకరిస్తుంటారు. ఇదీ శ్రీలంకన్ స్టైల్‌లో ఆమ్లెట్ చేసే పద్దతి.
లాహోరీ ఆమ్లెట్ (Lahori Omelette) : ఇది అచ్చం మనం చేసుకొనే ఆమ్లెట్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే బాగా డీప్ ఫ్రై చేస్తారు. అది ఒక్కటే తేడా.
ఇవండీ మన ఆమ్లెట్ ముచ్చట్లు. మరి మీరు కూడా వీటిని మీ ఇళ్లలో ట్రై చేసేయండి.
Images : Instagram.com/OpenGeT and Instagram.com/ThatFitCouchPotato
మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.