Family

ఈద్ శుభాకాంక్షలు ఇలా చెబితే.. మీ సన్నిహితులు ఎంతో ఆనందిస్తారు..!

Soujanya Gangam  |  Jun 5, 2019
ఈద్ శుభాకాంక్షలు ఇలా చెబితే.. మీ సన్నిహితులు ఎంతో ఆనందిస్తారు..!

రంజాన్ (Ramadan or Eid).. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం. నెల రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏమీ తినకుండా.. తాగకుండా కటిక ఉపవాసం చేసి అల్లాహ్‌కి దగ్గరగా చేరడానికి ప్రయత్నం చేసే ముస్లింలు.. ఆ ఉపవాసాన్ని ముగించి చేసుకునే పండగే ఈ రంజాన్. షవ్వాల్ మాసంలోని మొదటి రోజునే ఈద్ ఉల్ ఫితర్ లేదా రమదాన్‌గా జరుపుకుంటారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిన నెల రంజాన్.

అందుకే ఈ నెల మొత్తం ఉపవాసాలు, దీక్షలు, దానాలు, ధర్మాలు చేయాలని ఖురాన్ (quran) చెబుతుంది. ఇలా చేయడం వల్లే వారి జీవితానికి సార్థకత వస్తుందనే సందేశాన్నిస్తుంది. నెలవంకతో ప్రారంభమయ్యే ఈ రంజాన్ మాసం మళ్లీ నెలవంక కనిపించిన తర్వాతే పూర్తవుతుంది. అప్పటివరకూ ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు ఈ పండగను తమ బంధుమిత్రులతో కలిసి జరుపుకుంటారు. పిండివంటలు, విందు భోజనాలతో ఖుషీ చేసుకుంటారు. అలాగే పేదసాదలకు దానాలు చేస్తారు.

ఈ పవిత్రమైన పండగ సందర్భంగా మీ ముస్లిం సోదరులకు, బంధువులకు, స్నేహితులకు పంపేందుకు పవిత్రమైన వాక్యాలు, శుభాకాంక్షలు అందిస్తున్నాం. వీటిని మీ స్నేహితులకు పంపి.. వారి పండగ వేడుకల్లో మీరూ ఆనందంగా పాల్గొనండి. 

1. సక్రమ మార్గంలో నడుచుకుంటూ దేవుని యందు భక్తి విశ్వాసములు గలవానికి వారి కర్మానుసారం మంచి మరియు పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుంది. ఖురాన్ (16:97). ఈద్ ముబారక్.

2. అత్యుత్తమమైన దానధర్మాలు అంటే మనమంటే ఇష్టం లేని వారికి, మనకు నచ్చని వారికి చేసే దానాలే అంటుంది ఖురాన్. అలాంటి అత్యుత్తమమైన దానం చేసే పండగ ఈ ఈద్.. అందుకే అందరికీ ఈద్ శుభాకాంక్షలు.

3. ప్రవక్తా.. వారికిలా చెప్పు.. ఈ మహాభాగ్యాన్ని అల్లాహ్ మీకోసం పంపాడంటే ఇది ఆయన అనుగ్రహం, కారుణ్యమే.. దానిని వారు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి.. (10:58). అలాంటి ఆనందోత్సాహాలు మీ జీవితంలోనూ పొంగిపొర్లాలని కోరుకుంటూ.. రంజాన్ శుభాకాంక్షలు.

4. విశ్వాసులారా.. మీలో భయభక్తులు జనించడానికే ఈ ఉపవాస వ్రతాలు నిర్ణయించబడ్డాయి. ఆ అల్లాహ్ పై భయభక్తులతో.. తోటి ప్రజలపై ప్రేమాభిమానాలతో మీ జీవితమంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు.

5. సత్ప్రవర్తన గల వ్యక్తి సర్వేశ్వరుని దష్టిలో అందరికంటే మిన్న (ఖురాన్ 49:13) అలాంటి సత్ప్రవర్తనను మనందరికీ నేర్పే అద్బుతమైన పర్వదినం రంజాన్. మీకు, మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు.

6. దేవుడు కరుణామయుడు. అందరిలోనూ ఆ కరుణనే ఇష్టపడతాడు. (1:633) ఆ కరుణామయుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆరోగ్యాశ్వైర్యాలతో ఆశీర్వదించాలని కోరుకుంటూ మీకు రంజాన్ శుభాకాంక్షలు.

7. మీకు నచ్చిన వారిని మీరు ముందుకు నడిపించలేకపోవచ్చు. కానీ దేవుడు తలచుకుంటే తను అనుకున్న దారిలోనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. (28: 56) అల్లాహ్ మిమ్మల్ని సరైన దారిలో నడిపించాలని కోరుకుంటూ ఈద్ శుభాకాంక్షలు.

8. సత్ప్రవర్తన, నియమ నిష్టలతో కూడిన జీవన విధానానికి మార్గం చూపిన ఖురాన్ ఆవిష్కృతమైన పవిత్ర మాసం రంజాన్. నెలరోజుల ఉపవాస దీక్షలు ముగించుకుని.. ఈ రోజు పండుగ చేసుకుంటున్న ముస్లిం సోదరులకు రమదాన్ శుభాకాంక్షలు.

9. నువ్వు ప్రజలను అంధకారం నుంచి వెలికి తీసి కాంతి వైపుకి పయనింపజేయడానికి.. ఈ మహోన్నతమైన గ్రంథాన్ని దేవుడు మనకు పంపించాడు. అలాంటి అద్భుతమైన గ్రంథం అవతరించిన నెల రంజాన్. ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్.

10. ఉపవాసంతో ఆకలిదప్పులతో మనిషిని బాధించడం ఇస్లాం ఉద్దేశం కాదు. పేదవాడి ఆకలి బాధలు తెలుసుకోవడమే ముఖ్యోద్దేశం – ఖురాన్. పవిత్ర ఉపవాస దీక్ష పూర్తిచేసుకున్న ముస్లింలందరికీ ఈద్ శుభాకాంక్షలు.

Image: Shutterstock

ఇవి కూడా చదవండి.

రంజాన్ ఫ్యాషన్‌కు.. కాస్త సెలబ్రిటీ టచ్ ఇద్దాం..!

రంజాన్ అంటే హలీం ఒక్కటే కాదు.. ఈ వంటకాలు కూడా ప్రత్యేకమే..!

స్వలింగ బంధంలో ఉన్నా.. ఆ అమ్మాయినే పెళ్లాడి జీవితంలో స్థిరపడతా: ద్యుతీ చంద్

Images : Shutterstock

Read More From Family