ADVERTISEMENT
home / Celebrity Weddings
సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నిఖాతో ఒక్క‌టైన ప్రేమ‌జంట.. ఆర్య‌ – సాయేషా..!

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నిఖాతో ఒక్క‌టైన ప్రేమ‌జంట.. ఆర్య‌ – సాయేషా..!

ఆర్య‌- సాయేషా(Arya-sayyesha).. ప్ర‌స్తుతం ద‌క్షిణాది సినిమా ఇండ‌స్ట్రీలో హాట్ పెయిర్ వీరిది. గ‌జినీకాంత్ సినిమా షూటింగ్‌లో మొద‌లైన త‌మ ప్రేమ‌ను ఇరు కుటుంబాల సాక్షిగా ప‌రిణ‌యంగా మార్చుకున్నారు వీరిద్ద‌రూ.. హైదరాబాద్‌లోని తాజ్ ఫ‌ల‌క్‌నుమా వేదిక‌గా జ‌రిగిన వీరి పెళ్లి (wedding) వేడుక‌ల‌కు ఇటు టాలీవుడ్‌, కోలీవుడ్ నుంచే కాదు.. బాలీవుడ్ నుంచి కూడా ప‌లువురు ప్ర‌ముఖులు విచ్చేయ‌డం విశేషం. సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన నిఖా వేడుక ద్వారా వీరిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు.

ఆర్య‌- సాయేషా.. గ‌జనీకాంత్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డిన ఈ ఇద్ద‌రూ త‌మ ప్రేమ‌కు ఇరు కుటుంబాల అనుమ‌తి ల‌భించిన త‌ర్వాత గ‌త నెల‌లో ప్రేమికుల రోజు సంద‌ర్భంగా త‌మ ప్రేమ విష‌యం అంద‌రికీ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. త‌మ పెళ్లి మార్చి 9, 10 తేదీల్లో జ‌ర‌గ‌నుంద‌ని కూడా సోష‌ల్‌మీడియాలో పంచుకుందీ జంట‌. అప్ప‌టినుంచి వీరి పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు అంద‌రూ ఎంత‌గానో ఎదురుచూసిన ఆ నిమిషం రానే వ‌చ్చింది. తాజ్ ఫ‌ల‌క్‌నుమా వేదిక‌గా మెహెందీ, సంగీత్‌, ప్రీవెడ్డింగ్ రిసెప్ష‌న్ జ‌రుపుకున్న ఈ జంట ఆ త‌ర్వాత ఆదివారం రాత్రి వారిద్ద‌రి మ‌త సంప్ర‌దాయ వివాహ వేడుకైన నిఖా ద్వారా ఒక్క‌ట‌య్యారు. (ఆర్య ముస్లిం మ‌త‌స్థుడు.. త‌న అస‌లు పేరు జంషెడ్ సెత్రికాంత్‌).

D1Rk1DjVAAAwgeh

తాజ్ ఫ‌ల‌క్‌నుమాలో గ్రాండ్‌గా జ‌రిగిన ప్రీవెడ్డింగ్ రిసెప్ష‌న్ నుంచి పెళ్లి వ‌ర‌కూ ఈ జంట సాయేషా త‌ల్లి షాహీన్ డిజైన్ చేసిన దుస్తుల‌నే ధ‌రించింది. ప్రీవెడ్డింగ్ వేడుక‌ల‌కు సిల్వ‌ర్‌, క్రీమ్ రంగుల క‌ల‌యిక‌గా ఉన్న లెహెంగాను ధ‌రించిన సాయేషా దానికి డైమండ్ జ్యుయ‌ల‌రీని పెయిర్ చేసి అచ్చం రాకుమారిలా మెరిసిపోయింది. సాయేషా డ్ర‌స్‌కి మ్యాచింగ్‌గా అదే రంగు రంగు కుర్తా, ఎంబ్రాయిడ‌రీ చేసిన కోట్‌తో క‌నిపించాడు ఆర్య‌.

ADVERTISEMENT

D1TykksVYAAqe2s

ఈ వేడుక‌కు అల్లు అర్జున్‌, సూర్య‌, జ్యోతిక వంటి సౌతిండియ‌న్ సెలబ్రిటీల‌తో పాటు.. సంజ‌య్ క‌పూర్‌, సూర‌జ్ పంచోలీ, ఆదిత్య పంచోలీ, జ‌రీనా వాహ‌బ్‌, అంజూ మ‌హేంద్రూ, ఖుషీ క‌పూర్‌లు హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌ల్లో బంధుమిత్రుల‌తో పాటు వ‌ధూవ‌రులిద్ద‌రూ సంతోషంగా నృత్యాలు చేయ‌డం విశేషం.

