మాస్ మసాలా... పూరి జగన్నాధ్ - రామ్‌ల "ఇస్మార్ట్ శంకర్" టీజర్..!

మాస్ మసాలా...  పూరి జగన్నాధ్ - రామ్‌ల "ఇస్మార్ట్ శంకర్" టీజర్..!

పతా హై!! మై కౌన్ హు?... శంకర్!! ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్...


అంటూ మొదలయ్యే ఇస్మార్ట్ శంకర్ టీజర్ (Ismart Shankar Teaser) లో ప్రేక్షకులకి మరోమారు పూరి జగన్నాధ్ (Puri Jagannadh) మార్క్ హీరో కనిపిస్తాడు. పూరి జగన్నాధ్ సినిమాల్లో హీరో పాత్రంటేనే - కాస్త పొగరు, కాస్త విరుపు & ఎవ్వరిని లెక్కచేయనితనం.. వంటి అంశాలు పుష్కలంగా నిండి ఉంటాయి. ఇక హీరో రామ్ పోతినేని (Ram Pothineni) చేసిన ఈ ఇస్మార్ట్ శంకర్ పాత్ర కూడా అచ్ఛం పూరి జగన్నాధ్ మార్క్ చిత్రాల్లో ఉండే మాస్ హీరో పాత్రల మాదిరిగానే ఉంది.


ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిందీ చిత్ర యూనిట్. "ఇస్మార్ట్" గిఫ్ట్ అంటూ ప్రేక్షకులకు అందించిన ఈ టీజర్ అందరినీ బాగానే ఆకట్టుకుంటోంది.


ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. సినిమాలో హీరో పాత్ర హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన వాడిగా మనకు కనిపిస్తుంది. హీరో పలికే సంభాషణలు సైతం హైదరాబాద్‌లో మాట్లాడుకునే నైజాం ప్రాంత మాండలికంలోనే సాగడం విశేషం. ప్రధానంగా ఈ టీజర్ లో హీరో పాత్ర పలికే సంభాషణలు కొన్ని మీకోసం

Subscribe to POPxoTV


"మామా !!! గ్యాన్ మత్ దేనా...""నాతో కిరికిరి అంటే... పోశమ్మ గుడి ముంగట పొట్టేలుని కట్టేసినట్టే!"ఈ రెండు డైలాగ్స్ వింటే చాలు.. వాటిలో పూరి జగన్నాధ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో రామ్ పోతినేని ఇంతకముందు ఎన్నడూ మనకి కనిపించని గెటప్‌లో దర్శనమిస్తున్నాడు. పోషిస్తున్నది పక్కా మాస్ పాత్ర కాబట్టి దానికి అనుగుణంగానే తన హెయిర్ స్టైల్ & శరీరాకృతిని కూడా దాదాపుగా మార్చేశాడు. అయితే ఈ గెటప్ వెనుక దర్శకుడు పూరి జగన్నాధ్ సలహాలు ఉన్నాయి అని.. ఇస్మార్ట్ శంకర్ పాత్ర తెరపైన ఇలానే కనిపించాలి అన్న ఆయన సూచనల ఆధారంగానే హీరో రామ్ తన లుక్‌ని ఇలా మార్చేశాడని చిత్రసీమలో ఓ వార్త వినిపిస్తోంది.


ఇక ఈ టీజర్ చూశాక.. త్వరలో విడుదల కానున్న ట్రైలర్ & సినిమా పై ఆసక్తి బాగానే పెరిగిందని చెప్పచ్చు. దేవదాస్, జగడం.. వంటి చిత్రాల్లో రామ్ కాస్త మాస్ ఛాయలున్న పాత్రల్లో కనిపించినప్పటికీ పూర్తి స్థాయిలో పక్కా మాస్ క్యారెక్టర్‌లో వెండితెరపై కనిపించనుండడం మాత్రం ఇదే తొలిసారని చెప్పుకోవచ్చు. దీనికి తోడు రామ్ గెటప్ కూడా ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంపొందిస్తోంది.


ismart-shankar-1


ఈ చిత్రం షూటింగ్ విషయానికి వస్తే.. సినిమాకి సంబంధించి సింహభాగం షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా.. త్వరలోనే ఒక ఫారిన్ షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారట ఇస్మార్ట్ శంకర్ యూనిట్. ఆ షెడ్యూల్ కూడా అయిపోతే.. ప్రేక్షకుల ముందుకి ఈ చిత్రం వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే!


ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని స్వయంగా పూరి జగన్నాథే నిర్మిస్తుండగా; నటి ఛార్మి కౌర్ (Charmme Kaur) కూడా ఈ చిత్రానికి సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చాలాకాలం తరువాత పూరి జగన్నాధ్ - మెలొడీ బ్రహ్మ మణి శర్మ (Mani Sharma) కలయికలో ఈ చిత్రం రానుంది. అర్జున్ రెడ్డి చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన రాజ్ తోట (Raj Thota) ఈ చిత్రానికి పని చేస్తున్నారు.


ఈ చిత్రంలో రామ్ సరసన ఇద్దరు యువ హీరోయిన్స్ నిధి అగర్వాల్ (Nidhi Agerwal) & నభ నటేష్‌లు (Nabha Natesh)  నటిస్తున్నారు. సత్యదేవ్ (Sathyadev) కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. చాలామంది హీరోలకు మాస్ పాత్రలో నటించాలని ఏదో ఒక సందర్భంలో అనిపించక మానదు. అలా రామ్ పోతినేని కల ఈ ఇస్మార్ట్ శంకర్ చిత్రం ద్వారా నెరవేరింది అని చెప్పాలి.


ఆఖరుగా- "మార్ ముంతా... ఛోడ్ చింతా..." అని ఈ టీజర్ ముగిసినట్టుగానే.. మాస్ చిత్రాలను ఎక్కువగా ఆదరించే ప్రేక్షకులకు ఈ చిత్రం వారి చింత తీర్చనుంది అనే చెప్పాలి.


Featured Image and Images: Instagram.com/PuriJagannadh


ఇవి కూడా చదవండి


ముగింపు లేకుండా 'సాగే' కథ (మహేష్ బాబు 'మహర్షి' మూవీ రివ్యూ)


కొనసాగుతున్న RRR టైటిల్ వేట.. ఆసక్తికరమైన ఎక్స్‌ప్యాన్షన్స్‌తో సినీ అభిమానుల ట్వీట్స్..!


మెగాస్టార్ చిరంజీవి సరసన.. మరో హీరోయిన్ వేటలో సైరా టీం!