ADVERTISEMENT
home / Celebrity Life
అది కేవలం పాత్ర స్వభావం మాత్రమే.. నాది కాదు: పాయల్ రాజ్‌పుత్

అది కేవలం పాత్ర స్వభావం మాత్రమే.. నాది కాదు: పాయల్ రాజ్‌పుత్

పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput).. “ఆర్ ఎక్స్ 100” సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేయడమే కాదు.. చక్కటి బోల్డ్ క్యారెక్టర్‌కు ప్రాణం పోసి ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకుంది. అంతేనా.. సెక్సీ లుక్స్‌తో కుర్రకారు మతులు సైతం పోగొట్టింది. అయితే ఒక కథానాయికగా వెండితెరపై సహనటుడిని ముద్దాడినా లేక ఏదైనా ఫొటోషూట్‌లో కాస్త ఘాటుగా స్టిల్స్ ఇచ్చినా.. అది కేవలం ప్రొఫెషనల్ పని వరకు మాత్రమే తప్ప.. తాను వ్యక్తిగతంగా కూడా అలాంటి వ్యక్తినేనని భావించడం పూర్తిగా పొరపాటు అంటుందీ సుందరి. అంతేకాదు.. అటువంటి ఆలోచన విధానం నుండి జనాలు త్వరగా బయటపడితే బాగుంటుందని ఆశాభావం కూడా వ్యక్తం చేస్తోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ- ప్రస్తుతం నా వద్ద చాలా అవకాశాలు వస్తున్నాయి. వాటిలో నచ్చినవాటిని ఎంపిక చేసుకుంటూ.. నాకంటూ కాస్త ప్రత్యేకించి సమయం కేటాయించుకోవడానికి కూడా టైం లేనంత బిజీగా గడుపుతున్నాను.

అయితే ఒక స్టార్ కావాలనుకునేవారు ఈ పరిస్థితిలోనే సంతోషంగా ఉండగలరు. అంతా బాగుందని ఎంత సంతోషించినా.. నా మనసులో కూడా ఓ బాధ అలాగే ఉండిపోయింది. అదేంటంటే.. నా మొదటి చిత్రంలో కథ కారణంగా ఒక సెక్సీ సైరన్‌గా.. ఓ బోల్డ్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రావాల్సి వచ్చింది. ఆ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో సైతం బలమైన ముద్ర వేసింది.

రేణు దేశాయ్.. ఆర్స్ ఎక్స్ 100 హీరోయిన్ ఒకే చిత్రంలో నటిస్తున్నారా..?

ADVERTISEMENT

అయితే నేను ఆ చిత్రం, అలాగే ఆయా పాత్ర నుంచి బయటకు వచ్చి.. నా తదుపరి ప్రణాళికలు, భవిష్యత్తుపై దృష్టి పెడుతున్నప్పటికీ కొందరు మాత్రం.. నన్ను ఇంకా ఆ పాత్రతో పోల్చి మాట్లాడడం మాత్రం మానట్లేదు. ఇప్పటికీ చాలామంది నేను “ఆర్ ఎక్స్ 100” సినిమాలో ఇందు పాత్ర మాదిరిగానే.. బయట కూడా చాలా బోల్డ్‌గా ఉంటానని భావిస్తున్నారు. కానీ అది పొరపాటు. నిజానికి నేను చాలా సింపుల్‌గా ఉండే సాదీసీదా అమ్మాయిని. ఇక నేను ఎందుకు అలా నటించాను అన్నది.. పూర్తిగా పాత్ర డిమాండ్‌ను బట్టి జరిగింది. కనుక తప్పలేదు.

అంతమాత్రాన నేను వ్యక్తిగతంగా కూడా అలాంటి వ్యక్తినే అని భావించడం సరికాదు. ఈ గుర్తింపు నుంచి వీలైనంత త్వరగా బయటకు రావాలని ఉంది. ఇందు పాత్రలానే.. నేనూ కఠినంగా ఉంటానని అనుకొని.. చాలామంది నన్ను సెట్స్ పై కలిసేందుకు, మాట్లాడేందుకు కూడా భయపడుతూ ఉంటారు..’ అంటూ తన మనసులోని మాటలను పంచుకుంది పాయల్.

ప్రస్తుతం నా చేతిలో చాలా అవకాశాలు ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న వెంకీ మామ, రవితేజ సరసన డిస్కో రాజా, నిర్మాణ దశలో ఉన్న మరొక తెలుగు చిత్రంతో పాటు.. మహిళా ప్రాధాన్యం ఉన్న మరో తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నాను. నేను ఎంపిక చేసుకునే ప్రతి పాత్ర విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నాను. తద్వారా నేను ఒకే తరహా పాత్రలు ఎంచుకోకుండా జాగ్రత్తపడతా.

నాగచైతన్య, వెంకటేష్ చేస్తున్న.. మూవీ మ్యాజిక్ “వెంకీ మామ” విశేషాలివే..!

ADVERTISEMENT

ఇప్పుడు నేను సెలక్ట్ చేసుకున్న పాత్రలే అందుకు ఉదాహరణ. వెంకీ మామ చిత్రంలో ఒక టీచర్ పాత్రలో కనిపించనున్న నేను.. డిస్కో రాజా చిత్రంలో ఒక బధిర (చెవిటి, మూగ) యువతిగా కనిపిస్తాను. అలాగే తెలుగులోనే మరో చిత్రంలో కోపంతో ఊగిపోయే పోలీసు అధికారిణి పాత్రలో కనిపిస్తాను. ఇలా భిన్నమైన పాత్రలు ఎంపిక చేసుకోవడం ద్వారా.. నటనలో మరిన్ని మెరుగులు దిద్దుకోవాలని భావిస్తున్నా.. అని చెప్పుకొచ్చింది పాయల్.

అలాగే క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడుతూ- ‘ఆర్ ఎక్స్ 100 సినిమాలో నన్ను చూసి వ్యక్తిగత జీవితంలోనూ.. సినిమా అవకాశాల కోసం నేను ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉంటానని చాలామంది అనుకున్నారు. అదే భావనతో నన్ను సంప్రదించినవారు కూడా ఉన్నవారు. గతేడాది మీటూ ఉద్యమం జరిగిన సమయంలో నాకు ఎదురైన అనుభవాల గురించే మాట్లాడాను. అయితే ఇలాంటి సంఘటనల గురించి కొందరు ధైర్యంగా ముందుకువచ్చి నిగ్గదీసి ప్రశ్నిస్తే.. ఇంకొందరు మాత్రం మౌనంగానే ఉండిపోతున్నారు.

కీర్తి సురేష్ & రామ్ చరణ్ .. సైమా అవార్డ్ విన్నర్స్ వీరే ..!

గతంలోనే కాదు.. నాకు భవిష్యత్తులో కూడా ఈ తరహా సమస్యలు ఎదురు కావచ్చని భావిస్తున్నాను. అలాగని అవకాశాల కోసం రాజీ పడే వ్యక్తిని నేను కాను. ఈ రోజుల్లో మనం అనుకున్నది సాధించేందుకు.. చాలా మార్గాలు ఉంటున్నాయి. వాటి ద్వారా సాధించడానికి ప్రయత్నిస్తానే తప్ప నా ఆత్మాభిమానం చంపుకోను..” అని కరాఖండిగా చెప్పేసింది పాయల్

ADVERTISEMENT

Featured Image: Instagram.com/Payal Rajput

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

28 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT