ప్రేమకు.. వయసు అడ్డంకి కాదు: మలైకా, అర్జున్ కపూర్‌ల పెళ్లి డేట్ ఫిక్స్..!

ప్రేమకు.. వయసు అడ్డంకి కాదు: మలైకా, అర్జున్ కపూర్‌ల పెళ్లి డేట్ ఫిక్స్..!

మ‌లైకా అరోరా (Malaika arora), అర్జున్ క‌పూర్‌ (Arjun kapoor).. బాలీవుడ్ ప్రేమ ప‌క్షులు.. అర్భాజ్ ఖాన్‌కి విడాకులు ఇచ్చిన త‌ర్వాత వీరిద్ద‌రి సాన్నిహిత్యం చూసి చాలామంది వీరిద్ద‌రూ ప్రేమించుకుంటున్నార‌ని భావించారు. మీడియాలో దీని గురించి ఎన్నో వార్త‌లు వ‌స్తున్నా.. దీనిపై స్పందించేందుకు అటు మ‌లైక.. కానీ ఇటు అర్జున్ కానీ ఇష్ట‌ప‌డ‌లేదు.


ఎప్పుడైనా ఈ విష‌యం గురించి అడిగితే అదేమీ లేదు. ఇదంతా కేవ‌లం మీడియా మాయాజాలం అంటూ త‌ప్పించుకునేవారు. కానీ మాట‌ల కంటే చేత‌లే ఎక్కువ విష‌యాలు చెబుతాయ‌న్న‌ట్లు.. వీరి సాన్నిహిత్యం వీరి మాట‌ల‌కు వ్య‌తిరేకంగా ఉండేది. అయితే ఈ సాన్నిహిత్యం ఇప్పుడు వివాహ‌బంధంగా మారబోతోంద‌ని ఈ ఇద్ద‌రి స‌న్నిహితులు చెబుతుండ‌డం విశేషం.


46793334 963119747207163 5146402815835122786 n


తాజా బాలీవుడ్ వ‌ర్గాల సమాచారం మేర‌కు ఈ ఇద్ద‌రూ ఏప్రిల్ 19న వివాహమాడ‌నున్నార‌ట‌. వీరి వివాహం సింపుల్‌గా చ‌ర్చిలో జ‌ర‌గనుంద‌ని వారి స‌న్నిహితుల నుంచి స‌మాచారం అందుతోంది. ఈ వివాహానికి చాలా ద‌గ్గ‌రి బంధువుల‌తో పాటు ఇద్ద‌రి స్నేహితులను మాత్ర‌మే పిల‌వ‌నున్నార‌ట‌.


బాలీవుడ్ నుంచి ఈ వివాహానికి హాజ‌ర‌య్యేవారిలో క‌పూర్ కుటుంబంతో పాటు మ‌లైక స్నేహితులు క‌రీనా, క‌రిష్మాలు, అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ ర‌ణ్‌వీర్‌, దీపిక‌లు కూడా ఉన్నార‌ట‌. త‌మ మ‌ధ్య ఉన్న బంధం గురించి ఇటీవ‌లే ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్ప‌క‌నే చెప్పింది మ‌లైక.


సాధార‌ణంగా ప్ర‌తిఒక్క‌రూ జీవితంలో చేదు జ్ఞాప‌కాలు ఎదురైనా ముందుకు సాగిపోవాల‌ని కోరుకుంటారు. త‌మకు న‌చ్చిన వారితో ప్రేమ‌, రిలేష‌న్‌షిప్ కొన‌సాగించాల‌ని భావిస్తారు. అలా మీకెవ‌రైనా దొరికితే మీరు చాలా అదృష్ట‌వంతుల‌ని చెప్పుకోవాలి.


రెండోసారి అర్థం చేసుకునే వ్య‌క్తి దొర‌క‌డం, త‌నతో జీవితాన్ని ఆనందంగా గ‌డ‌ప‌డం అనేది చాలా త‌క్కువ మంది అదృష్ట‌వంతులకు ఎదుర‌య్యే అవ‌కాశం. నా చుట్టు ఉన్న‌వాళ్లు ఎన్ని చెప్పినా నా జీవితం గురించి నేనే ఓ నిర్ణ‌యం తీసుకున్నా. అది నాకెంతో ఆనందాన్ని అందిస్తోంది.. అంటూ న‌ర్మ‌గ‌ర్భంగా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టింది.




 

 

 


View this post on Instagram


 

 

Tippy tippy top, how many #couples can you spot? . #KapoorKhandaan #EverydayPhenomenal #FamilyVacation


A post shared by #POPxoDaily (@popxodaily) on





పెళ్లి గురించి వ‌స్తున్న వార్త‌ల‌ను ఈ ఇద్ద‌రి స‌న్నిహితులు గాని, వీరు కానీ అధికారికంగా ధృవీక‌రించ‌క‌పోయినా.. ఈ మ‌ధ్య తార‌లంద‌రి పెళ్లిళ్ల‌కు ముందు ఇలాగే వార్త‌లు రావ‌డం త‌ర్వాత అవి నిజం కావ‌డం చూస్తున్నాం. కాబ‌ట్టి వీరిద్ద‌రు కూడా క్రిస్టియ‌న్ వెడ్డింగ్ ద్వారా ఒక్క‌ట‌వ్వ‌నున్నార‌న్న వార్త నిజ‌మే అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


దీంతో పాటు తాజాగా వీరిద్ద‌రూ మీడియా ముందు కూడా ఒక్క‌టిగానే క‌నిపించ‌డం.. స్నేహితుల‌తో క‌లిసి చేసుకున్న పార్టీల్లో ఇద్ద‌రూ క‌లిసి క‌నిపించ‌డం ఈ వార్త‌లు వాస్త‌వమేన‌ని అనిపించేలా చేస్తున్నాయి. వీరిద్ద‌రూ త‌మ పెళ్లిని ప్రైవేట్‌గా మీడియాకి దూరంగా కేవ‌లం కుటుంబ స‌భ్యులు స్నేహితుల స‌మ‌క్షంలో చేసుకోవాల‌ని భావించ‌డం వ‌ల్ల ఈ వార్త‌ల‌ను బ‌య‌ట‌కు వెల్లడించ‌వ‌ద్ద‌ని త‌మ స్నేహితుల‌కు చెప్పిన‌ట్లుగా స‌మాచారం. అందుకే పెళ్లిని కూడా గ్రాండ్‌గా కాకుండా సింపుల్‌గా చ‌ర్చిలో చేసుకోనున్నార‌ట‌..!


54513840 263765034557058 655049650010345378 n


పెళ్లి అన‌గానే తెల్ల‌ని గౌనులో మ‌లైక ఎంత అందంగా ఉంటుందో అని వూహించుకోవ‌డంలో ప‌డిపోయారా? మ‌రి, మ‌లైక బ్రైడ్స్ మెయిడ్‌గా ఎవ‌రుంటారని మీరు భావిస్తున్నారు? త‌న స్నేహితురాలు క‌రీనా ఈ స్థానాన్ని తీసుకోబోతోంద‌ట‌. అంతేకాదు.. ఈ పెళ్లిలో ర‌ణ్‌వీర్ బెస్ట్‌మ్యాన్‌గా మారి త‌న బెస్ట్ బ‌డ్డీ అర్జున్ పెళ్లిని జ‌రిపించ‌నున్నాడ‌ట‌. మ‌రి, వివాహ‌ బంధంతో ఒక్క‌టి కానున్న ఈ జంట‌కు మ‌న‌మూ ఆల్ ద బెస్ట్ చెప్పేద్దామా?


సెలబ్రిటీ టాక్: ప్రేమబంధం కలకాలం.. నిలవాలంటే ఏం చేయాలి ..?


సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నిఖాతో ఒక్క‌టైన ప్రేమ‌జంట.. ఆర్య‌ - సాయేషా..!


ఈ వ‌ధువులు త‌మ భ‌ర్త‌ల‌కు తాళి క‌ట్టారు.. కానీ ఇది "జంబ‌ల‌కిడిపంబ" కాదు..!


Images : Instagram