పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. లైంగిక వేధింపులకు (sexually harassed) పాల్పడిన వారికి న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధిస్తున్నాయి. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. బాగా చదువుకొని, పెద్ద స్థాయుల్లో ఉద్యోగాలు చేసే వారు సైతం ఇలా ప్రవర్తించడం శోచనీయం. వీరి కారణంగా మనశ్శాంతిగా విధులు నిర్వర్తించే అవకాశం మహిళలకు ఉండటం లేదు. తమ సహోద్యోగినుల పట్ల స్నేహపూర్వకంగా ప్రవర్తించాల్సింది పోయి వారిని లైంగికంగా వేధిస్తున్నారు.
ఆ వేధింపులను తట్టుకోలేక ఉద్యోగాలను వదులుకొంటున్నారు కొందరు మహిళలు. మరికొందరు ఆ అవమానాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకొంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే లక్నోలో చోటు చేసుకొంది. సహోద్యోగులు (colleagues) తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న తీరు, తనపై పాల్పడుతున్న వేధింపులను తట్టుకోలేక నాలుగంతస్థుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకొంది ఓ రైల్వే ఉద్యోగిని. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్ వర్క్‌గా పేరు గడించిన భారతీయ రైల్వేలో జరిగిన సంఘటన ఇది.
లక్నోలో రైల్వే క్లర్క్‌గా పనిచేస్తోన్న ఓ మహిళను.. గత కొంతకాలంగా ఆమె కార్యాలయంలోనే పనిచేస్తున్న ఇద్దరు సీనియర్లు, నలుగురు సహోద్యోగులు వేధిస్తున్నారు. రోజు రోజుకీ ఈ వేధింపులు తీవ్రతరం కావడంతో.. ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. బీహార్‌లోని నలందకు చెందిన ఆమె లక్నోలోని రైల్వే క్వార్టర్స్‌లో ఒంటరిగా నివసిస్తోంది. విధి నిర్వహణలో ఉన్న సమయంలో.. ఆమె సహోద్యోగులు కొందరు ఆమెను ఉద్దేశిస్తూ అసభ్యకరమైన పాటలు పాడటం, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చేసేవారు. హద్దులు మీరిన వీరి చేష్టలపై ఆమె.. తన పై అధికారికి ఫిర్యాదు చేసింది. దీని వల్ల ఆమెకు వేధింపులు మరింత పెరిగాయి.
ఆదివారం ఉదయం రక్తపు మడుగులో ఉన్న ఆమెను గుర్తించిన పొరుగు వ్యక్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. లైంగిక వేధింపులను భరించలేక గత కొన్ని రోజులుగా ఆమె ఆత్మహత్యకు పాల్పడాలనే యోచనలో ఉన్నట్టు పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే ఆమె రాసిన సూసైడ్ నోట్ మార్చి 28, 2019 తేదీతో ఉంది.
ఆమె ఈ ఉత్తరాన్ని ఆలంబాగ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు రాసింది. ఈ ఉత్తరంలో తన ఆత్మహత్యకు గల కారణంతో పాటు తనపై వేధింపులకు పాల్పడిన వారి వివరాలను సైతం తెలిపింది. ఈ లేఖను ఫోరెన్సిక్ నివేదిక కోసం పంపారు. ఆ నివేదికలో లేఖ రాసింది ఆమే అని తేలితే.. ఆమెపై వేధింపులకు పాల్పడినవారంతా కటకటాల వెనక్కి వెళతారని ఆలంబాగ్ సర్కిల్ ఆఫీసర్ తెలిపారు.
పని ప్రదేశాల్లో తమకెదురయ్యే లైంగిక వేధింపులను చాలామంది మహిళలు మౌనంగానే భరిస్తున్నారు. తమను వేధించే వారిపై ఫిర్యాదు చేయాలని ఉన్నప్పటికీ.. తమనే తప్పుపడతారనే ఉద్దేశంతో లేదా లైంగిక వేధింపులు మరింత ఎక్కువ అవుతాయనే భయంతోనో మిన్నకుండిపోతున్నారు.
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు గాను సుప్రీంకోర్టు నిర్దేశించిన విశాఖ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి కార్యాలయంలోనూ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ.. చాలా చోట్ల అలాంటి ప్రయత్నాలేమీ కనిపించడం లేదు. అన్ని కార్యాలయాల్లోనూ వాటిని ఏర్పాటు చేసి మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకొంటేనే తప్ప ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చేలా కనిపించడం లేదు.
Image: shutterstock
ఇవి కూడా చదవండి
అక్కడ పని చేయాలంటే.. గర్భసంచి తొలగించుకోవాల్సిందే: మహారాష్ట్రలో భూస్వాముల ఆకృత్యాలు..!
మహిళలకు కోపం తెప్పించిన మ్యానిఫెస్టో.. వ్యాకరణ దోషాలతో వచ్చిన చిక్కు..!
ఆ భయం ఇప్పుడు మహిళలను వేధించే వారిలో కనిపిస్తుంది.. కృతి సనన్
మీరు సోషల్ మీడియాలో రాక్ స్టార్ గా వెలుగిపోతున్నారా? అయితే Plixxo లో వెంటనే చేరిపోండి. ఇండియాలోనే అతి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నెట్వర్క్ లో చేరి టాప్ బ్రాండ్స్ తో కలసి పనిచేసే అవకాశం అందుకోండి.
Read More From #MeToo
డ్రెస్‌కోడ్‌కి వ్యతిరేకంగా పోరాడాం.. విజయం సాధించాం : సెయింట్ ఫ్రాన్సిస్ విద్యార్థినులు
Sandeep Thatla