ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
మ‌జిలీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చై-సామ్ ఆడిన ఈ గేమ్స్ చూశారా?

మ‌జిలీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చై-సామ్ ఆడిన ఈ గేమ్స్ చూశారా?

నాగ‌ చైత‌న్య‌(naga chaitanya), స‌మంత(Samantha).. అభిమానులంతా ముద్దుగా చై-సామ్‌(chaisam) గా పిలుచుకునే ఈ జంట అంద‌రికీ ఫేవ‌రెట్‌.. తెలుగు తెర‌పై మెరిసే అద్భుత‌మైన జంట‌ల్లో వీళ్లూ ఒక‌రు. యువ‌త‌రం మెచ్చే జంట‌ల్లో చై-సామ్ జంట ముందుంటుంద‌ని చెప్పుకోవ‌చ్చు. 2017 అక్టోబ‌ర్‌లో పెళ్లాడిన ఈ జంట పెళ్లి త‌ర్వాత క‌లిసి న‌టించిన మొద‌టి చిత్రం మ‌జిలీ.. అయితే వీరిద్ద‌రూ అందులో ఆనందంగా గ‌డిపే జంట‌గా కాకుండా.. స‌మ‌స్య‌ల‌తో విడాకుల వ‌ర‌కూ వెళ్లే దంప‌తుల్లా క‌నిపించ‌నున్నార‌ట‌! ఈ సినిమాకి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్, ట్రైల‌ర్‌, పాట‌లు అభిమానుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంటున్నాయి.

మ‌జిలీ చిత్ర ప్ర‌మోష‌న్స్ కోసం ఈ జంట ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతోంద‌ని చెప్పుకోవ‌చ్చు.. అభిమానుల‌ను క‌ల‌వ‌డం ద‌గ్గ‌ర్నుంచి, ప్రీరిలీజ్ ఈవెంట్లు, ఇంట‌ర్వ్యూలు ఇలా అంద‌రూ చేసేవి కొన‌సాగిస్తూనే త‌మ ప్ర‌త్యేక‌త చూపించుకోవ‌డం కోసం త‌మ నుంచి అభిమానులు ఆశించే స‌మాచారం కూడా అందించేందుకు సిద్ధ‌మైందీ జంట‌. ఈ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ర‌క‌ర‌కాల గేమ్స్ ఆడుతూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోందీ జంట‌.

ఈ గేమ్స్‌లో భాగంగా తాజాగా వీరిద్ద‌రూ క‌లిసి చైసామ్ గెస్ ద వ‌ర్డ్ గేమ్ ఆడ‌డం విశేషం. ఈ ఆట‌లో భాగంగా ఇద్ద‌రిలో ఒక‌రు చెవుల‌కు హెడ్‌ఫోన్స్ పెట్టుకొని అందులో పెద్ద శ‌బ్దంతో పాట వినిపిస్తుంటే.. ఇంకొక‌రు చెప్పిన ప‌దాన్ని క‌నుక్కోవాల్సి ఉంటుంది. ముందుగా స‌మంత ఆడేందుకు సిద్ధ‌మైంది. అయితే జుట్టు పాడ‌వుతుంద‌ని ఇయ‌ర్ ఫోన్స్ కింద నుంచి పెట్టుకుంటుంటే చైత‌న్య త‌న‌ని వారించి స‌రిగ్గా పెట్టుకోమంటుంటాడు. త‌న‌కి వినిపిస్తుందో లేదో చెక్ చేయ‌డం కోసం నువ్వు అందంగా లేవు అని చెప్ప‌గా.. అదేంటో అర్థం కాక స‌మంత అమాయ‌కంగా చూడ‌డం వీక్ష‌కుల్లో న‌వ్వుల పువ్వులు పూయిస్తోంది. ఆ త‌ర్వాత చైత‌న్య చెప్పిన ప‌దాల్లో రెండింటికి మాత్రం స‌మంత స‌మాధానం చెప్ప‌లేక‌పోయింది. ఆపై త‌న ట‌ర్న్ వ‌చ్చిన‌ప్పుడు అన్నింటికీ స‌రైన స‌మాధానం చెప్పినా ఒక్క ప‌దం చెప్ప‌లేకపోయాడు చైత‌న్య‌. దీంతో 2 త‌ప్పులు చేసిన స‌మంత‌పై త‌నే విజ‌యం సాధించాడు. గేమ్ త‌ర్వాత గిఫ్ట్ హ్యాంప‌ర్ కోసం చైత‌న్య అడ‌గ‌డం విశేషం.

ఈ వీడియోను మ‌జిలీ సినిమా నిర్మించిన‌ షైన్‌స్క్రీన్ క్రియేష‌న్స్ సంస్థ ట్విట్ట‌ర్ పేజీ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఈ వీడియోకి కొన్ని గంట‌ల్లోనే మంచి స్పంద‌న రావ‌డం విశేషం. అయితే ఇలాంటి వీడియో ఇదొక్క‌టే కాదు.. దీనికి ముందు కూడా రెండు విభిన్న‌మైన వీడియోల‌ను పోస్ట్ చేసిందీ సంస్థ‌.

ADVERTISEMENT

ఇందులో ఒక వీడియో చై-సామ్ ల‌కు ఒక‌రి గురించి మ‌రొక‌రికి ఎంత తెలుసు? అన్న విష‌యాన్ని పరిశీలించి.. మ్యారీడ్ క‌పుల్ గేమ్‌ని ఆడారు. ఇందులో భాగంగా త‌న గురించి ఎవ‌రికీ తెలియ‌ని కొన్ని విశేషాల‌తో కూడిన ప్ర‌శ్న‌ల‌ను స‌మంత చైత‌న్య‌ను అడిగింది. వీటిలో కొన్నింటికి స‌మాధానం ఇచ్చిన చైతూ మ‌రికొన్నింటికి ఇవ్వ‌లేక‌పోయాడు. అలాగే స‌మంత కూడా చైతూకి సంబంధించిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పలేక‌పోయింది. అయితే ఆద్యంతం ఈ వీడియో ఆహ్లాదంగా చూసే వారి పెదాల‌పై చిరున‌వ్వు చెద‌ర‌నీయ‌కుండా సాగ‌డం విశేషం. ఈ వీడియోని కూడా షైన్‌స్క్రీన్ క్రియేష‌న్స్ అభిమానుల‌తో పంచుకుంది.

ఇవి కాక‌.. మ‌జిలీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా అభిమానుల‌ను విచిత్రంగా ఉన్న ప్ర‌శ్న‌లు, రిలేష‌న్‌షిప్ అడ్వైజ్‌ కోసం ప్ర‌శ్న‌ల‌ను సంధించ‌మ‌ని కోర‌డం జ‌రిగింది. ఇందులో కొన్ని ప్ర‌శ్న‌లు ఎంచుకొని #askchaisam పేరుతో వీడియోలో వాటికి స‌మాధానాలు చెప్పారు. అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ల‌వ్ గురూలుగా మారిన చై-సామ్ త‌మ‌కు తోచిన స‌మాధానాలు ఇవ్వ‌డం విశేషం.

షైన్‌స్క్రీన్ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ ముద్దుల జంట న‌టిస్తోన్న మ‌జిలీ చిత్రం ఏప్రిల్ 5న విడుద‌ల కానుంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో దివ్యాంశా కౌశిక్ మ‌రో క‌థానాయిక‌గా క‌నిపించ‌నుంది. పెళ్లి త‌ర్వాత చై-సామ్ క‌లిసి న‌టిస్తోన్న మొద‌టి సినిమా అయిన మ‌జిలీ విజ‌యంపై ఇప్ప‌టికే అభిమానుల్లో ఎన్నో అంచ‌నాలు కూడా ఉండ‌డం విశేషం. మ‌రి, ఈ సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను చేరుకుంటుందా? లేదా? అన్న‌ది మ‌రో రెండు రోజుల్లో చూడాల్సిందే..

ఇవి కూడా చ‌ద‌వండి.

ADVERTISEMENT

ప్రేమకు.. వయసు అడ్డంకి కాదు: మలైకా, అర్జున్ కపూర్‌ల పెళ్లి డేట్ ఫిక్స్..!

దీపిక అంద‌మైన‌ మైన‌పుబొమ్మ‌ను చూసి.. ర‌ణ్‌వీర్ ఏమ‌న్నాడో తెలుసా?

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నిఖాతో ఒక్క‌టైన ప్రేమ‌జంట.. ఆర్య‌ – సాయేషా..!

03 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT