Bigg Boss Telugu 3: రాహుల్ సిప్లిగంజ్ & శ్రీముఖి ల మధ్య పెరుగుతున్న వైరం

Bigg Boss Telugu 3: రాహుల్ సిప్లిగంజ్ & శ్రీముఖి ల మధ్య పెరుగుతున్న వైరం

బిగ్ బాస్ తెలుగు (bigg boss telugu) సీజన్ 3లో భాగంగా 13వ వారం కూడా పూర్తవబోతోంది. రేపటితో ఈ వారం కూడా అయిపోయి.. ప్రస్తుతం ఇంటిలో ఉన్న ఏడుగురు సభ్యులలో నుండి ఒకరు ఎలిమినేట్ అయి బిగ్ బాస్ ఇంటిసభ్యుల సంఖ్య 6 కి చేరుకుంటుంది. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ లాంటింది ఏమైనా అమలు చేస్తే ఆ సంఖ్య ఐదు కి కూడా చేరవచ్చు. 

రాహుల్ సిప్లిగంజ్ ని సున్నితంగా మందలించిన శ్రీముఖి తల్లి లత!

ఇక మొన్న హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు రావడం.. వారు వచ్చి చెప్పినదాని బట్టి బిగ్ బాస్ ఇంటిలో పెను మార్పులు జరుగుతాయి అని ఊహించినట్టుగానే పరిణామాలు జరుగుతున్నాయి. ప్రధానంగా శ్రీముఖి & రాహుల్ సిప్లిగంజ్ ల మధ్య ఇంతకముందు ఉన్న గ్యాప్ ఇంకాస్త పెరిగింది అనే చెప్పాలి . దాని తాలూకా సంకేతాలు మనకి నిన్నటి ఎపిసోడ్ లో ప్రత్యక్షంగా కనపడ్డాయి.

అవేంటంటే - నిన్న బిగ్ బాస్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ డే టాస్క్ లో మహానటి సావిత్రిగా శ్రీముఖి నటించడం & అందుకు సంబందించిన పాటలో రాహుల్ & అలీ రెజా ని నటించమని అడగగా వారిద్దరూ నిరాకరించడం జరిగింది. అదే సమయంలో రాహుల్ సిప్లిగంజ్ అమ్మ సుధారాణి ఇంటికి వచ్చిన సమయంలో ఆమెతో పునర్నవి గురించి శ్రీముఖి అడగడం కూడా రాహుల్ సిప్లిగంజ్ కి ఏమాత్రం నచ్చలేదు. ఈ విషయాన్ని తను ఇంటి సభ్యులతో వెల్లడించాడు. 

నిన్నటి ఎపిసోడ్ లో అలీ రెజా & రాహుల్ సిప్లిగంజ్ లు కిచెన్ లోకి వెళ్లి స్వయంగా కాఫీ పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా పరోక్షంగా రాహుల్ సిప్లిగంజ్ (rahul sipligunj) & శ్రీముఖి (sreemukhi) లు ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకోవడం కనిపించింది. అలాగే బాబా భాస్కర్ పైన కూడా రాహుల్ సిప్లిగంజ్ & అలీ రెజా లు కామెంట్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వరుణ్ సందేశ్ & వితికకి ఇలా అనవసరంగా కామెంట్స్ చేస్తున్నారు అని శ్రీముఖి చెప్పింది. అయితే ఈ సన్నివేశాలు అన్ సీన్ లో చూపెట్టగా నిన్న టీవీలలో ప్రసారమైన ఎపిసోడ్ లో మాత్రం వీటి తాలూకా సన్నివేశాలు కనిపించలేదు.

ఇదిలావుండగా నిన్న ఎంటర్టైన్మెంట్ డే లో భాగంగా బాషా పాత్రలో బాబా భాస్కర్ జీవించేయగా.. మహానటి చిత్రంలో సావిత్రి లాగ శ్రీముఖి - 'నాగేశ్వరావు వచ్చారా?' అంటూ అచ్ఛం అలాగే నటించడానికి ప్రయత్నించింది. వీరిలాగే బాహుబలి సినిమా పాత్రల్లో జీవించే ప్రయత్నం చేశారు వరుణ్ సందేశ్ & వితిక. వరుణ్ సందేశ్ బాహుబలి & వితిక దేవసేనగా నటించడం జరిగింది. అలీ రెజా విషయానికి వస్తే గజినీ చిత్రంలో సూర్యలాగా నటించాడు. ఇక చంద్రముఖిగా శివజ్యోతి కూడా ఫర్వాలేదనిపించింది.

అలీ కి రొమాంటిక్ ట్రీట్.. బాబా భాస్కర్ కి ఫ్యామిలీ ప్యాక్ ఆనందం..

ఇదంతా ఒకెత్తయితే, కాంచన పాత్రలో రాహుల్ సిప్లిగంజ్ చేసిన డ్యాన్స్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది. కాంచన పాత్ర ఎలాగైతే ఉంటుందో సరిగ్గా అలాగే నటించాడు రాహుల్ సిప్లిగంజ్. ఇప్పటికే బిగ్ బాస్ లో రాహుల్ కి పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్.. ఈ డ్యాన్స్ చూశాక మరింతగా పెరుగుతుంది అని చెప్పాలి.

మొత్తానికి నిన్నటి రోజు మొత్తం ఎంటెర్టైన్ మెంట్ పేరిట బిగ్ బాస్ ఇంటి సభ్యులంతా కూడా తమ టాలెంట్ ని చూపించే ప్రయత్నం చేశారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున ఈ 13వ వారంలో ఇంటిసభ్యుల ప్రవర్తన గురించి మాట్లాడడం & ఇంటిలో ఉన్న అందరూ కూడా నామినేట్ అయిన ఈ తరుణంలో ఎవరు ముందుగా సేఫ్ జోన్ లో ఉంటారు అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

ఈ వీకెండ్ ఎపిసోడ్స్ అయితే ఆసక్తికరంగా సాగుతాయి అని అర్ధమవుతుంది. మరి హోస్ట్ గా నాగార్జున ఈవారం ఏం ప్రత్యేకత చూపబోతున్నారో అనే దాని పైన అందరి దృష్టి నెలకొంది.

Bigg Boss Telugu 3 : వరుణ్ సందేశ్ & శివజ్యోతి కారణంగా నామినేషన్స్ లోకి మొత్తం ఇంటిసభ్యులు