Advertisement

Lifestyle

Top 6 Holiday Destinations: హాలీడే కోసం బ్రేక్ ఇస్తూ.. ఇక్కడ ఎంజాయ్ చేసేయండి

Sandeep ThatlaSandeep Thatla  |  Dec 20, 2019
Top 6 Holiday Destinations: హాలీడే కోసం బ్రేక్ ఇస్తూ..  ఇక్కడ ఎంజాయ్ చేసేయండి

Advertisement

ఆఫీసు పనికి కాస్త స్వస్తి చెప్పి.. కనీసం ఒక్క సారైనా సరదాగా సంవత్సరంలో ఒక వారం సెలవు (holiday) పెట్టి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలా ఆలోచించేవారి కోసమే ఈ కథనం ప్రత్యేకం

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ పార్టీ చేసుకోవాలంటే.. ఈ 15 బెస్ట్ స్పాట్స్‌‌కి వెళ్లాల్సిందే..!

అయితే సాధారణంగా రెండు మూడు నెలల సెలవు అంటే.. అది కచ్చితంగా విదేశీ విహారమే అయ్యి ఉంటుంది. మరి అంతలా కలలు గన్న ట్రిప్ రద్దయితే లేదా బడ్జెట్ సరిపోకపోతే.. దాని స్థానంలో వెళ్లే ప్రదేశానికి కూడా ఎంతో కొంత ప్రత్యేకత ఉంటుందని మర్చిపోవద్దు సుమా 

ఈ పైన పేర్కొన్న విషయాలని గమనంలో ఉంచుకుంటూ.. మేం వైవిధ్యమైన ఓ ఆరు ప్రదేశాల (places) గురించి సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. మరి మీరు కూడా ఒకసారి చూసి, మీకు అనువుగా ఉండే ఒక ప్రదేశాన్ని ఎంచుకోండి

గోవా

‘గోవా’ గురించి మనం ప్రత్యేకంగా చెప్పేదేముంది. అది పార్టీలకు పుట్టినిల్లు లాంటిది. ప్రపంచం నలుమూలల నుండి కూడా ఇక్కడికి ఎంతోమంది సేదతీరడానికి వస్తుంటారు. అలాగే ప్రతి ఏడాది ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి వచ్చే పర్యాటకుల కోసం.. ఎన్నో రకాల ఈవెంట్స్ సిద్ధం చేసి పెడుతుంటారు ఇక్కడి నిర్వాహకులు. అలాగే హాలీడేకి వచ్చే ఆలుమగలకు కూడా మంచి ప్యాకేజీలు గోవాలో అందుబాటులో ఉన్నాయి సుమా.

పాండిచ్చేరి

ఇది కూడా దాదాపు గోవా లాంటి ఫీలింగ్ కలిగించే ప్రదేశం. ఎక్కువగా తమ దైనందిన జీవితం నుండి కాస్త విశ్రాంతి పొందేందుకు ఇక్కడికి చాలామంది వస్తుంటారు. పైగా ఇక్కడ పార్టీలు చేసుకోవడానికి అనువైన వసతులు కూడా ఉన్నాయి. ఎక్కువగా బ్యాచిలర్స్ తమ ట్రిప్ కోసం పాండిచ్చేరికి వేస్తుంటారు అనేది తెలిసిన విషయమే. మీకు ఈ ప్రదేశం హాలీడేకి అనువుగా ఉంటుంది.

కొత్త సంవత్సరం వచ్చేస్తున్న వేళ.. మీరూ కొత్త నిర్ణయాలు తీసేసుకోండి..!

మనాలి

‘మంచు కురిసే వేళలో’ అనే పాటకి ఎంతమందైతే అభిమానులుంటారో.. అదే స్థాయిలో మంచు కురిసే సమయంలో ప్రత్యక్షంగా దానిని చూడాలని అనుకునేవారు కూడా ఉంటారు. అయితే మనాలి ప్రాంతంలో చలికాలంలో ఎక్కువగా మంచు కురుస్తుంటుంది. మరి మంచు కురిసే సమయంలో.. మనాలి లాంటి ప్రదేశంలో ఉంటూ.. హాలీడేని గడపడం ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో మాటల్లో చెప్పలేము కదా.. అందుకే మనాలి ట్రిప్‌ను కూడా మీ లిస్టులో జత చేయండి. 

ఉదయ్ పూర్

ఉదయ్ పూర్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది కోటలు.. అలాగే ఆనాటి చక్రవర్తుల రాజసం. ఎందుకంటే ఈ ఉదయ్ పూర్‌లో ఎక్కడ చూసినా సరే.. అప్పటి రాజుల వైభవం & వాళ్ళ దర్పానికి అద్దం పట్టే కట్టడాలు కనిపిస్తాయి. అందుకే ఈ నగరాన్ని చూస్తే మన దేశాన్ని పాలించిన రాజుల రాజసం ఇట్టే తెలుస్తుందని అంటుంటారు. అటువంటి ఈ నగరంలో విహరిస్తూ మీ హాలీడే సెలబ్రేషన్స్ రాయల్‌గా చేసుకుంటే వచ్చే ఆ కిక్కే వేరులే! మరి ఏమంటారు… ఉదయ్ పూర్‌కి టికెట్ బుక్ చేసేసుకుంటారా?!

అలెప్పి

ఒక రాత్రి మొత్తం పడవనే మన ఇల్లులా భావిస్తూ గడిపితే వచ్చే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది కదూ. మరి అలాంటిది మీ హాలీడేని కేరళ బ్యాక్ వాటర్స్‌లో నిలిపి ఉన్న బోటులో కూర్చుని స్వాగతం పలకడంలో ఉన్న రొమాంటిక్ ఫీలింగ్.. మరింకెక్కడా రాదు. మీరు కూడా మేము చెప్పినదానితో ఏకీభవిస్తే.. అలెప్పికి వెళ్లేందుకు సిద్ధమవ్వండి.

అండమాన్ & నికోబార్ ఐలాండ్స్

బీచ్ పార్టీలు, స్కూబా డైవింగ్స్ & డీప్ సి డైవింగ్స్ వంటి వాటిని ఆస్వాదిస్తూ.. మీ హాలీడేకి కాస్త వైవిధ్యంగా & సాహసోపేతంగా స్వాగతం పలకాలనుకుంటే మాత్రం అండమాన్ & నికోబార్ ఐలాండ్స్ మీకు సరైన ప్రదేశం. ఇక్కడికి వెళితే మీకు విదేశాలకు వెళ్లిన అనుభూతి అయితే తప్పక కలుగుతుంది. ఇందులో అనుమానమేమి లేదు.

మీరు ముందుగా అనుకున్న హాలీడే ప్లాన్ రద్దయి బాధపడుతుంటే.. ఆఖరి నిమిషంలో (last minute) ఈ 6 ప్రదేశాల్లో ఏదో ఒక దానికి వెళ్లి.. ఆ ఫీలింగ్ నుండి ఇట్టే బయటపడవచ్చు.

న్యూ ఇయర్ గిఫ్ట్స్ ఇవ్వాలని భావిస్తున్నారా.. అయితే ఈ సైట్ సందర్శించాల్సిందే