‘ఇది బిగ్ బాస్ హౌస్.. ఇక్కడ ఏమైనా జరగొచ్చు’ అనే క్యాప్షన్ కి సరిగ్గా సరిపోయే పరిణామం ఒకటి నిన్న జరిగిన నామినేషన్స్ టాస్క్ లో స్పష్టంగా కనిపించింది. అదేంటంటే – చేతివరకు వచ్చిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే టికెట్ (bigg boss grand finale ticket) ని తన ఆట తీరుతో అలీ పాడు చేసుకోగా.. అతని తరువాత స్థానంలో ఉన్న రాహుల్ సిప్లిగంజ్ (rahul sipligunj) కి టికెట్ దక్కింది. ఒక రకంగా రాహుల్ కి ఈ టికెట్ రావడానికి అలీ మార్గం సుగమం చేసినట్లయింది.
Bigg Boss Telugu 3: కుండ బద్దలు కొట్టి నిజాలు చెప్పిన.. బిగ్ బాస్ ఇంటి సభ్యులు ..!
అసలేం జరిగిందంటే – బాబా భాస్కర్ & అలీ రెజా (ali reza) ల మధ్య జరిగిన టాస్క్ లో వీరిద్దరూ టాస్క్ ఆడడం తక్కువ.. ఒకరితో మరొకరు బాహాబాహీకి దిగడం ఎక్కువ జరిగింది. ఈ తరుణంలో బిగ్ బాస్ ఇరువురికి టాస్క్ సరిగా ఆడమని & టాస్క్ తప్పించి ఎటువంటి హింసకి తావివ్వకూడదని ఒకసారి హెచ్చరించడం జరిగింది. పైగా బిగ్ బాస్ హౌస్ లో హింసకి పాల్పడితే వారిని ఆ క్షణమే బిగ్ బాస్ హౌస్ నుండి వారిని బయటకి పంపించేస్తామని కూడా బిగ్ బాస్ ప్రకటించారు.
ఆ తరువాత ఇద్దరూ టాస్క్ ఆడుతున్న తరుణం మళ్ళీ అలీ రెజా తనకున్న బలం అంతా ఉపయోగించి తలతో బాబా భాస్కర్ ని తోసెయ్యడంతో ఈ టాస్క్ ని రద్దు చేస్తున్నట్టుగా బిగ్ బాస్ ప్రకటించారు. అలా ప్రకటించడమే కాకుండా బిగ్ బాస్ చెప్పిన తరువాత కూడా అలీ రెజా నిబంధనలను అతిక్రమించడం వల్ల అతడిని టికెట్ టు గ్రాండ్ ఫినాలే నుండి తప్పిస్తున్నట్టుగా ప్రకటించారు.
దీనితో ఒక్క టాస్క్ గెలిస్తే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే టికెట్ ని సొంతం చేసుకుంటాడు అని అందరు అనుకున్న అలీ రెజా.. ఒక్కసారిగా ఏకంగా టాస్క్ నుండే బయటకిరావడం అతనితో పాటు చూసేవారిని కూడా షాక్ కి గురి చేసింది. ఈ పరిణామంతో సహజంగానే అలీ రెజా తరువాత స్థానంలో ఉన్న రాహుల్ సిప్లిగంజ్ కి గ్రాండ్ ఫినాలే కి నేరుగా వెళ్ళడానికి మార్గం సుగమమైంది.
ఈ తరుణంలో శ్రీముఖితో ఒక టాస్క్ ఆడే అవకాశం రాగ.. దానిని రాహుల్ సిప్లిగంజ్ సద్వినియోగం చేసుకోవడంతో ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 3కి సంబంధించి మొదటగా టాప్ 5కి వెళ్లిన కంటెస్టెంట్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. దీనితో ఆయన తప్పించి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అయిదుగురు సభ్యులు ఈ వారం నామినేట్ అయ్యారు. ఈ టాస్క్ లో భాగంగా రాహుల్, శ్రీముఖిలిద్దరూ ఇంటి గార్డెన్ ఏరియాలో డామినోస్ ని పరిచి ఉంచాలి. గాలి ఎక్కువగా ఉండడంతో అవి కింద పడిపోతున్నా ఇద్దరూ వాటిని తిరిగి పెడుతూనే ఉన్నారు. బజర్ మోగే సమయానికి రాహుల్ డామినోస్ ఎక్కువగా ఉండడంతో అతడే విజేతగా నిలిచాడు.
రాహుల్ సిప్లిగంజ్ ని సున్నితంగా మందలించిన శ్రీముఖి తల్లి లత!
ఇక ఈ నామినేషన్స్ టాస్క్ ముగిశాక… అలీ రెజా మాట్లాడుతూ – అనవసరంగా నా ప్రవర్తన వల్ల ఇలా జరిగింది. నా చేతుల్లో ఉన్నది నేను పాడు చేసుకున్నాను కాబట్టి.. దయచేసి ప్రేక్షకులు మీరే నన్ను కాపాడాలి అంటూ అందరిని తనకి ఓటు వెయ్యాలని కోరాడు.
ఏదేమైనా.. ఈ సీజన్ కి సంబందించి టాప్ 5 లో ఎవరు ఉండబోతున్నారు అనే విషయంలో ఒక్కరి గురించి క్లారిటీ లభించింది. ఫైనల్ రేస్ లో ఉన్న వ్యక్తుల్లో రాహుల్ సిప్లిగంజ్ పేరు కన్ఫర్మ్ అయింది. ఇక ఇప్పుడున్న అయిదుగురులో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయి మిగిలిన నలుగురు ఆఖరి వారంలోకి వెళతారు. ప్రస్తుతం ఉన్న ఐదుగురిలో శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్ లకు ఫైనల్స్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండగా.. ఎలిమినేషన్ పోరు అలీ రెజా, శివ జ్యోతి ల మధ్య ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారా? లేదా అనుకోని విధంగా మిగిలిన ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారా? అన్నది వేచి చూడాల్సిన విషయం.
మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో ఒక ప్రణాళిక లేకుండా గేమ్ ఆడితే అలీ రెజాలా చేతికందిన అవకాశం చేజార్చుకున్నట్లవుతుంది అని అర్ధమైంది.
Bigg Boss Telugu 3: రాహుల్ సిప్లిగంజ్ & శ్రీముఖి ల మధ్య పెరుగుతున్న వైరం