D1VlOtOU8AEuD35

ఆపై ఆదివారం రాత్రి జ‌రిగిన నిఖా వేడుక‌లో ఇరు కుటుంబ స‌భ్యుల‌తో పాటు బంధువులు, అతికొద్ది మంది స్నేహితులు మాత్ర‌మే పాల్గొన్నారు. ఈ వేడుక‌ల‌కు సాయేషా ఎరుపు, బంగారు రంగుల క‌ల‌యిక‌తో ఉన్న హెవీ ఎంబ్రాయిడ‌రీ లెహెంగా ధ‌రించింది. దానితో పాటు అన్‌క‌ట్ డైమండ్ జ్యుయ‌ల‌రీ ధ‌రించి.. అద్భుతంగా క‌నిపించింది. ఇక ఆర్య న‌లుపు రంగు ఎంబ్రాయిడ‌రీ బంధ్‌గ‌లా కుర్తాతో మెరిసిపోయాడు. ప్యాల‌స్ నుంచి పెళ్లి వేదిక వ‌ర‌కూ ఆర్య గుర్ర‌పు బండిలో రాగా.. సాయేషా ప‌ల్లకిలో వ‌చ్చింది. సాయేషా ప‌ల్ల‌కిని ద‌ర్శ‌కుడు విజ‌య్ కూడా మోయ‌డం విశేషం. ఇద్ద‌రూ నిఖానామాపై సంత‌కాలు చేసి.. ఉంగ‌రాలు, దండ‌లు మార్చుకున్నారు. ఈ పెళ్లి వేడుక‌ల‌కు సాయేషా నాన‌మ్మ‌, తాత అయిన దిలీప్ కుమార్, సైరా భానులు పెద్ద‌లుగా వ్య‌వ‌హ‌రించారు.

ADVERTISEMENT

52587391 191637641820018 4077804187414474847 n

ఈ వేడుక‌ల్లో ద‌క్షిణాది సినిమా ఇండ‌స్ట్రీ నుంచి రానా, విశాల్, సూర్య‌, కార్తీ, ద‌ర్శ‌కుడు విజ‌య్ త‌దిత‌రులు పాల్గొన్నారు. రిసెప్ష‌న్ సంద‌ర్భంగా ఫ‌ల‌క్‌నుమా ప్యాల‌స్‌ని ఎరుపు రంగు గులాబీల‌తో అలంక‌రించ‌గా.. పెళ్లికి రంగురంగుల గులాబీల‌తో పాటు లీల్లీలు కూడా అలంక‌ర‌ణ‌లో భాగ‌మ‌య్యాయి. తెలుపు రంగు ప‌ర‌దాల‌తో ప్యాలెస్ ఆవ‌ర‌ణ అద్భుతంగా క‌నిపించింది.

D1Tvq1KXcAA5MNQ

పెళ్లి వేడుక‌లో బిజీగా ఉన్నా.. ద‌ర్శ‌కుడు శ‌క్తి సౌంద‌ర్‌రాజ‌న్ పుట్టిన రోజును జ‌రిపించిందీ జంట‌. ఆయ‌న‌తో కేక్ క‌ట్ చేయించి పుట్టిన రోజును మ‌రింత‌ ప్ర‌త్యేకంగా మార్చింది. దీనికి ఆయ‌న ప్ర‌త్యేకంగా సోష‌ల్ మీడియా ద్వారా వారికి శుభాకాంక్ష‌ల‌తో పాటు ధ‌న్య‌వాదాలు కూడా తెలియ‌జేశారు. వీరిద్ద‌రి వివాహం సంద‌ర్భంగా అభిమానులు #aryawedssayesha ద్వారా వీరి ఫొటోల‌తో పాటు త‌మ ఆనందాన్ని కూడా పంచుకుంటున్నారు.

ADVERTISEMENT

మ‌రి, వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించ‌నున్న ఈ ప్రేమ‌జంటకు మ‌న‌మూ శుభాకాంక్ష‌లు చెప్పేద్దామా?

ఇవి కూడా చ‌ద‌వండి..

సెలబ్రిటీ టాక్: ప్రేమబంధం కలకాలం.. నిలవాలంటే ఏం చేయాలి ..?

పెళ్లి కూతురికి .. ప‌సుపు ఎందుకు రాస్తారో మీకు తెలుసా??

ADVERTISEMENT

ప‌చ్చ‌ని కొండ‌ల‌నే.. పెళ్లి వేదిక‌గా చేసుకున్న ప్రేమ జంట‌..!

Images : Arya fans club twitter

11 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT