ADVERTISEMENT
home / Bollywood
సీత అని కాకుండా.. శూర్ఫణక అని పేరు పెట్టాలా: టైటిల్ కాంట్రవర్సీలో కాజల్ సినిమా

సీత అని కాకుండా.. శూర్ఫణక అని పేరు పెట్టాలా: టైటిల్ కాంట్రవర్సీలో కాజల్ సినిమా

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) టైటిల్ రోల్‌లో తాజాగా నటించిన చిత్రం సీత (Sita). ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు తేజ (Teja) రూపొందించిన ఈ చిత్రం నేడు (మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి మాత్రం విడుదలకు ముందు కాస్త వివాదం తలెత్తింది. ఈ విషయం అందరికీ విదితమే.

ఇంతకీ ఆ వివాదం ఏంటంటే- ‘సీత’ అనే పద్ధతైన పేరు పెట్టిన ఈ చిత్రంలో ఆ పాత్ర స్వభావం, పలికే సంభాషణలు ఆ పేరుకే మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయంటూ కొన్ని సంఘాల వారు ఆరోపించారు. ఇప్పటికే విడుదల చేసిన చిత్ర ట్రైలర్ & టీజర్స్‌లో సీత పాత్ర హవాభావాలు, చెప్పే డైలాగ్స్ విన్నాక ఇంకొందరు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సినిమా టైటిల్ మార్చాల్సిందిగా డిమాండ్ చేశారు.

seetha-1

అంతేకాదు.. ఇలా అభ్యంతరం వ్యక్తం చేయడం మాత్రమే కాకుండా.. నేడు విడుదలకు సిద్ధమైన ఈ చిత్రాన్ని ఎక్కడా రిలీజ్ చేయకుండా అడ్డకుంటామని కూడా చిత్ర దర్శక – నిర్మాతలను హెచ్చరించారట. అయితే ఈ సినిమాలో సదరు వ్యక్తులు భావిస్తున్నట్లుగా ఏమీ లేదని తెలిపారు నిర్మాతలు. అలాగే సీత అనే టైటిల్ పెట్టడం ద్వారా పురాణాలను తాము కించపరచడం లేదని స్పష్టత ఇచ్చింది చిత్ర యూనిట్. కానీ ఈ సమాధానంతో సంతృప్తి చెందని సదరు సంఘాల వారు మాత్రం సినిమాను విడుదల కానిచ్చేది లేదంటూ గట్టిగా చెప్పారు. దీంతో చిత్ర దర్శకుడు తేజ కూడా వారికి గట్టిగానే బదులిచ్చారు.

ADVERTISEMENT

ఇలాంటి బెదిరింపులకు నేను ఏమాత్రం తలొగ్గను.. అయినా సినిమాకు సెన్సార్ పూర్తయి బోర్డు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చాక అడ్డుకోవడం ఏంటి?” అని దర్శకుడు తేజ అందరినీ ఎదురు ప్రశ్నించారు. “నా సినిమాకి సీత అని తీసేసి శూర్ఫణక అని పెట్టాలా ఏంటి? నా సినిమా ఎట్టి పరిస్థితుల్లోనైనా విడుదలవుతుంది. కాదని ఎవ్వరైనా అడ్డుకోవాలని చూస్తే వారికి తగిన సమాధానం చెప్తాను” అని ఘాటుగా సమాధానం ఇచ్చారు తేజ.

 

 

టైటిల్ రోల్ పోషించిన కాజల్ అగర్వాల్ సైతం ఈ చిత్రంలో అభ్యంతరాలు చెప్పే విధంగా ఏమీ లేదని, సినిమా చూసిన తర్వాత మాట్లాడాలని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. వాస్తవానికి సీత కథ రాసుకున్న తర్వాత హీరోయిన్‌గా వేరే ఎవరిని ఎంచుకోవాలా అన్న ఆలోచనలో ఉన్న దర్శకుడు తేజకి.. ఈ కథ నాకు బాగా నచ్చిందని.. ఈ చిత్రంలో తానే నటిస్తానని చెప్పిందట కాజల్. ఓ ఇంటర్య్వూలో దీని గురించి మాట్లాడుతూ- ‘ఈ కథ వినగానే నాకు చాలా బాగా నచ్చింది. సరిగ్గా నేను చేసే పాత్రలతో ప్రయోగాలు చేద్దామనుకుంటున్న తరుణంలో ఈ కథ వచ్చేసరికి దీనిని అస్సలు వదులుకోవాలని అనిపించలేదు.. అందుకే దీనిని నేనే చేస్తానని దర్శకుడికి చెప్పా..’ అంటూ తన మనసులోని మాటలను అందరితోనూ పంచుకుంది కాజల్.

ADVERTISEMENT

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌కు జతగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) నటించగా; మరో కీలక పాత్రలో సోనూ సూద్‌ని (Sonu Sood) తీసుకున్నారు. అయితే విడుదలకు ముందే వివాదపు సెగలను చవిచూసిన ఈ చిత్రం ఇటు దర్శకుడికి, అటు నటీనటులకు ఎలాంటి ఫలితం ఇవ్వనుందో తెలియాలంటే ఈ వారాంతం వరకు వేచి చూడాలి.

kajal-1

అయితే టైటిల్స్ విషయంలో సినీ నిర్మాతలు, దర్శకులు వివాదాలను ఎదుర్కోవడం ఇప్పుడు కొత్తేమీ కాదు.. మునుపు కూడా కొన్ని చిత్రాలు ఇలాంటి వివాదాలను ఎదుర్కొని కొన్ని టైటిల్స్‌ని మార్చాయి కూడా. ‘కొమరం పులి’ అనే టైటిల్‌తో విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ఆ తర్వాత ‘పులి’ గా టైటిల్ మార్చుకుంది. అలాగే హిందీలో విడుదలైన ‘పద్మావతి’ చిత్రం కూడా ‘పద్మావత్’ గా టైటిల్ మార్చుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాల జాబితా చాలా పెద్దదే అవుతుంది.

ఇవన్నీ పక్కన పెడితే గత 12 ఏళ్లుగా కాజల్ వెండితెరపై తెలుగు ప్రేక్షకుల మనసుని గెలుచుకుంటూనే ఉంది. చక్కని అందం, అంతకుమించిన అభినయంతో తెలుగు వారి అందాల చందమామగా గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ ఇండస్ట్రీలో దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించింది. గత కొద్ది కాలంగా గ్లామర్ ఉన్న పాత్రలకు కాకుండా పాత్రకు ప్రాధాన్యం ఉండే కథలనే ఎంపిక చేసుకుంటూ జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తేజ దర్శకత్వంలో రూపొందిన సీత చిత్రంలో నటించింది. మరి, ఈ చిత్రం కాజల్‌కి ఎలాంటి ఫలితం అందిస్తుంది? ఆమె ప్రయోగానికి ఎలాంటి ఫలితం లభిస్తుందో చూడాలి..

ADVERTISEMENT

 

ఇవి కూడా చదవండి

సాహో విడుదల తేదీని.. స్టైలిష్‌గా ప్రకటించిన ప్రభాస్..!

మాస్ మసాలా… పూరి జగన్నాధ్ – రామ్‌ల “ఇస్మార్ట్ శంకర్” టీజర్..!

ADVERTISEMENT

ముగింపు లేకుండా ‘సాగే’ కథ (మహేష్ బాబు ‘మహర్షి’ మూవీ రివ్యూ)

24 May 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT