బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో .. ప్రతి ఎపిసోడ్‌కి ఇంటిలోని సభ్యుల మధ్య సంబంధాలు మారిపోతున్నాయి. అప్పటివరకు కలిసున్న వారు.. మరుసటి రోజు రాగానే గొడవలు పడుతున్నారు. దీనికి సరైన ఉదాహరణ – శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్. వీరిరువురూ బిగ్‌బాస్ షోకి ముందు నుంచే మంచి స్నేహితులని వారే చెప్పారు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించాక మాత్రం.. వీరి మధ్య ఉన్న స్నేహం కాస్త ఆవిరైపోయింది.
బిగ్‌బాస్ తెలుగు యాంకర్ నాగార్జున చేతిలో ఉన్న.. పండు (కోతి) బొమ్మ మీకు కావాలా?
గడిచిన రెండు వారాల్లో అంతంతమాత్రంగా ఉన్న వీరి స్నేహం… మొన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్‌తో పటాపంచలైపోయింది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా గాజు బాక్స్‌లో ఉన్న ఖజానాని ఎలాగైనా సాధించాలి అన్న ఆలోచనతో.. శ్రీముఖి దానిని డంబుల్‌తో పగులగొట్టగా.. వెంటనే రవికృష్ణని కూడా అదే పని చేయమని చెప్పడంతో అతను ఆలోచించకుండా చేతితోనే ఆ బాక్స్ పగులగొట్టే ప్రయత్నం చేశాడు. దానితో అతని చేతికి గాయం కావడం.. ఆ టాస్క్ అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగాయి.
ఈ తరుణంలో శ్రీముఖి వల్లే ఇదంతా జరిగిందని… అసలు డంబుల్ పెట్టి పగులగొట్టాలన్న ఆలోచనే తప్పు అని.. తాను ఆ పని చేయడమే కాకుండా రవికృష్ణని కూడా ప్రోత్సహించిందని రాహుల్ సిప్లిగంజ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశాడు.
ఇక రాహుల్ చేసిన వ్యాఖ్యలకి వితిక, వరుణ్, పునర్నవి, రోహిణిలు మద్దతు తెలపడం గమనార్హం. అయితే వీరంతా ఒక గ్రూప్ అని ఇప్పటికే మిగతా ఇంటి సభ్యుల అభిప్రాయం. అదే సమయంలో మహేష్ విట్టా.. తనదైన శైలిలో రాహుల్ సిప్లిగంజ్ & కో.. కావాలనే శ్రీముఖిని బ్యాడ్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మిగతావారితో చెబుతున్నాడు.
ఈ మొత్తం పరిణామాలని నిశితంగా పరిశీలించిన బిగ్‌బాస్, అసలు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండే వస్తువులని పగలగొట్టడం & అటు ఇటు కదిలించడం వంటివి చేయకూడదు అని చెబుతూ.. టాస్క్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రత ప్రధానమని… అనవసరంగా గాయాల పాలవ్వకూడదని హెచ్చరించారు. ఇక రవికృష్ణకి గాయం కావడానికి పరోక్షంగా కారణమైన శ్రీముఖిని.. వచ్చే వారం ఇంటి నుండి బయటకి పంపేందుకు జరిపే నామినేషన్స్‌లో నేరుగా చేర్చినట్టుగా తెలిపారు. ఇదే ఆమెకి విధించే శిక్షగా పేర్కొన్నారు. దీనితో వచ్చే వారం నామినేషన్స్‌లో శ్రీముఖి పేరు చేరిపోయింది.
బిగ్ బాస్ తెలుగు: హిమజ, అలీ గొడవతో మొదలై… రవికృష్ణ చేతికైన గాయంతో ముగిసింది
ఇదిలావుండగా .. నిన్నటి ఎపిసోడ్‌లో కాస్త ఆసక్తికరంగా ఉన్న విషయం అలీ, పునర్నవిలకి బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్. ఈ టాస్క్‌లో భాగంగా వారిరువురూ మిగతా ఇంటి సభ్యులకి తెలియకుండా.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఒక రూమ్‌లోకి వెళ్ళాారు. అలా వెళ్లిన వారు మరలా ఇంటిలోకి తిరిగి రావాలంటే మిగతా ఇంటి సభ్యులు.. వారిద్దరి కోసం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని తెల్పడం జరిగింది.
అందులో భాగంగానే ఇంట్లో మగవారు పడుకునేందుకు ఉన్న బెడ్స్, ఇంట్లో ఉన్న పాలు & గుడ్లు తిరిగిచ్చేయాలి. వీటితో పాటు వారం రోజుల పాటు ఇంటి సభ్యులంతా చెప్పులు లేకుండా ఉండాలని షరతు పెట్టడం జరిగింది. మరి, ఈ షరతులకి ఇంటిలోని సభ్యులు ఒప్పుకున్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ఇప్పటికే ఈ ఇద్దరూ తిరిగి ఇంటికి రాకపోయినా.. తమకు ఎటువంటి ఇబ్బంది లేదు అని హిమజ & బాబా భాస్కర్ ప్రకటించి సంచలనం సృష్టించారు. అలాగే బిగ్‌బాస్ ఇంటి నియమాలని పాటించడం చాలా ముఖ్యం. దానిని ఇంటి కెప్టెన్ అయిన వరుణ్ సందేశ్ పాటించకపోవడం విచారకరం. అందుకుగాను వరుణ్‌ని ఈ సీజన్ మొత్తం కెప్టెన్ అవ్వకుండా బిగ్‌బాస్ శిక్ష విధించడం జరిగింది.
ఇంటి సభ్యులు పైన చెప్పిన త్యాగాలు చేసారా? బిగ్‌బాస్ ఇంటికి కాబోయే కొత్త కెప్టెన్ ఎవరు అనేది ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో తెలుస్తుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రివ్యూ.. టైటిల్ గెలిచే కంటెస్టెంట్ ఎవరు?