ఈ రోజు (11 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కళలపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే సినీ రంగంలో ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. ఆఫీసులో ఉద్యోగస్తులు పెండింగ్ పనులను పూర్తి చేయడం మంచిది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆలుమగలు రొమాంటిక్ యాత్రలు చేస్తారు.
వృషభం (Tarus) – ఈ రోజు దుబారా లేదా నిర్లక్ష్యం కారణంగా, మీరు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవచ్చు. వ్యాపారంలో కూడా అనుకోని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధించి కొన్ని బాధ్యతలు నెరవేరుతాయి. అలాగే స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. అదేవిధంగా ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.
మిథునం (Gemini) – ఈ రోజు మీరు మీ అభిరుచికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే స్థిరాస్తులు అమ్మడం లేదా కొనడం గానీ చేస్తారు. వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికులు తమ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సినీ రంగంలో ప్రయత్నాలు చేస్తున్న ఔత్సాహికులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి.
కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అలాగే ప్రేమికులు చిత్రమైన సమస్యలలో చిక్కుకుంటారు. ఆఫీసులో ఉద్యోగస్తులు వివాదాలకు దూరంగా ఉండాలి. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలలో పురోగతి ఉంటుంది. వివాహితులు తమ పిల్లలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
సింహం (Leo) – ఈ రోజు మీ మనసు చంచలంగా ప్రవర్తిస్తుంది. తెలియని భయంతో గడుపుతారు. కొన్ని విషయాలు మీలో భావోద్వేగాన్ని కలిగిస్తాయి. అలాగే ఆదాయ, వ్యయాలలో సమతుల్యత ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. వివాహితులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. ప్రేమికులు కొన్ని విషయాలలో.. ఒకరితో మరొకరు నిజాయతీగా వ్యవహరించడం మంచిది.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కన్య (Virgo) – ఈ రోజు మీరు కొన్ని కీలక ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. అనుకున్న పనులు వేగవంతంగా జరుగుతాయి. కోర్టు లావాదేవీలతో జాగ్రత్త వహించండి. భాగస్వామితో సంబంధాలు బలంగా ఉంటాయి. ప్రేమికులు సుదూర ప్రయాణలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఫేక్ జాబ్ ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
తుల (Libra) – ఈ రోజు మీరు ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేస్తారు. సోదరుల నుండి సహకారం పొందుతారు. వివాహితులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రేమికులు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా.. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోండి.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు విద్యార్థులకు పలు ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. అలాగే వాహన వినియోగంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అవివాహితులు శుభవార్తలు వింటారు. కోర్టు లావాదేవీలు పరిష్కార దశకు వస్తాయి. ఆలుమగలు తమ జీవితానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీరు పలు కానుకలు లేదా బహుమతులు పొందుతారు. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించండి. అదేవిధంగా ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. ఆఫీసులో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో తెలియజేయడం మంచిది.
మకరం (Capricorn) – ఈ రోజు వ్యాపారస్తులు ఏజెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాదాలకు స్వస్తి పలకండి. కోపాన్ని నియంత్రించుకోండి. వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తి చేస్తే మంచిది. ఆడిట్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు మీ భాగస్వామికి మద్దతు ఉంటుంది.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభం (Aquarius) – ఈ రోజు మీరు మీ కంఫర్ట్ జోన్ వదిలి బయటకు రండి. కాస్త రిస్క్ తీసుకుని మీ కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనకు జీవితంలో ఏదైనా కావాలంటే.. అందుకు మనం శ్రమించాల్సిందే. మీరేం చేయాలనుకున్నా.. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రత్యేకించి ప్రణాళికలు రూపొందించుకొని అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి.
మీనం (Pisces) – మీ భవిష్యత్తు కోసం.. మీరు బలంగా పునాదులు వేసుకొనే అవకాశం ఉంది. అలాగే మీకు మీ ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఏదైనా ప్రాపర్టీ లేదా బంగారం కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఇది శుభదినం. మీ లక్ష్యాన్ని మీ నుండి ఎవరూ దూరం చేయలేరు. అయితే ఏ పనైనా సరే నిజాయతీగా చేయడం మంచిది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.