Bollywood

ఈ బాలీవుడ్ నటులు.. ఓటు ఎందుకు వేయలేదంటే..?

Lakshmi Sudha  |  Apr 15, 2019
ఈ బాలీవుడ్ నటులు.. ఓటు ఎందుకు వేయలేదంటే..?

2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి దేశం దృష్టి మొత్తం ఎన్నిక‌ల మీదే కేంద్రీకృతమైంది. ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చలు వాడి-వేడిగా జరిగాయి. ఇప్పటికే మొదటి దశ షెడ్యూల్ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లోక్ సభ్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో లోక్ సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు సైతం పూర్తయ్యాయి.

ఈ ఎన్నికలకు సినీగ్లామర్ కూడా తోడవడంతో.. ఫలితాలపై మరింత ఆసక్తి ఏర్పడింది. అంతేకాదు.. సినీ సెలబ్రిటీలు తమ వంతు బాధ్యతగా నేటి తరానికి ఓటు వేయాల్సిన ఆవశ్యకత గురించి చెబుతున్నారు. తాము కూడా పోలింగ్ బూత్‌ల దగ్గర సామాన్య ప్రజల మాదిరిగా లైన్లో నిల్చొని మరీ ఓట్లు వేస్తున్నారు.

కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం అని చెప్పవచ్చు. ఓటు వేయడం బాధ్యత అని తమ అభిమానులకు చెబుతున్నారు… తామెవరూ ఆ హక్కును ఉపయోగించుకోలేదు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు (Bollywood Celebrities) కొంతమంది ఓటు వేయలేదు. వారెవరో.. ఎందుకు ఓటు వేయలేకపోయారో మనం కూడా తెలుసుకొందాం.

1. దీపికా పదుకొణె

దీపికా పదుకొణెెకు బాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా మంచి పేరుంది. దీపిక తండ్రి ప్రకాశ్ పదుకొణె భారత్ తరఫున ప్రపంచ క్రీడా వేదికపై బ్యాడ్మింటన్ స్టార్‌గా వెలుగొందారు. కానీ దీపిక మన దేశంలో ఓటు వేయలేదు. ఆమె బెంగళూరులోనే పెరిగి పెద్దయినప్పటికీ.. దీపిక డెన్మార్క్‌లోని కోపెన్ హాగన్ లో పుట్టింది. కాబట్టి ఆమెకు డ్యానిష్ పాస్ పోర్ట్ ఉంది. దీంతో ఆమెకు ఇండియాలో ఓటు వేయడానికి అవకాశం లేదు.

2. అలియా భట్

ఈ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన సెలబ్రిటీల్లో అలియా కూడా ఒకరు. కానీ ఆమె మన దేశంలో ఓటు హక్కును (Right to Vote) వినియోగించుకోలేదు. ఎందుకంటే ఆలియాతో పాటు ఆమె తల్లి సోనీ రజ్దాన్‌కు బ్రిటిష్ పాస్ పోర్ట్స్ ఉన్నాయి.

3. అక్షయ్ కుమార్

దేశం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించే సెలబ్రిటీల్లో అక్షయ్ కుమార్ ముందు వరుసలో ఉంటారు. భారత ఆర్మీ, వారి కుటుంబాల విషయంలో వ్యవహరించే విధానం, సామాజిక సమస్యల పట్ల స్పందించే తీరు అక్షయ్‌ను మిగిలినవారికంటే ప్రత్యేకంగా నిలబెడతాయి. ఓటు ఆవశ్యకత గురించి అభిమానులకు వివరించే ఆయన మాత్రం ఓటు వేయలేరు. ఎందుకంటే అక్షయ్ పుట్టింది అమృత్ స‌ర్‌లోనే అయినప్పటికీ.. ఆయనకు కెనడియన్ పాస్ పోర్ట్ ఉంది. అందుకే అక్షయ్ మన దేశంలో ఓటు హక్కు వినియోగించుకోలేరు.

4. అమీ జాక్సన్

 

ఎవడు, ఐ, రోబో 2 వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అమీ జాక్సన్ సైతం.. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఎందుకంటే.. ఆమెకు బ్రిటిష్ పౌరసత్వం ఉంది.

5. సన్నీ లియోన్

సన్నీలియోన్ కెనడాలో జన్మించిన భారతీయ పౌరురాలు. ఆమె ప్రస్తుతం ఇండియాలోనే ఉంటున్నప్పటికీ.. కెనడా పౌరసత్వం ఉండటం వల్ల ఆమె మన దేశంలో ఓటు హక్కు వినియోగించుకోలేరు.

6. ఇమ్రాన్ ఖాన్

అమీర్ ఖాన్ మేనల్లుడిగా వెండితెరకు పరిచయమైన ఇమ్రాన్ ఖాన్ సైతం భారత్‌లో ఓటు హక్కు వినియోగించుకోలేడు. ఎందుకంటే.. అతనికి అమెరికా పౌరసత్వం ఉంది.

వీరితో పాటుగా కత్రినా కైఫ్, జాక్వైలిన్ ఫెర్నాండెజ్, నర్గీస్ ఫక్రీ కూడా భారతీయ పౌరసత్వం లేనందున ఇక్కడ ఓటు వేయలేకపోయారు.

Image Source: Instagram

ఇవి కూడా చదవండి

మహిళలకు కోపం తెప్పించిన మ్యానిఫెస్టో.. వ్యాకరణ దోషాలతో వచ్చిన చిక్కు..!

భర్త పాస్ పోర్టును.. పద్దుల పుస్తకంగా మార్చేసిన ఇల్లాలు..!

ఇప్పుడు ఆ భయం.. మహిళలను వేధించేవారిలో కనిపిస్తోంది: కృతి సనన్

మీరు సోషల్ మీడియాలో రాక్ స్టార్ గా వెలుగిపోతున్నారా? అయితే Plixxo లో వెంటనే చేరిపోండి. ఇండియాలోనే అతి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నెట్వర్క్ లో చేరి టాప్ బ్రాండ్స్ తో కలసి పనిచేసే అవకాశం అందుకోండి.

Read More From Bollywood