Advertisement

Entertainment

City Special : హైదరాబాద్‌లో చూడదగ్గ.. టాప్ 5 ప్రదేశాలు ఇవే..!

Sandeep ThatlaSandeep Thatla  |  Dec 17, 2019
City Special : హైదరాబాద్‌లో చూడదగ్గ.. టాప్ 5 ప్రదేశాలు ఇవే..!

City Special : Top 5 places to see in Hyderabad

మీరు మీ హాలీడేని హైదరాబాద్ నగరంలోని ముఖ్యమైన ప్రదేశాలలో గడపాలని భావిస్తున్నారా.. అయితే మీరు ఈ కథనాన్ని తప్పకుండా చదవాల్సిందే.

యాత్రికులను ఆకర్షించేందుకు.. హైదరాబాద్ టూరిజం సంస్థ వారు ఇప్పటికే అనేక ప్రత్యేకమైన ప్యాకేజీలను అందిస్తున్నారు. 

ఈ క్రమంలో మీరు మీ బడ్జెట్‌లో భాగ్యనగరంలో హాయిగా గడిపేందుకు వీలుగా .. ఓ 5 ప్రత్యేకమైన ప్రదేశాలను గురించి తెలియజేస్తున్నాం. అవేంటో తెలుసా ?

* ట్యాంక్ బండ్

* చార్మినార్

* నెక్లెస్ రోడ్

* హైటెక్ సిటీ చౌరస్తా

* గోల్కొండ కోట

ఇప్పుడు పైన పేర్కొన్న ప్రదేశాలలో  ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం…

హైదరాబాద్ & సికింద్రాబాద్ జంట నగరాలకు మణిహారంగా ఉన్న ట్యాంక్ బండ్ గురించి తెలియనివారుండరు. ఇక ట్యాంక్ బండ్ దగ్గర ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 తేదిన.. రాత్రి అనేక మంది ప్రజలు చేరుకొని కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకోవడం ఆనవాయితిగా వస్తున్నది. ఇక్కడ నుండి బుద్ధుని విగ్రహం కనపడుతుండగా.. చుట్టూ వందల మంది ప్రజల సాక్షిగా బాణాసంచా వెలుగుల మధ్యన న్యూ ఇయర్ వేడుకలు ఎంతో సరదాగా జరుపుకుంటూ ఉంటారు. 

హైదరాబాద్ ఫ్యాషన్ ట్రెండ్స్: మోడరన్ అమ్మాయిలకు ప్రత్యేకం.. ఈ టాప్ 10 డిజైనర్ బొతిక్స్..!

ఇక ఈ జాబితాలో ఉన్న రెండవ ప్రదేశం చార్మినార్. హైదరాబాద్ నగరం ప్రపంచపటంలో ఒక ప్రముఖ స్థానంలో ఉండడానికి గల కారణాలలో చార్మినార్ ఒకటి. హైదరాబాద్ నగరాన్ని చూడటానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా తప్పక సందర్శించే స్థలం చార్మినార్. ఇటువంటి చారిత్రిక కట్టడం ముందు మన కుటుంబంతో సహా.. ఇరానీ ఛాయ్ తాగుతూ & ఉస్మానియా బిస్కెట్ తింటూ హైదరాబాదీ స్టైల్‌లో హాలీడేని హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. 

నెక్లెస్ రోడ్డు కూడా ట్యాంక్ బండ్ దగ్గరలోనే ఉన్నప్పటికి.. ఇది ట్రాఫిక్ రణగొణుల మధ్య కాకుండా కొద్దిగా పక్కన ఉండే ప్రదేశమిది.  ఈ నెక్లెస్ రోడ్డులో కూడా డిసెంబర్ 31 రాత్రి జంటనగరాల్లో ఉండే ప్రజలు చాలామంది.. ఇక్కడికి చేరుకొని కేక్ కట్ చేస్తుంటారు. అలాగే మీ హాలీడేని ఎంజాయ్ చేయడానికి కూడా ఈ ప్రదేశం ఎంతో అనువైనది. 

అక్షింతలకు బదులుగా.. కరెన్సీ నోట్లను వాడారు: హైదరాబాద్ పెళ్లి వేడుకలో విడ్డూరం..!

ఇప్పటివరకు హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఉన్న ప్రదేశాల గురించి చెప్పుకుంటే.. ఇప్పడు చెప్పుకోబోయే స్థలం సైబరాబాద్‌కి గుండె కాయ లాంటి హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీ ఐకానిక్ బిల్డింగ్ ఉండే కూడలి వద్ద కూడా.. ప్రతి ఏడాది కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ ఎంతోమంది ప్రజలు ఇక్కడికి చేరుకుంటుంటారు. అలాగే ఈ సిటీకి దగ్గరగా మీ హాలీడేని హాయిగా గడపడం కోసం అనేక ప్రముఖ రెస్టారెంట్లు, హోటల్స్ ఉన్నాయి. 

హైదరాబాద్ లోని మొజాంజాహి మార్కెట్ గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు…

ఇక ఆఖరుగా పేర్కొనబోయే ప్రదేశం గోల్కొండ కోట. ఈ గోల్కొండ కోట కూడా హైదరాబాద్ సాంస్కృతికి అద్దంపట్టేలా ఉన్న ప్రదేశం. ఇది ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా & హైదరాబాద్ నగరం శివార్లలో ఉండే ప్రదేశమైనప్పటికి కూడా.. ఇప్పుడు పెరిగిపోయిన హైదరాబాద్ సిటి కారణంగా.. ఈ గోల్కొండ కోట దగ్గరకు చాలామంతి తమ హాలిడే నిమిత్తం వస్తుంటారు. ఇక ఇక్కడ కూడా కుటుంబసమేతంగా వచ్చి గోల్కొండ కోట సాక్షిగా.. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడం సర్వ సాధారణం

మీరు కూడా మీ హాలీడేని.. భాగ్యనగరంలో ఈ ప్రదేశాలను సందర్శించి హాయిగా గడిపేయండి.