Advertisement

Bigg Boss

Bigg Boss Telugu 3: టాస్క్ సందర్భంగా.. ఇంటిసభ్యుల మధ్య గొడవలు ..!

Sandeep ThatlaSandeep Thatla  |  Sep 3, 2019
Bigg Boss Telugu 3:  టాస్క్ సందర్భంగా.. ఇంటిసభ్యుల మధ్య గొడవలు ..!

Advertisement

గత రెండు సీజన్స్‌తో పోలిస్తే.. ఈ సీజన్‌లో ఇంటి సభ్యుల్లో పోటీతత్వం కనపడడం లేదు. ఇదీ “బిగ్ బాస్ తెలుగు సీజన్ 3″ని (Bigg Boss Telugu) ఫాలో అవుతున్న వీక్షకులలో చాలామందికి కలిగిన అభిప్రాయం. బిగ్ బాస్ టైటిల్ గెలవడం కోసం సీరియస్‌గా గేమ్ ఆడుతున్న ఇంటి సభ్యులు ఒకరిద్దరే ఉండడంతో… సహజంగానే షో పై వీక్షకులకు ఆసక్తి తగ్గుతూ వస్తోంది. 

ఈ తరుణంలో బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో నిన్న ఇంటి సభ్యులకి (Housemates) ఇచ్చిన వీక్లి టాస్క్ (Weekly Task)- ‘దొంగలు దోచిన నగరం’ కాస్త వైవిధ్యంగా సాగింది. అటు ఇంటి సభ్యులలోనే కాకుండా.. ఇటు వీక్షకులలో కూడా ఆసక్తిని పెంచింది. ఆ టాస్క్‌కి ముందు, బిగ్ బాస్ హౌస్ ప్రాంగణంలోకి దాాదాపు ఓ 30 మంది ముసుగు దొంగలు ప్రవేశించారు. తర్వాత వారు తమ చేతికి దొరికిన వస్తువులను ఎత్తుకెళ్ళారు.

Bigg Boss Telugu 3: బిగ్‌బాస్ హౌస్‌లోని వెన్నుపోటుదారుల గురించి తెలుసా..?

అలా ఎత్తుకెళ్లిన వస్తువులని తిరిగి దక్కించుకోడానికి.. హౌస్ మేట్స్‌కి ఈ టాస్క్‌ని ఇవ్వడం జరిగింది. ఇక ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు రెండు టీమ్‌‌లుగా విభజించబడ్డారు. అందులో ఒకరిది దొంగల టీమ్ అయితే.. మరొకరిది ఎత్తుకెళ్లిన వస్తువులను దక్కించుకునే టీమ్. దొంగల టీమ్ కెప్టెన్‌గా శిల్పా చక్రవర్తి వ్యవహరించగా.. రవికృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి, వరుణ్ సందేశ్, శివజ్యోతిలు.. ఆ టీమ్‌లో సభ్యులుగా చేరారు. అలాగే మరో టీమ్‌లో శ్రీముఖి, బాబా భాస్కర్, మహేష్ విట్టా, హిమజ, అలీ రెజా, వితికలు సభ్యులుగా ఉన్నారు.

తొలుత ఈ టాస్క్ ప్రకారం శిల్పా చక్రవర్తి ఫోటోలు ఉన్న వాటి పైన నల్లటి స్ప్రే చల్లడం.. దొంగల జెండాలు పీకెయ్యడం, దొంగల లీడర్ శిల్పా చక్రవర్తి చేతిలో ఉన్న తుపాకీని దొంగిలించడం మొదలైనవి ప్రత్యర్థి టీమ్ సభ్యులు చేయాలి. చివరగా స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న దొంగలు నిధిని.. అవతలి టీమ్ సభ్యులు సొంతం చేసుకోవాలి. ఇదీ టాస్క్. 

అయితే దాదాపు టాస్క్ మొదలైన కొద్దిసేపటికే దొంగల జెండాలను పీకేసి.. అలాగే దొంగల లీడర్ పోస్టర్స్‌కి నల్లటి సిరా స్ప్రే చేసి టాస్క్‌ని విజయవంతంగా పూర్తి చేసేశారు ప్రత్యర్థి టీమ్ సభ్యులు. తర్వాత  దొంగల లీడర్ తుపాకీని దొంగలించడానికి.. అలాగే స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న నిధిని కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ప్రత్యర్థుల ఎత్తుగడలను నిలువరించేందుకు.. దొంగల టీమ్ కూడా తమ శాయశక్తులా కృషి చేయడం గమనార్హం.

అయితే ఈ  తరుణంలో రెండు టీమ్స్ మధ్య పోరు తీవ్రంగా మారడమే కాకుండా.. ఒకరి పై మరొకరు శారీరకంగా కలపడే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఇంటి సభ్యులందరిని బిగ్ బాస్ వారించడం కూడా జరిగింది. అయినా సరే, ఇరు టీమ్స్ మధ్య హోరాహోరీ పోరు తప్పలేదు.

ఈ టాస్క్‌లో ఇప్పటివరకు పునర్నవి, శ్రీముఖిల మధ్య వాగ్వాదం జరగగా.. రాహుల్ సిప్లిగంజ్‌కి గాయాలు కూడా అయ్యాయి. దీనితో టాస్క్‌ని కొద్దిసేపు నిలిపివేశారు. అదే సమయంలో వరుణ్ సందేశ్, వితికల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది.

Bigg Boss Telugu 3: డబుల్ ఎలిమినేషన్‌కి ప్లాన్ చేసిన బిగ్‌బాస్?

ఇక ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో టాస్క్ ఇంకా కొనసాగుతున్నట్టు చూపించారు. అలాగే ఈ రోజు ఎపిసోడ్‌ ప్రోమోను బట్టి..  రెండు టీమ్స్ మధ్య చాలా టఫ్ పోరు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  ఈ ప్రోమోలో దొంగల లీడర్ శిల్పా చక్రవర్తి కంటతడి పెట్టే విజువల్స్ కూడా ప్రసారమయ్యాయి. దీన్ని బట్టి, వీక్లీ టాస్క్‌లో దొంగల టీమ్ ఓడిపోయినట్టు అర్థమవుతోంది.

అయితే ఇది ప్రోమోనే కాబట్టి.. ఇందులో అన్నీ మనకు చూపించిన విధంగానే ఉంటాయని ఊహించలం. అందుకే ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రసారమైతే కానీ.. నిజానిజాలు తెలియవు. ఇదిలావుండగా శిల్పా చక్రవర్తి & బాబా భాస్కర్‌ల మధ్య కొద్దిగా ఘాటుగానే చర్చ నడిచింది.

ఆ చర్చలో భాగంగా “తొలివారంలోనే ఇంటి నుండి శిల్పా చక్రవర్తి నిష్క్రమిస్తారు” అని చెప్పగా.. ఆ మాటలకి ఆమె ఫీలైనట్లు కూడా తెలుస్తోంది. అలాగే శిల్పా చక్రవర్తి ఇంటిలోకి రావడంతో.. ఆమెకి, శ్రీముఖికి మధ్య విభేదాలు మొదలయ్యే అవకాశాలున్నాయని.. ఇప్పటికే ఇంటి సభ్యులు గుసగుసలాడుకోవడం ప్రారంభించారు.

మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 మొదలయ్యాక.. ఏడవ వారంలో ఇంటి సభ్యుల మధ్య ఏదో విధంగా ఒక పోటీ మొదలైందని మాత్రం చెప్పగలం.

Bigg Boss Telugu 3: ఇంటి సభ్యులకి షాక్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా శిల్పా చక్రవర్తి ..!