ADVERTISEMENT
home / వినోదం
డియర్ కామ్రేడ్ మూవీ రివ్యూ – ప్రతి అమ్మాయికి ఒక ‘కామ్రేడ్’ అవసరం

డియర్ కామ్రేడ్ మూవీ రివ్యూ – ప్రతి అమ్మాయికి ఒక ‘కామ్రేడ్’ అవసరం

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమా చేస్తున్నాడు అంటే చాలు… అది కచ్చితంగా విషయం ఉన్న సినిమా అనే స్థాయికి తన పాపులారిటీని పెంచుకున్నాడు ఈ రౌడీ స్టార్. ఇక ఇప్పుడు తన సినిమా మార్కెట్ పెంచుకునే దిశగా.. దక్షిణాది భాషలన్నింటిలోనూ ‘డియర్ కామ్రేడ్’ (Dear Comrade) చిత్రాన్ని విడుదల చేసాడు విజయ్. అలా ఊరికే విడుదల చేయకుండా.. నాలుగు భాషల్లో ప్రేక్షకులని మెప్పించేందుకు అక్కడికి వెళ్ళి ‘డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్స్’ అంటూ ప్రచారం కూడా బాగానే చేశాడు.

డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్ లో హీరోగా చేయనున్నది ఎవరో తెలుసా…

మరి విజయ్ దేవరకొండ & రష్మిక మంధన (Rashmika Mandanna) పడిన కష్టానికి ఫలితం దక్కిందా లేదా అన్నది ఈ రోజు సినిమా చూసిన అనంతరం.. ప్రేక్షకులు ఇచ్చే తీర్పు పైనే ఆధారపడి ఉంటుంది.

కథ ఏంటంటే –

ADVERTISEMENT

బాబీ అలియాస్ చైతన్య (విజయ్ దేవరకొండ) కాకినాడలో ఒక విద్యార్థి నాయకుడు. తన స్నేహితులకి ఎటువంటి హాని జరిగినా చూస్తూ ఊరుకోడు. అదే సమయంలో చైతన్య పక్కింటికి హైదరాబాద్ నుండి స్టేట్ లెవల్ క్రికెట్ ప్లేయర్ లిల్లీ (రష్మిక మందాన్న) వస్తుంది. క్రమంగా వారిరువురి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే చైతన్యకి ఉండే మితిమీరిన కోపం కారణంగా లిల్లీ దూరమవుతుంది.

అలా విడిపోయిన వారు.. 3 ఏళ్ళ తరువాత మళ్ళీ కలవడం జరుగుతుంది. అయితే ఈ మూడేళ్ళలో లిల్లీ క్రికెట్‌కి దూరమవుతుంది. లిల్లీ తనకిష్టమైన క్రికెట్‌ని ఎందుకు వదులుకుంది? దానికి కారణం చైతన్య అని అనుకుంటున్నారా? లేదా ఇంకేదైనా కారణం ఉందా? ఈ ప్రశ్నలకి సమాధానం మీకు సినిమా చూస్తే తెలిసిపోతుంది.

ఇక ఈ డియర్ కామ్రేడ్ సినిమాలో మీకు ఆసక్తి కలిగించే 15 అంశాలను ఓ సారి చదివేయండి. ఈ 15 పాయింట్లు సినిమా కథ ఏంటనేది క్లుప్తంగా మనకు తెలియచేస్తాయి.

* చైతన్య అలియాస్ బాబీగా విజయ్ దేవరకొండ చేసిన పాత్ర

ADVERTISEMENT

* లిల్లీ అలియాస్ అపర్ణ దేవి అనే పాత్రలో మెరిసిన రష్మిక మంధన

* చైతన్య తాతయ్య పాత్ర

* ‘కామ్రేడ్’ ఫిలాసఫీ

* డిప్రెషన్‌కి ప్రకృతి కూడా ఒక చికిత్స అని చెప్పడం

ADVERTISEMENT

* జీవితంలో అనుకున్నది సాధించడానికి ఎంతవరకైనా వెళ్లడం..

* టీనేజ్‌లో తొందరపాటు వల్ల చేసిన తప్పులని.. ఆ తరువాత కాలంలో సరిద్దిదుకోవడం

* లైఫ్‌లో మన పక్కన ఉండే ఫ్రెండ్స్ అలియాస్ కామ్రేడ్స్ కోసం అండగా నిలబడడం

* జీవితంలో ఏదైనా అనుకున్నది దొరకక బాధపడడం కన్నా.. ఆ బాధకి దూరంగా వెళ్లి కొన్నాళ్ళు బ్రతకడం

ADVERTISEMENT

* మనం కన్న కలకి ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే ..వారిని ధైర్యంగా ఎదుర్కోగలగడం..

* సుజిత్ సారంగ్ అందించిన ఛాయాగ్రహణం (Cinematography)

* శ్రీజిత్ సారంగ్ ఈ చిత్రానికి చేసిన కలరింగ్.

* జస్టిన్ ప్రభాకరన్ అందించిన మ్యూజిక్ & బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

ADVERTISEMENT

* సినిమా క్లైమాక్స్‌లో లిల్లీ పాత్ర చెప్పే సంభాషణలు

* అన్నిటికీ మించి జీవితంలో ‘భయానికి’ చోటు ఉండకూడదు అని చెప్పడం. ఎందుకంటే మనం వెనకబడిపోవడానికి ‘భయం’ కన్నా పెద్ద కారణమేమి లేదు. అదే ఈ సినిమా క్యాప్షన్ కూడా – ఫైట్ ఫర్ వాట్ యు లవ్ (Fight For What You Love).

మీరు నన్ను భయపెట్టలేరు – ‘డియర్ కామ్రేడ్’లో విజయ్ దేవరకొండ  

ఈ 15 అంశాలు డియర్ కామ్రేడ్ చిత్రంలో మిమ్మల్ని కచ్చితంగా పలకరిస్తాయి. ఈ మధ్యకాలంలో ఆడవారి పై సమాజంలో జరుగుతున్న అకృత్యాల నేపథ్యంలో.. సినిమాలు రావడం ఒక రకంగా ఆహ్వానించ దగిన పరిణామమే. ఇటువంటి సున్నితమైన పాయింట్స్‌ని కథాంశాలుగా ఎంపిక చేసుకుని సినిమాలు తీసే ధైర్యాన్ని దర్శకులకి ఇస్తున్న హీరోలు, నిర్మాతలను మనం నిజంగా అభినందించి తీరాల్సిందే.

ADVERTISEMENT

సమాజంలో స్త్రీలకు తోడుగా ఉంటూ వారికి ఏదైనా కష్టం వస్తే వాటిని ఎదుర్కొనేందుకు తగిన ధైర్యం, భరోసా ఇవ్వడం ఎంతో ముఖ్యమని మనకి ఒక కమర్షియల్ చిత్రం ద్వారా తెలియజేశారు. ఈ ప్రయత్నాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన బిగ్ బెన్ ఫిలిమ్స్ యష్ రంగినేని, మైత్రీ మూవీ మేకర్స్ వారిని.. అలాగే హీరో విజయ్ దేవరకొండని మెచ్చుకోవాల్సిందే.

అయితే ఈ సినిమాని థియేటర్‌లో చూసినప్పుడు.. సినిమా నిడివి ప్రేక్షకుడిని ఒకింత ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు. దీని వల్ల సినిమా కమర్షియల్‌గా ఎంతటి విజయం అందుకుంటుందో చెప్పలేం. కానీ ఒక మంచి కథాంశంతో తెరకెక్కిన సినిమా అని మాత్రం చెప్పొచ్చు.

ఆఖరుగా.. డియర్ కామ్రేడ్ చిత్రం చూసిన తరువాత.. ప్రతి అమ్మాయి తన జీవితంలో ఒక కామ్రేడ్ ఉండాలి అని కోరుకుంటుంది అని మాత్రం చెప్పగలం.

#Metoo తమిళ నటి పై లైంగిక వేధింపులు.. విజయ్ దేవరకొండ చిత్రంలో ఛాన్స్ ఇస్తానన్న దర్శకుడు

ADVERTISEMENT
26 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT