ADVERTISEMENT
home / Celebrity Weddings
పెళ్లికి సిద్ధమైన మరో నటి.. ఎంగేజ్ మెంట్‌తో అందరికీ సర్ ప్రైజ్..!

పెళ్లికి సిద్ధమైన మరో నటి.. ఎంగేజ్ మెంట్‌తో అందరికీ సర్ ప్రైజ్..!

అమీ జాక్సన్ (amy jackson).. రోబో 2.0, ఐ వంటి చిత్రాలతో కథానాయికగా మనందరికీ సుపరిచితమైన బ్రిటిష్ నటి. 2.0 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అమీ బ్రిటన్‌కి చెందిన బిజినెస్ మ్యాన్ జార్జ్ పనాయొటోతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ కొనసాగిస్తోంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో అందమైన పెద్ద డైమండ్ రింగ్‌ని తొడిగి.. తాను పనాయొటోను పెళ్లాడేందుకు ఒప్పుకున్న సంగతిని వెల్లడించిన ఈ బ్యూటీ.. తాజాగా ఎంగేజ్‌మెంట్‌తో (Engagement)  ఒక్కటైన ఆనందాన్ని కూడా పంచుకుంది.

ఈ ఏడాది మొదటి రోజునే జాంబియాలో హాలిడే ఎంజాయ్ చేస్తున్న తామిద్ద‌రి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. 1 జ‌న‌వ‌రి నా జీవితంలో కొత్త అడ్వెంచర్ ని ప్రారంభిస్తున్నా .. ఐ ల‌వ్ యూ.. ప్ర‌పంచంలోనే ల‌క్కీయెస్ట్ అమ్మాయిగా న‌న్ను చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నా.. అంటూ తన ప్రపోజల్ గురించి ప్ర‌క‌టించింది అమీ.

తాజాగా తన బాయ్ ఫ్రెండ్ పనాయొటోతో ఎంగేజ్ మెంట్ చేసుకొని తమ బంధాన్ని మరింత దగ్గర చేసింది అమీ. మే 5న (భారత కాలమానం ప్రకారం మే 6 తేదిన) తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య లండన్‌లో నిశ్చితార్థం చేసుకుంది అమీ.. ఈ ఎంగేజ్‌మెంట్ సెలబ్రేషన్ కోసం అద్భుతంగా డిజైన్ చేసిన నలుపు, తెలుపు రంగుల గౌన్ ధరించింది అమీ జాక్సన్. ఆమె బాయ్ ఫ్రెండ్ జార్జ్ వైట్ సూట్ ధరించాడు.

ADVERTISEMENT

ఈ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫొటోను పంచుకుంటూ “ఈ రోజు నా జీవితంలో నమ్మలేనిది. మా ఎంగేజ్‌మెంట్ జరిగింది. నా అద్భుతమైన స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మీరందరూ ఈ ప్రత్యేకమైన రోజును మీ ప్రేమతో మరింత ప్రత్యేకంగా మార్చేశారు. మాకోసం గ్రీక్ పద్ధతులతో మా ఎంగేజ్ మెంట్ జరిపించారు..” అంటూ పోస్ట్ చేసింది అమీ.

ఈ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన మరికొన్ని వీడియోలు కూడా బయటకొచ్చాయి. ఇందులో భాగంగా అమీ, జార్జ్ డ్యాన్స్ చేస్తూ ఆనందంగా గడుపుతున్న వీడియోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

4

తన ప్రేమ విషయం బయటకు వెల్లడించిన తర్వాత మార్చి 31న బ్రిటిష్ మాతృ దినోత్స‌వం సందర్భంగా తాను తల్లి కాబోతున్నా అన్న విషయాన్ని కూడా అమీ పంచుకోవడం విశేషం. సాయంత్రం సూర్య‌కాంతిలో అమీ జాక్స‌న్‌, ఆమె బాయ్‌ఫ్రెండ్ జార్జ్ నిల‌బ‌డి ఉండ‌గా.. జార్జ్ అమీ త‌ల‌పై ముద్దు పెడుతున్న ఫొటోను తను పంచుకుంది.ఈ ఫొటోలో అమీ బేబీ బంప్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డం విశేషం. 

ADVERTISEMENT

ఈ ఫోటో షేర్ చేసుకుంటూ ఈ ప్ర‌పంచంలో అన్నింటికంటే అంద‌రికంటే నిన్నే ఎక్కువ‌గా ప్రేమించడం ప్రారంభించాను. నీపై నా ప్రేమ ఎంతో స్వ‌చ్ఛ‌మైన‌ది. ఎందుకంటే నిన్ను ఎంతో నిజాయ‌తీగా ప్రేమిస్తున్నా. నిన్ను చూసేందుకు ఎంతగానో వేచి చూస్తున్నా.. అంటూ పోస్ట్‌చేసింది అమీ జాక్స‌న్‌.

గతంలో జార్జ్‌తో కలిసి బ్రిటన్‌కి చెందిన హలో మ్యాగజైన్ కవర్ పేజీ పై దర్శనమిచ్చిన అమీ తాజాగా కంట్రీ అండ్ టౌన్ హౌజ్ అనే మ్యాగజైన్ కవర్ పేజీపై కూడా మెరిసింది.

2

తాజాగా ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భవిష్యత్ ప్రణాళిక గురించి వెల్లడించింది అమీ. ప్రెగ్నెన్సీ గురించి చెబుతూ.. ప్రస్తుతం మేమున్న స్థానంలో మాకు త్వరలో పుట్టనున్న బిడ్డ సంరక్షణ నిమిత్తం బాధ్యతలు నిర్వర్తించేందుకు మేమిద్దరం పూర్తిగా సిద్ధంగా ఉన్నామని నా భావన. మనం జీవితంలో దేన్ని ప్లాన్ చేసుకోకూడదని నా ఫీలింగ్. ప్రస్తుతం మేమిద్దరం ఎంతో ఆనందంగా ఉన్నాం. మా ఇద్దరికీ ఓ అందమైన ఇల్లుంది. మేం తల్లిదండ్రులుగా మారేందుకు ఎంతో ఆత్రుతతో వేచి చూస్తున్నాం.. అని చెప్పింది అమీ.

ADVERTISEMENT

అంతేకాదు.. తనకు కాబోయే భర్త గురించి చెబుతూ.. “మా ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. మంచి, చెడు అన్నీ తెలుసు. ఇంతకుముందు కూడా మేం ఎవరూ దూరం చేయలేనంత దగ్గరగా ఉన్నాం. .కానీ ఇప్పుడు పరిస్థితి వేరు” అంటూ పెళ్లిలోని ఆ ఫీలింగ్ గురించి పంచుకుంది.

1

ఓ ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం అమీ తన పెళ్లి గురించి కూడా చెప్పిందట. వీరిద్దరి వివాహం గ్రీక్ పద్ధతిలో జరగనుందట. గ్రీస్ దేశంలోని ఓ బీచ్‌లో పెళ్లి చేసుకోవాలన్న వీరిద్దరి ఆకాంక్షలకు అనుగుణంగా ఉండే పెళ్లి వేదిక కోసం వెతుకుతోందట ఈ జంట. ప్రస్తుతం మైకనోస్ ఐల్యాండ్ పక్కనున్న రిసార్ట్‌లలో తమ పెళ్లి వేడుకలకు తగిన ప్లేస్ వెతుకుతోందట ఈ అందాల జంట.

5 5394106

ADVERTISEMENT

క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం గ్రీకు పద్ధతిలో వీరి పెళ్లి జరగనుంది. పెళ్లయ్యాక కూడా లండన్‌లోనే స్థిరపడాలన్న ఆలోచనతో ఉందట ఈ జంట. జార్జ్ అక్కడ ప్రాపర్టీ డెవలపర్‌గా బిజినెస్ చేస్తూనే హిల్టన్, డబుల్ ట్రీ, పార్క్ ప్లాజా వంటి హోటల్స్ చైన్‌ను కొనసాగిస్తున్నారు. కేవలం ఇదే కాదు.. అతడి తండ్రి ఆండ్రియాస్ పనయొటా స్థాపించిన ఎబిలిటీ గ్రూప్ బాధ్యతలు కూడా అతడే చూసుకుంటూ ఉండడం విశేషం.

మరి, బిడ్డ పుట్టిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత అమీ సినిమాల్లో కొనసాగుతుందా? లేక లండన్‌లోనే స్థిరపడిపోతుందా? అన్న విషయం మాత్రం వేచి చూసి తెలుసుకోవాల్సిందే.

ఇవి కూడా చదవండి.

అమ్మతనంలోని అనుభూతే వేరు.. నేను తల్లిని కాబోతున్నా: అమీ జాక్సన్

ADVERTISEMENT

ప్రేమకు.. వయసు అడ్డంకి కాదు: మలైకా, అర్జున్ కపూర్‌ల పెళ్లి డేట్ ఫిక్స్..!

గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్‌కి ప‌రిచ‌య‌మైన‌ప్పుడు.. ఈ అందాల రాశులు ఎలా ఉన్నారంటే..!

06 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT