ఈ రోజు (ఆగస్టు 18, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు లక్ ఫ్యాక్టర్ బాగా పనిచేస్తుంది. ప్రేమికుల సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. వివాహితులకు ధన లాభం చేకూరుతుంది. విద్యార్థులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వ్యక్తులు కొంచెం కష్టపడితే.. తాము అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు. బిజినెస్ రంగంలోని వ్యక్తులు పెద్ద కాంట్రాక్టుల కోసం పావులు కదుపుతారు.
వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు శుభవార్తలు వింటారు. అలాగే కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. వివాహితులు తమ భాగస్వామితో కలిసి ప్రేమ యాత్రలు చేస్తారు. అవివాహితులు ఈ రోజు నుండి తమ పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చు. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం.
మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొంత వరకు ఒత్తిడితో గడుపుతారు. వివాహితులకు పలు సంసారిక సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో తమ భాగస్వామితో కలిసి మాట్లాడి.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ప్రేమికుల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించుకుంటే మంచిది.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఆస్తి తగాదాలు, కోర్టు కేసుల విషయంలో వివేకంతో నిర్ణయం తీసుకోండి. ప్రేమికులు తమ జీవితానికి సంబంధించి.. కొన్ని కీలక నిర్ణయాలు ఇప్పుడే తీసుకోవడం శ్రేయస్కరం. వివాహితులు తమ భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు సోమరితనం లేదా నిర్లక్ష్యం కారణంగా కొన్ని మంచి అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు తమ ఉద్యోగులపై ఓ కన్ను వేయడం మంచిది. లేదా తీవ్ర నష్టాలు సంభవించే అవకాశం ఉంది. ప్రేమికులు తమ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. మూడో వ్యక్తి ప్రమేయాన్ని అస్సలు తీసుకోవద్దు.
కన్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. వీలైతే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి. వివాహితులకు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఆసక్తి ఏర్పడుతుంది. అలాగే పలు శుభవార్తలు కూడా వింటారు. తల్లిదండ్రులు తమ బిడ్డలకు సంబంధించి మంచి విషయాలు వింటారు. అలాగే వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది.
తుల (Libra) – ఈ రోజు ఆలుమగల మధ్య మనస్పర్థలు పెరిగే అవకాశం ఉంది. కనుక ఇలాంటి విషయాల్లో సహనంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించండి. సమస్యను ఎదుటి వారి కోణం నుండి కూడా చూడడానికి ప్రయత్నించండి. అలాగే ఈ రోజు పాత స్నేహితులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. అలాగే కొత్త వ్యక్తులు కూడా మీ జీవితంలోకి ప్రవేశిస్తారు.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు యువతకు బాగా కలిసొస్తుంది. తమ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇక ప్రేమికులు తమ బంధానికి సంబంధించి నిజాయతీగా వ్యవహరించడం మంచిది. క్లారిటీ లేకుండా ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే వివాహితులు అపరిచితుల విషయంలో అప్రమత్తతతో ఉండాలి.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా అప్పులు ఇచ్చే విషయంలో లేదా తీసుకొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మహిళలు కూడా కొత్త ఆఫర్ల మోజులో పడి .. కొన్ని స్కాంల బారిన పడవచ్చు. కనుక ఆన్‌లైన్ కొనుగోళ్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. అలాగే కొత్త ఆదాయ వనరులు కూడా సమకూరుతాయి. రాజకీయ రంగంలోని వ్యక్తులు.. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే ఆరోగ్య విషయంలో.. ఈ రోజు ఈ రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. వీలైతే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోవడం అనేది బెటర్.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..
కుంభం (Aquarius) – ఈ రోజు మీ స్నేహితుల ప్రవర్తన మిమ్మల్ని బాధపెట్టే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగులకు తమ అధికారులతో స్వల్ప విభేదాలు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు కూడా పిల్లల అలవాట్లు, ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచండి. ముఖ్యంగా ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి.
మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు శారీరక సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఎంతో ఒత్తిడితో కూడా పనిచేస్తారు. కనుక మానసిక ప్రశాంతత కోసం.. ధ్యానం చేయడం ప్రారంభించండి. లేదా కొన్నాళ్లు మీ పనులకు స్వస్తి పలికి.. ఏవైనా టూరిస్ట్ ప్రాంతాలలో పర్యటించండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ.. మనోధైర్యాన్ని పెంచుకోండి.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.