ADVERTISEMENT
home / వినోదం
నన్ను ఒక వేశ్యగా చూసారు :  తన మనసులోని బాధను బయటపెట్టిన నటి కల్కి కొచ్లిన్

నన్ను ఒక వేశ్యగా చూసారు : తన మనసులోని బాధను బయటపెట్టిన నటి కల్కి కొచ్లిన్

(Actress Kalki Koechlin Reveals That She Was Called A ‘Russian Prostitute’ After Dev D)

గత కొంతకాలంగా మన దేశంలోనే కాకుండా.. ప్రపంచ చిత్రపరిశ్రమలన్నిటిలోనూ వినిపిస్తున్న ఏకైక మాట #MeToo .. ఎందరో నటీమణులు తాము చిత్రపరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు లేదా నిలదొక్కుకొనే  క్రమంలో దర్శకులు లేదా ఇతర సెలబ్రిటీల నుండి ఎదుర్కొన్న మానసిక, శారీరక హింసని ఇలా #MeToo పేరిట  బయటపెట్టడం జరిగింది. 

దీపిక ప‌దుకొణే ‘ఛపాక్’ చిత్రం ఎందుకు చూడాలంటే ..?

రెండేళ్ల క్రితం మొదలైన ఈ #MeToo ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్యాంపెయిన్ ద్వారా ఎందరో మహిళలు తమకి ఎదురైన చేదు సంఘటనల గూర్చి బహిర్గతం చేశారు. అందుకు కారణమైన వారి గురించి కూడా మీడియాకి తెలిపారు. ఈ క్రమంలో సదరు వ్యక్తులకి శిక్షలు పడడం లేదా బహిష్కరణకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. 

ADVERTISEMENT

తాజాగా హిందీ నటి  కల్కి కొచ్లిన్  ఒక సందర్భంలో మాట్లాడుతూ.. “నేను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో  ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నాను.  హిందీలో నేను నటించిన తొలి చిత్రం ‘దేవ్ డీ’లో వేశ్య పాత్రలో నటించగా.. అందరూ నన్ను రష్యా నుండి తీసుకువచ్చిన ఒక వేశ్య‌గా భావించారు. కొందరైతే నాతోనే నేరుగా ‘నువ్వొక రష్యన్ వేశ్య  కదా’ అంటూ మాట్లాడడం నన్ను ఎంతగానో కలచివేసింది”  అని ఆమె తెలిపింది. 

తరువాత కొన్ని హిట్ చిత్రాల్లో నటించిన తరువాత.. ఓ నిర్మాత ఆమెకు ఇష్టం లేకపోయినా సరే.. కల్కితో కలిసి సన్నిహితంగా ఉండేందుకు  ప్రయత్నాలు చేశాడట. ఒకరోజైతే తనతో డేట్‌కి వస్తావా? అని ఆయన అడిగితే.. అందుకు ఆమె నిరాకరించిన నేపథ్యంలో.. తనకి రావాల్సిన అవకాశాలని తన పలుకుబడితో అడ్డుకున్నాడని తెలిసి కల్కి వాపోయిందట.

హిందీ పరిశ్రమలో ఇలాంటి కాస్టింగ్ కౌచ్ ఉదంతాలు జరుగుతున్న క్రమంలో.. కల్కికి ఓ హాలీవుడ్ సినిమాలో అవకాశం వచ్చిందట. అయితే ఆ పరిశ్రమ కూడా ఇలాంటి విషయాలలో తక్కువ తినలేదని.. అక్కడ ఒక క్యాస్టింగ్ ఏజెంట్ తన శరీరాకృతి గురించి.. మరీ ముఖ్యంగా తన కళ్ళ క్రింద ఏర్పడిన వలయాల గురించి కూడా అనుచితంగా మాట్లాడి తనని మానసికంగా క్రుంగిపోయేలా చేశాడని.. తన మనసులోని బాధని బయటకి వెలిబుచ్చింది కల్కి.

మై విలేజ్ షో ఫేమ్ “గంగవ్వ” గురించి.. ఎవ్వరికి తెలియని 10 ఆసక్తికర విషయాలు

ADVERTISEMENT

ప్రస్తుతం సినిమాల నుండి కాస్త విరామం తీసుకున్న కల్కి.. ఎక్కువగా విదేశాలలో గడుపుతోంది. దీనికి కారణం ఆమె గర్భవతి కావడమే. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో ప్రేమలో పడి.. ఆ తరువాత వివాహ బంధంలోకి అడుగుపెట్టింది కల్కి. అయితే వీరిద్దరూ కొంతకాలానికి పరస్పర అంగీకారంతో విడిపోవడం జరిగింది. అలా ఆమె  తొలిప్రేమ కథ మూణ్ణాళ్ళ ముచ్చటగానే ముగిసిందని చెప్పవచ్చు.

ఆ తరువాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని.. ఆ తర్వాత మళ్లీ  సినిమాలు చేస్తున్న క్రమంలో కల్కి జీవితంలోకి అడుగు పెట్టిన వ్యక్తే గయ్ హెర్షబెర్గ్. ఇక ఇప్పుడు ఆమె తన బాయ్ ఫ్రెండ్ గయ్ హెర్షబెర్గ్‌తో కలిసి.. ఓ బిడ్డకు జన్మినివ్వబోతోంది. తాజాగా కల్కి తన తొమ్మిది నెలల గర్భంతో.. ఒక ఫోటో షూట్‌లో పాల్గొని అందరి చేత శభాష్ అనిపించుకుంది. 

ఇప్పుడు అంతర్జాలంలో ఎక్కడ చూసినా కూడా కల్కి ఫోటో షూట్‌కి సంబంధించిన ఫోటోలే దర్శనమిస్తున్నాయి. ఈమధ్యకాలంలో ఇటువంటి ఫోటో షూట్స్ కూడా ఒక ట్రెండ్‌గా మారాయి. కొన్ని రోజుల క్రితం నటి సమీరా రెడ్డి కూడా స్విమ్మింగ్ పూల్‌లో నిండు గర్భంతో ఫోజులిస్తూ.. ఫోటో షూట్‌లో పాల్గొని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు కల్కి కూడా ఆమెనే ఫాలో కావడం గమనార్హం.

ఆకాశ మేఘాల్లో విందు ఆరగించాలని ఉందా..? అయితే హైదరాబాద్‌లో ‘క్లౌడ్ డైనింగ్’ ట్రై చేసేయండి

ADVERTISEMENT
24 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT