ADVERTISEMENT
home / Celebrity Life
దానికి చాలా ధైర్యం కావాలి.. నేను చేయలేను : అనసూయ

దానికి చాలా ధైర్యం కావాలి.. నేను చేయలేను : అనసూయ

అనసూయ (anasuya).. బుల్లితెర యాంకర్‌గానే కాదు.. వెండితెరపై అప్పుడప్పుడూ మెరుస్తూ.. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి. సాధారణంగా పెళ్లయ్యాక హీరోయిన్ల కెరీర్ ఆగిపోతుందని చాలామంది భావిస్తారు. కానీ అనసూయ మాత్రం అది అస్సలు నిజం కాదని నిరూపిస్తోంది. పెళ్లయ్యాక తన కెరీర్ ప్రారంభించిన అనసూయ.. ఇద్దరు పిల్లలు పుట్టినా.. వరుస ఆఫర్లతో తన కెరీర్‌ని అద్భుతంగా కొనసాగిస్తోంది. తాజాగా అనసూయ నటించిన కథనం సినిమా ఈ నెల 9న విడుదలైంది. ఈ సినిమాలో తన నటనకుగానూ.. అనసూయ మంచి మార్కులే సాధించింది. సినిమా విడుదల సందర్భంగా ఇంటర్వ్యూల్లో భాగంగా మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకుంది అనసూయ.

అందుకే తొందరగా పెళ్లి చేసుకున్నా: అనుష్క శర్మ

Instagram

ADVERTISEMENT

ఎంబీయే పూర్తి చేసి ఉద్యోగం చేస్తుండగా ఓ ప్రకటనలో నటించాను. అది చూసి చాలా సినిమాల్లో ఆఫర్లొచ్చాయి. కానీ మా అమ్మానాన్నలు ఒప్పుకోకపోవడంతో నటించలేకపోయాను. మా నాన్నకు ఇష్టమైన పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ఓ ఛానల్‌లో.. న్యూస్ ప్రజెంటర్‌గా నా కెరీర్ ప్రారంభించా. ఆ తర్వాత మా ఆయన భరద్వాజ్ సహకారంతో దాన్ని కొనసాగించా. క్రమంగా సినిమాల్లోనూ అడుగుపెట్టాను.

క్షణం, రంగస్థలం నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ సినిమాల్లో నటించిన తర్వాత చాలా ఆఫర్లొచ్చాయి. 13 దాకా కథలు విన్నా. కానీ కథలు నచ్చకపోవడం.. కొత్త ప్రొడక్షన్ కంపెనీలు కాబట్టి సినిమా పూర్తవుతుందో.. లేదో అన్న అనుమానం ఉండడంతో వాటిలో నటించలేదు. సినిమా కోసం ఎంతో కష్టపడతాం. దానికి తగిన ఫలితం రాకపోతే ఎంతో బాధపడతాను.

Instagram

ADVERTISEMENT

నేను ఇండస్ట్రీకి హీరోయిన్ కావాలనే ఆశతో రాలేదు. లీడ్ రోల్ చేసే అవకాశం దొరుకుతుందని అనుకోలేదు. పైగా అదో పెద్ద బాధ్యత కూడా. రంగస్థలంలో నాది అంత పెద్ద పాత్ర అని నాకు తెలీదు. కేవలం సుకుమార్ గారు చెప్పారని ఒప్పుకున్నా. ఆయన చెప్పింది చేశా. ఇప్పుడు ఈ “కథనం” సినిమాకీ అలాగే చేశాను. నా పాత్ర నిడివి గురించి ఆలోచించి టెన్షన్ పడను. ఈ సినిమా దర్శకుడు రాజేష్ నాదెండ్లకి ఇది మొదటి సినిమా. అయినా సరే చక్కగా తీశాడు. ఈ పాత్ర నా కోసమే రూపొందిందేమో అన్నంతగా ఇందులో లీనమైపోయా. ఇందులో నేనో అసిస్టెంట్ డైరెక్టర్. దర్శకురాలిని కావాలనే కోరికతో ఓ కథ రాసుకొని.. నిర్మాతల చుట్టూ తిరుగుతూ ఉంటాను. అచ్చం నేను రాసుకున్న కథలాగే రెండు హత్యలు జరుగుతాయి. ఆ హత్యల విచారణ.. ఆ తర్వాత జరిగిన సంఘటనలే ఈ సినిమా.

Instagram

వయసు ఎంతైనా ఫర్వాలేదు.. అలాంటివాడినే పెళ్లి చేసుకుంటా : రష్మిక

ADVERTISEMENT

నాకు బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. కానీ నా కుటుంబం అంటే నాకెంతో ప్రాణం. మా అమ్మానాన్న, నా భర్త, పిల్లలు.. వీరిని చూడకుండా అన్ని రోజులు నేను ఉండలేను. నా కుటుంబం నా వీక్‌నెస్. ముఖ్యంగా నా పిల్లలను వదిలి నేను ఎక్కడికీ వెళ్లలేను. షూటింగ్ గ్యాప్‌లోనే.. వారితో కనీసం ఒకటి రెండు సార్లు వీడియో కాల్‌లో మాట్లాడతాను. అలాంటిది అన్ని రోజులు వారిని చూడకుండా, వారితో మాట్లాడకుండా ఉండడం అంటే.. నా వల్ల కాదని ఆ షోకి వెళ్లలేదు.

చాలామంది నా కుటుంబం గురించి బయటకు చెప్పకుండా ఉంటే.. నాకు చాలా పాపులారిటీ వస్తుంది కదా అంటుంటారు. కానీ నా కుటుంబం నా బలం. నా బలహీనత. వాళ్లు లేకుండా నేను లేను. మాది ప్రేమ వివాహం. తొమ్మిదేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. అందుకేనేమో.. “నాకు పెళ్లయింది.. పిల్లలున్నారు” అని చెప్పుకోవడానికి నేనెప్పుడూ సిగ్గుపడను. నన్ను అలా చూసి ఒప్పుకునేవారే నాకు ఆఫర్లు అందిస్తారు. నేను అలాంటివారితోనే పనిచేస్తాను.

Instagram

ADVERTISEMENT

నా దుస్తులు, నా వ్యక్తిత్వం గురించి మాట్లాడేవారిని చూసి మొదట్లో నేను చాలా బాధపడేదాన్ని. ఒకసారి ఆర్జీవీ గారి గురించి.. నా గురించి తప్పుగా రాసినప్పుడు నేను చాలా బాధపడ్డా. ఏడ్చాను కూడా. కానీ మా ఇంట్లో వాళ్ల సహకారం వల్ల వాటి గురించి పట్టించుకోవడం మానేశాను.

నా దుస్తులు గురించి చాలామంది కామెంట్లు చేస్తుంటారు. మీ పిల్లలకు ఏం నేర్పిస్తున్నావు అని అడుగుతారు. వాళ్లందరికీ నేను చెప్పాలనుకునేది ఒకటే. “నా పిల్లలకు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని తప్ప ఇంకెవరినీ ఆ భావనతో చూడకూడదు.. అమ్మాయిలను గౌరవించాలని… దానికి దుస్తులు, వయసు.. ఇలా ఏ విషయాలతో సంబంధం లేదని నేర్పిస్తాను”.

అమ్మాయిలను గౌరవించడం అనేది ఇంటి నుండే మొదలవుతుందని నా ఉద్ధేశం. అందుకే ఎలాంటి దుస్తులు వేసుకున్నవారినైనా గౌరవించాలని వారికి నేర్పుతాను. నా సోషల్ మీడియా అకౌంట్లలో.. అలా నాకు నచ్చని కామెంట్లు ఎవరైనా చేస్తే వారిని బ్లాక్ చేసేస్తాను.. అంటూ వివరించింది అనసూయ.

ADVERTISEMENT

Instagram

ఆ దెబ్బతో ఆరు నెలలు గతం మర్చిపోయా: దిశా పటానీ

అంతే కాదు.. తన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. “భవిష్యత్తులో నేను నిర్మాతగా మారాలనుకుంటున్నా. దర్శకత్వం చేయడానికి చాలా ధైర్యం కావాలని మా సినిమా దర్శకుడు రాజేష్‌ని చూసి అర్థం చేసుకున్నా. నాకు అంత ధైర్యం లేదు కాబట్టి నేను నిర్మాతగా మాత్రమే మారాలనుకుంటున్నా. సినిమాలు కాదు కానీ టీవీ షోలు నిర్మించే ఆలోచన ఉంది. కానీ అలా మారేందుకు కనీసం మరో పదేళ్లపాటు సమయం తీసుకుంటా..” అని వివరించింది అనసూయ.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

14 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT