వయసు ఎంతైనా ఫర్వాలేదు.. అలాంటివాడినే పెళ్లి చేసుకుంటా : రష్మిక

వయసు ఎంతైనా ఫర్వాలేదు.. అలాంటివాడినే పెళ్లి చేసుకుంటా : రష్మిక

రష్మిక మంధన (Rashmika mandanna).. ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ గురించి అప్పట్లో ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఇండస్ట్రీలో మిగిలిన కథానాయికల్లా ఒకటీ, రెండు సినిమాలు చేస్తుందేమో అనుకున్నారు. కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన గీత గోవిందం సినిమా ఒక్కటి హిట్ కావడంతో ఈ అమ్మడు నటన గురించి అందరికీ తెలిసింది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోందీ అందాల తార. ప్రస్తుతం రష్మిక, విజయ్ దేవర కొండ సరసన నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం నాలుగు భాషల్లో విడుదల కాబోతోంది.

దీంతో పాటు కన్నడంలో పొగరు, తమిళంలో కార్తీ నటించనున్న సినిమాల్లో కథానాయికగా ఎంపికైంది. నితిన్ హీరోగా నటిస్తున్న భీష్మ చిత్రంతో పాటు మహేష్ బాబు సరిలేరు నీకెవరు, అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించనున్న 20వ సినిమాలోనూ రష్మిక కథానాయిక. ఈ పరుగు ఇలాగే సాగితే కొన్ని రోజులకు రష్మిక టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా మారడం ఖాయం అంటున్నారు చాలామంది.

Instagram

ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఈ నెల 26న విడుదలకు సిద్ధంగా ఉంది. భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాలో రష్మిక స్టేట్ లెవల్ క్రికెట్ ప్లేయర్‌గా కనిపించింది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నాడట. ఈ సినిమాతో దక్షిణాది భాషలన్నింటిలోనూ మంచి పేరు సాధించేందుకు సిద్ధమైంది రష్మిక. ఈ సినిమా కోసం ప్రమోషన్లలో పాల్గొంటూ వస్తోంది బ్యూటీ. ఈ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి, తనకు కాబోయే వాడి (Future husband) గురించి మాట్లాడిదంట రష్మిక.

Instagram
పుట్టిన రోజు నాడు.. ర‌ష్మిక ఎందుకు అలిగిందో మీకు తెలుసా..?

ఇండియా గ్లిట్జ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయట పెట్టిన రష్మిక.. "నాకు కాబోయే వాడు ఇంట్రోవర్టా? ఎక్స్ట్రోవర్టా? అన్న విషయం నాకు అవసరం లేదు. కానీ తన మనసు మంచిదై ఉండాలి. తనలో నిజం చెప్పే తత్వం, నిజాయతీ ఉండాలి. తన ప్రవర్తన నాకు నచ్చాలి. తనతో కలిసి ఉండడాన్ని నేను ఇష్టపడాలి. ఎప్పుడెప్పుడు తనతో సమయం గడుపుతానా? అని తను వేచి చూడాలి.

నేను తనతో సమయం గడిపేందుకు వేచి చూడాల్సిన అవసరం ఉండకూడదు. నాతో గడిపేందుకు తన దగ్గర కాస్తయినా ఫ్రీ టైం ఉండాలి. అంతేకాదు.. తను చాలా రొమాంటిక్‌గా ఉండాలి. అలాంటి వ్యక్తి వయసులో పెద్దవాడైనా.. చిన్నవాడైనా నేను వయసు గురించి పెద్దగా పట్టించుకోను. తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అంటోందీ భామ.

అంతేకాదు.. ధూమపానం చేసేవాళ్లంటే రష్మికకు అస్సలు ఇష్టం ఉండదట. సిగరెట్ తాగేవాళ్లు నా చుట్టూ ఉండడం కూడా నేను ఇష్టపడను. ఆ వాసనే నేను భరించలేను. అప్పుడప్పుడూ ఆల్కహాల్ తీసుకునేవాళ్లైతే ఫర్వాలేదు. కానీ ఆల్కహాలిజం (ఎక్కువగా తాగడం) నాకు ఇష్టం ఉండదు. నాకు కాబోయే భర్తకు ఈ అలవాట్లు ఉండకూడదు" అంటూ తన మనసులోని మాటలను బయటపెట్టింది.

మహేష్ బాబు vs అక్కినేని అఖిల్.. ఈ ఇద్దరిలో రష్మిక ఓటు ఎవరికి?

తన మొదటి సినిమా కిరిక్ పార్టీ కథానాయకుడు రక్షిత్ శెట్టిని ప్రేమించిన రష్మిక.. 2017లో అతడితో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. కేవలం తన స్నేహితులు, దగ్గరి బంధువుల సమక్షంలో జరిగిన ఈ ఎంగేజ్ మెంట్ వేడుక అప్పట్లో అందరినీ ఆశ్చర్యపర్చింది. కెరీర్ ప్రారంభంలోనే రష్మిక ఎంగేజ్‌మెంట్ చేసుకోవడాన్ని చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే ఆ తర్వాత 2018 సెప్టెంబర్‌లో తామిద్దరం విడిపోయామని ఈ జంట ప్రకటించింది.

రష్మిక కథల ఎంపికలో రక్షిత్ జోక్యం చేసుకుంటున్నాడని.. ఇతర హీరోలతో సన్నిహితంగా ఉండడం.. తెరపై ముద్దు సన్నివేశాల్లో కనిపించడం వంటివి తనకు నచ్చకపోవడం వల్ల గొడవలు జరిగి ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ తమ ప్రొఫెషనల్ జీవితంపై ఫోకస్ పెట్టారు. రక్షిత్ కన్నడ సినిమాల్లో నటిస్తుండగా.. రష్మిక కన్నడంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ నటిస్తోంది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

అలాంటి సినిమాలు నేను చేయను.. పాత్రల విషయంలో పక్కాగా ఉంటా: రష్మిక