ADVERTISEMENT
home / Finance
ఇన్‌స్టాగ్రామ్ రెజ్యుమెతో.. ఇంటర్వ్యూ లేకుండా జాబ్ సంపాదించేసింది..!

ఇన్‌స్టాగ్రామ్ రెజ్యుమెతో.. ఇంటర్వ్యూ లేకుండా జాబ్ సంపాదించేసింది..!

రెజ్యుమె (Resume).. ఏ అభ్యర్థి అయినా ఇంటర్వ్యూకి (Interview) ఎంపికవ్వాలంటే… ఇదే తొలి మెట్టు. మీ రెజ్యుమె‌ను బట్టే మీరు తమ సంస్థలో ఉద్యోగం చేయడానికి అర్హులా కాదా? అనే విషయాన్ని సంస్థలు నిర్ణయిస్తాయి. అందుకే ఉద్యోగం రావడానికి తొలి మెట్టు రెజ్యుమె అని చెప్పుకోవాలి. మీ రెజ్యుమె నచ్చితే.. హెచ్‌ఆర్ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి..  తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు. మీరు ఆ ఇంటర్వ్యూలో ఎంపికైతే ఉద్యోగం వస్తుంది. ఏ జాబ్ ఇంటర్వ్యూ అయినా.. ఈ తతంగం అంతా కంపల్సరీ. కానీ కేవలం ఒక రెజ్యుమెతోనే.. ఓ అమ్మాయి ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం సంపాదించిందంటే ఆశ్చర్యమే కదా.

Instagram

ADVERTISEMENT

Instagram

Instagram

ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా కూడా.. అభ్యర్థి బాగా టెన్షన్ పడేది, ఇబ్బంది పడేది ఇంటర్వ్యూ రౌండ్‌లోనే. కానీ 20 సంవత్సరాల అంకిత చౌలా ఇంటర్వ్యూ లేకుండా.. కేవలం రెజ్యుమెతోనే డెలాయిట్ ఉద్యోగం సంపాదించింది.  ఇలా జరగడానికి కారణమేంటో తెలుసా..? కాస్త సృజనాత్మకత చూపించి ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఆమె రెజ్యుమె తయారుచేయడమే.

ADVERTISEMENT

చాలామంది తమ రెజ్యుమెను లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేస్తుంటారు. కానీ అంకిత మాత్రం తన రెజ్యుమె తయారుచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఇన్నోవేటివ్ ఐడియా అందరికీ నచ్చడంతో.. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండానే డెలాయిట్ సంస్థ ఆమెకు ఉద్యోగం ఇచ్చేసింది. అసలు ఈ అమ్మాయికి ఇలాంటి సృజనాత్మకమైన ఆలోచన ఎలా వచ్చిందో తెలియాలంటే తన గురించి తెలుసుకోవాల్సిందే..

అంకితా చావ్లా ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఇరవై వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తన స్కిల్స్ గురించి అందరికీ తెలిసేలా.. బొమ్మల రూపంలో ఇన్‌స్టాగ్రామ్ రెజ్యుమె తయారు చేసి దాని కోసం ప్రత్యేకంగా అకౌంట్ క్రియేట్ చేసి ఆమె పోస్ట్ చేసింది. అది పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ కావడంతో.. డెలాయిట్ సంస్థ పిలిచి ఉద్యోగం ఇచ్చింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ…

“మా ఇంటర్న్‌షిప్స్ పూర్తి కాగానే.. మా స్నేహితులమంతా ఓసారి కలిశాం. అప్పుడు వారు తాము పనిచేయబోయే ఆఫీసుల గురించి మాట్లాడడంతో.. నాకు కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాను. ఎందుకంటే వాళ్లందరికీ కోర్స్ పూర్తి కాకముందే ప్లేస్‌మెంట్స్ వచ్చేశాయి. కానీ నాకు రాలేదు. ఆ తర్వాత కాలేజీలో ఓ బోరింగ్ పాఠం వింటూ.. ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఏదైనా కాస్త ప్రత్యేకంగా చేసి సంస్థలను ఆకర్షించాలనుకున్నా. అందుకే ఇలా ఇన్‌స్టాగ్రామ్ రెజ్యుమె తయారుచేశాను” అని చెప్పింది.

ADVERTISEMENT

instagram

ఈ రెజ్యుమె తయారుచేయడానికి ఐదు గంటల పాటు ఆలోచిస్తే.. ఐడియాను ఆచరణ రూపంలోకి తీసుకురావడానికి అరవై గంటలు పట్టిందట. ఈ రెజ్యుమేను అన్నింటిలా కాకుండా.. ప్రత్యేకంగా ప్రతి విషయాన్ని డీటెయిల్డ్‌గా రాసి డిజైన్ చేసింది. తన క్రియేటివ్ రెజ్యుమేను మీరూ ఓసారి చూసేయండి. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో ఆమె బయో చూస్తే అంకితా చావ్లా, విజువల్ కంటెంట్ క్రియేటర్, రైటర్.. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా.. అంటూ కనిపిస్తుంది. ఇదే కాదు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన అంకిత ఉద్యోగం సంపాదించడానికి కొన్ని రెజ్యుమె హాక్స్ కూడా వెల్లడించింది అవేంటంటే..

1. మీ రెజ్యుమెలో ఏం ఉండాలో ముందే నిర్ణయించుకోండి. దాని గురించి బాగా తెలిస్తేనే రాయండి

ADVERTISEMENT

instagram

2.మీ రెజ్యుమె మీ పర్సనాలిటీని చాటుతుంది. కాబట్టి అందులో ఉన్న సమాచారం మొత్తం నిజమైనదే అయి ఉండేలా చూసుకోండి.

Instagram

ADVERTISEMENT

3. మీరు చేసే ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్ మాత్రమే రాయండి. అంటే మీరు మార్కెటింగ్‌కి సంబంధించి ఉద్యోగానికి అప్లై చేస్తుంటే.. అందులో మీరు నేర్చుకున్న డిజైనింగ్ వివరాలు పొందుపర్చాల్సిన అవసరం లేదన్నమాట.

Instagram

4. మీ రెజ్యుమెను వీలైనంత చిన్నగా ఉండేలా చూసుకోవాలి. కానీ మీకున్న స్కిల్స్ గురించి మాత్రం పూర్తిగా వివరించడం మర్చిపోవద్దు.

ADVERTISEMENT

Instagram

5. మీకు బోర్ కొట్టే వరకూ మీ రెజ్యుమెను మళ్లీ మళ్లీ చదువుకోండి. తప్పులుంటే సరిదిద్దుకోండి.

ADVERTISEMENT

Instagram

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ఇవి కూడా చదవండి. 

ADVERTISEMENT

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

మీ అక్క కూడా అమ్మకు మరో రూపమా? అయితే ఈ మీమ్స్ మీ ఇద్దరి కోసమే..!

వాట్సాప్ వల్ల మీ ఫోన్ హ్యాక్ కాకుండా.. ఎలా కాపాడుకోవాలో మీకు తెలుసా?

01 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT